న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Road Safety World Series 2021: మళ్లీ మైదానంలోకి దిగనున్న అలనాటి ఆటగాళ్లు, పూర్తి వివరాలివే!

Road Safety World Series 2021: Schedule, squads, telecast in India, streaming

హైదరాబాద్: సచిన్ కళాత్మక కవర్‌ డ్రైవ్‌లు... సెహ్వాగ్‌ అప్పర్‌ కట్‌ షాట్లు.. పఠాన్ సూపర్ స్వింగర్లు.. వాయువేగంతో దూసుకెళ్లే జహీర్, అగార్కర్ బంతులు.. పక్షిలా ఎగిరి బంతిని అందుకునే మహ్మద్ కైఫ్ ఫీల్డింగ్‌ మెరుపులు.. ఇవన్నీ మధుర జ్ఞాపకాలు..! అభిమానుల మదిలో చెరగని ముద్రవేసిన ఇలాంటి అపురూప దృశ్యాలు మరోసారి కళ్ల ముందు సాక్షాత్కారం కానున్నాయి..! క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహామహులు మరోసారి మైదానంలో తలపడేందుకు సిద్ధమయ్యారు...!

వయసు మీద పడ్డా రెట్టించిన ఉత్సాహంతో పోటీకి సై అంటున్నారు..! టెస్టులు, వన్డేల్లో తమ ఆటతో క్రికెట్‌కే వన్నె తెచ్చిన ఆటగాళ్లు.. పొట్టి ఫార్మాట్‌లో పోటీ పడనున్నారు..! రోడ్డు ప్రమాదాల‌పై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మహారాష్ట్ర ప్రభుత్వ రోడ్డు భద్రతా విభాగం.. అన్ అకాడమీ ఫ్రోఫెషనల్ మేనేజ్‌మెంట్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2020‌-21తో ఈ దిగ్గజ క్రికెటర్ల మనల్ని అలరించనున్నారు.

నేడే షురూ..

నేడే షురూ..

ఈ రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021 క్రికెట్ టోర్నీకి నేడు(శుక్రవారం) తెరలేవనుంది. వాస్తవానికి గతేడాదే కార్యరూపం దాల్చిన ఈ టోర్నీ కరోనా కారణంగా అర్థాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు పరిస్థితులన్నీ అదుపులోకి రావడంతో ఈ టోర్నీ మళ్లీ పట్టాలెక్కేందుకు సిద్దమైంది. ఛత్తీస్​గఢ్​ రాజధాని రాయ్​పుర్​ వేదికగా జరగనున్న ఈ సిరీస్​లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, కెవిన్ పీటర్సన్, బ్రియాన్ లారా ఇతర దిగ్గజ ఆటగాళ్లు పాల్గొననున్నారు. గతేడాది వాయిదా పడిన దగ్గరి నుంచే మొదలుకానున్న ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొనున్నాయి. ఈ టోర్నీ మార్చి 21 వరకు జరగనుంది.

జట్ల వివరాలు

జట్ల వివరాలు

ఇండియా లెజెండ్స్: సచిన్ తెందూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, జహీర్ ఖాన్, మహ్మద్ కైఫ్, ఇర్ఫాన్ పఠాన్, నియోల్ డెవిడ్, మునాఫ్ పటేల్, మన్​ప్రీత్ గోనీ, నమన్ ఓజా, ప్రజ్ఞాన్ ఓజా, యూసఫ్ పఠాన్.

ఇంగ్లండ్ లెజెండ్స్: కెవిన్ పీటర్సన్, ఓవైస్ షా, మాంటీ పనేసర్, నిక్ కాంప్టన్, క్రిస్ ట్రెమ్లెట్, కబీర్ అలీ, సాజిద్ మహ్మద్, ఫిల్ మస్టర్డ్, క్రిస్ స్కోఫీల్డ్, జేమ్స్ ట్రెడ్​వెల్, జోనాథన్ ట్రాట్, ర్యాన్ సైడ్​బాటమ్, ఉస్మాన్ అఫ్జల్, మాథ్యూ హోగ్గార్డ్, జేమ్స్ టిండాల్.

వెస్టిండీస్ లెజెండ్స్: బ్రియాన్​ లారా, పెడ్రో కొలిన్స్, నర్సింగ్ డియోనరైన్, టినో బెస్ట్, రిడ్లీ జాకోబ్స్, సులేమాన్ బెన్, దినానాథ్ రామ్​నరైన్​, ఆడమ్ సాన్​ఫోర్డ్, విలియమ్​ పెర్కిన్స్, కార్ల్​ హూపర్, డ్వేన్​ స్మిత్, ర్యాన్ ఆస్టిన్, మహేంద్ర నగమూటూ.

శ్రీలంక లెజెండ్స్: జయసూర్య, తరంగ, దిల్షాన్, కులశేఖర, చమర సిల్వ, చింతక జయసింగే, థిలాన్ తుషార, దమ్మిక ప్రసాద్, హెరాత్​, కపుగెదెర, దులంజన విజేసింగే, రస్సెల్ అర్నాల్డ్, అజంతా మెండిస్, మహరూఫ్ మంజుల ప్రసాద్, మలింద వర్నపుర.

సౌతాఫ్రికా లెజెండ్స్: జాంటీ రోడ్స్, మఖయా ఎన్తిని, నిక్కీ బోజె, మోర్నె వాన్ విక్, గార్నెట్ క్రూగెర్, రోగెర్ టెలెమాకుస్, జస్టిన్ కెంప్, అల్విరో పీటర్సన్, ఆండ్రూ పటిక్, తండి షబలాల, లూట్స్ బోస్​మన్, లియాడ్ నోరిస్ జోన్స్, జండెర్ డి బ్రూయిన్, మోండే జొండేకి.

బంగ్లాదేశ్ లెజెండ్స్: అబ్దుర్ రజాక్, ఖలీద్ మహ్మద్, నఫీస్ ఇక్బాల్, మహ్మద్ రఫీఖ్, ఖలీద్ మసూద్, హన్నన్ సార్కెర్, జావెద్ ఒమర్, రజిన్ సాలె, మెహ్రబ్ హుస్సేన్, అఫ్తబ్ అహ్మద్, అలాంగిర్ కబీర్, మహ్మద్ షరీఫ్, ముష్ఫికర్ రెహ్మాన్, మమూన్ ఉర్ రషీద్.

మ్యాచ్‌లు ఎక్కడంటే..?

మ్యాచ్‌లు ఎక్కడంటే..?

గతేడాది నాలుగు మ్యాచ్​లు మహారాష్ట్రలో జరిగాయి. కానీ ప్రస్తుతం జరగబోయే మ్యాచ్​లకు ఛత్తీస్​గఢ్​ రాయ్​పుర్​లోని 65వేల సీట్ల సామర్థ్యం ఉన్న షాహీద్​ వీర్​ నారాయణ్​​ సింగ్ అంతర్జాతీయ క్రికెట్​ స్టేడియం వేదిక కానుంది. సిరీస్​ తొలి మ్యాచ్​ భారత్ లెజెండ్స్​, బంగ్లాదేశ్​ లెజెండ్స్​ మధ్య నేడు రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో పాల్గొనే ఆటగాళ్లందరూ ఫిబ్రవరి 22 నుంచే బయోబబుల్​లో​ ఉన్నారు. మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటలకు ప్రారంభంకానున్నాయి. కలర్స్ సినీప్లెక్స్, రిష్ట్నీ సినీప్లెక్స్ చానళ్లలో ఆన్‌లైన్ వేదిక వూట్‌లో ఈ టోర్నీ మ్యాచ్‌లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి.

షెడ్యూల్

షెడ్యూల్

మార్చి 5: ఇండియా లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజెండ్స్

మార్చి 6: శ్రీలంక లెజెండ్స్ వర్సెస్ వెస్టిండీస్ లెజెండ్స్

మార్చి 7: ఇంగ్లండ్ లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజెండ్స్

మార్చి 8: దక్షిణాఫ్రికా లెజెండ్స్ వర్సెస్ శ్రీలంక లెజెండ్స్

మార్చి 9: ఇండియా లెజెండ్స్ వర్సెస్ ఇంగ్లండ్ లెజెండ్స్

మార్చి 10: బంగ్లాదేశ్ లెజెండ్స్ వర్సెస్ శ్రీలంక లెజెండ్స్

మార్చి 11: ఇంగ్లండ్ లెజెండ్స్ వర్సెస్ దక్షిణాఫ్రికా లెజెండ్స్

మార్చి 12: బంగ్లాదేశ్ లెజెండ్స్ వర్సెస్ వెస్టిండీస్ లెజెండ్స్

మార్చి 13: ఇండియా లెజెండ్స్ వర్సెస్ దక్షిణాఫ్రికా లెజెండ్స్

మార్చి 14: శ్రీలంక లెజెండ్స్ వర్సెస్ ఇంగ్లండ్ లెజెండ్స్

మార్చి 15: దక్షిణాఫ్రికా లెజెండ్స్ వర్సెస్ బంగ్లాదేశ్ లెజెండ్స్

మార్చి 16: ఇంగ్లండ్ లెజెండ్స్ వర్సెస్ వెస్టిండీస్ లెజెండ్స్

మార్చి 17: సెమీ-ఫైనల్ 1

మార్చి 19: సెమీ-ఫైనల్ 2

మార్చి 21: ఫైనల్

Story first published: Friday, March 5, 2021, 14:07 [IST]
Other articles published on Mar 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X