న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

దయచేసి మమ్మల్ని వెళ్లనివ్వండి.. బీసీసీఐని వేడుకున్న ఉతప్ప!!

Robin Uthappa implores BCCI to allow Indians to play overseas T20 leagues

న్యూఢిల్లీ: సీనియ‌ర్ ఆట‌గాళ్ల‌కు విదేశీ లీగ్‌లు ఆడేందుకు భార‌త క్రికెట్ నియంత్ర‌ణ మండ‌లి (బీసీసీఐ) అనుమ‌తివ్వాలని టీమిండియా వెట‌ర‌న్ ఆట‌గాళ్లు సురేశ్ ‌రైనా, ఇర్ఫాన్ ప‌ఠాన్ ఇదివరకే అభిప్రాయ‌ప‌డ్డారు. భారత ఆట‌గాళ్ల‌కు ఐపీఎల్ త‌ప్ప విదేశీ లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ నిరాక‌రిస్తున్న నేప‌థ్యంలో.. వీరు ఈ వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఈ జాబితాలో మరో వెటరన్ బ్యాట్స్‌మెన్ రాబిన్ ఊతప్ప చేరాడు. విదేశీ టీ20 లీగ్స్‌లోనూ భారత క్రికెటర్లు ఆడేలా అనుమతి ఇవ్వాలని బీసీసీఐని అభ్యర్థించాడు.

<strong>వైరల్ ఫొటోలు.. మామిడిచెట్టు కోసం గంగూలీ తిప్పలు!!</strong>వైరల్ ఫొటోలు.. మామిడిచెట్టు కోసం గంగూలీ తిప్పలు!!

విదేశీ లీగ్‌లు ఆడటానికి వీల్లేదు

విదేశీ లీగ్‌లు ఆడటానికి వీల్లేదు

బీసీసీఐ నిబంధనల ప్రకారం భారత క్రికెటర్లెవరూ ఐపీఎల్ మినహా విదేశీ లీగ్‌లు ఆడటానికి వీల్లేదు. ఒకవేళ ఆడాలనుకుంటే రిటైర్మెంట్ ప్రకటించి.. బీసీసీఐ నుంచి నిరభ్యంతర పత్రం తీసుకోవాలి. దీంతో ఎన్నో విదేశీ టీ20 లీగ్స్ జరుగుతున్నా.. భారత ఆటగాళ్లు వాటిలో ఆడలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేని ఆటగాళ్లు.. ఆ నిబంధనల్ని మార్చాలని డిమాండ్ చేస్తున్నారు. టీ10 లీగ్ ఆడడం కోసం యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే.

 దయచేసి మమ్మల్ని వెళ్లనివ్వండి

దయచేసి మమ్మల్ని వెళ్లనివ్వండి

'విదేశీ టీ20 లీగ్స్‌లో ఆడేందుకు దయచేసి మమ్మల్ని వెళ్లనివ్వండి. లీగ్స్‌లో ఆడేందుకు అనుమతించకపోవడం వల్ల మేము చాలా బాధపడుతున్నాం. కనీసం ఓ రెండు లీగ్స్‌లోనైనా ఆడేందుకైనా పర్మీషన్ ఇవ్వండి ప్లీజ్. ఎందుకంటే ఓ క్రికెటర్‌గా ఏదైనా నేర్చుకోవాలంటే మ్యాచ్‌లు ఆడాలి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఈ విషయం గురించి ఆలోచిస్తాడనుకుంటున్నా. భారత క్రికెట్‌ని మరో స్థాయికి తీసుకెళ్లే సామర్థ్యం అతనికి ఉంది. దయచేసి నిజాయతీగా వ్యవహరించండి' అని బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో రాబిన్ ఊతప్ప పేర్కొన్నాడు.

బీసీసీఐ పునరాలోచించుకోవాలి:

బీసీసీఐ పునరాలోచించుకోవాలి:

ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సంద‌ర్భంగా సురేష్ రైనా మాట్లాడుతూ... 'విదేశీ లీగ్‌లు ఆడేందుకు బీసీసీఐ అనుమ‌తివ్వాలి. చాలా దేశాల‌కు చెందిన ఆట‌గాళ్లు లీగ్‌ల్లో పాల్గొన‌డం ద్వారా త‌మ ఫామ్ చాటుకుంటున్నారు. అలాంట‌ప్ప‌డు ఫ్రాంచైజీ క్రికెట్‌కు అనుమ‌తివ్వ‌డమే మంచిది. విదేశీ టీ20 లీగ్స్‌లో భారత క్రికెటర్లని అనుమతించడంపై బీసీసీఐ పునరాలోచించుకోవాలి' అని సూచించాడు. ఈ ప్ర‌తిపాద‌న‌కు ఇర్ఫాన్ ప‌ఠాన్ మ‌ద్ద‌తు తెలిపాడు.

పీఎల్ తరహాలో ఏ లీగ్ క్లిక్ కాలేదు:

పీఎల్ తరహాలో ఏ లీగ్ క్లిక్ కాలేదు:

భారత్ గడ్డపై 2008లో ఫ్రారంభమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సూపర్ హిట్ కావడంతో.. చాలా క్రికెట్ దేశాలు టీ20 లీగ్స్‌ను ప్రారంభించాయి. కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ కొద్దిగా ఫేమస్ అయినా.. ఐపీఎల్ తరహాలో మాత్రం క్లిక్ కాలేదు. ఆయా దేశాల లీగ్‌లు క్లిక్ కాకపోవడానికి కారణం భారత క్రికెటర్లు పాల్గొనకపోవడమేననేది బహిరంగ రహస్యం. కానీ ఐపీఎల్‌లో మాత్రం పాకిస్థాన్ మినహా అన్ని దేశాల క్రికెటర్లు ఆడుతున్నారు.

ఐపీఎల్‌కి ఆదరణ తగ్గుతుందని:

ఐపీఎల్‌కి ఆదరణ తగ్గుతుందని:

భారత క్రికెటర్లని విదేశీ టీ20 లీగ్‌లలో ఆడిస్తే.. ఐపీఎల్‌కి ఆదరణ తగ్గుతుందని బీసీసీఐ భావిస్తోంది. ఈ కారణంగానే మొదటి నుంచి కఠినమైన ఆంక్షల్ని పెట్టింది. ఏ భారత క్రికెటర్ కూడా రిటైర్మెంట్ ప్రకటించకుండా.. విదేశీ టీ20 లీగ్‌లలో ఆడటానికి వీలులేదు. ఒకవేళ ఎవరైనా ఆడాలనుకున్నా.. బీసీసీఐ నుంచి నిరభ్యంతర పత్రం తెచ్చుకోవాలి. గత ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన యువీ.. ఆ తర్వాతే టీ10 లీగ్‌ ఆడిన విషయం తెలిసిందే.

Story first published: Friday, May 22, 2020, 13:46 [IST]
Other articles published on May 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X