న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విధ్వంసకర సెంచరీతో దినేశ్ కార్తీక్‌కు ఇచ్చిపడేసిన రియాన్ పరాగ్.. అస్సాంను తక్కువ అంచనా వేయద్దంటూ...?

Riyan Parag Takes Brutal Dig At Dinesh Karthik After Helping Assam Chase 351

న్యూఢిల్లీ: టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్‌కు రాజస్థాన్ రాయల్స్ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్ దిమ్మతిరిగే కౌంటరిచ్చాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో సోమవారం జరిగిన క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో అస్సాంకు ఆడుతున్న రియాన్ పరాగ్ (116 బంతుల్లో 12 ఫోర్లు, 12 సిక్సర్లతో 174) భారీ శతకంతో చెలరేగాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో 351 పరుగుల భారీ లక్ష్యాన్ని అధిగమించి అస్సాంకు అద్భుత విజయాన్నందించాడు. దాంతో ఆ జట్టు సెమీఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ఈ విజయానంతరం అస్సాంను తక్కువ అంచాన వేయవద్దని ట్వీట్ చేశాడు.అయితే దినేశ్ కార్తీక్‌ను ఉద్దేశించే పరాగ్ ఈ ట్వీట్ చేశాడని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 అసలేం జరిగిందంటే..?

అసలేం జరిగిందంటే..?

వారం రోజుల క్రితం విజయ్ హజారే ట్రోఫీ నిర్వహిస్తున్న తీరును దినేశ్ కార్తీక్ ట్విటర్ వేదికగా తప్పుబట్టాడు. తలో తోకా లేకుండా ఉందని నిర్వహకులను విమర్శించాడు. తమిళనాడు వంటి ఎలైట్ హోదా ఉన్న జట్టుతో అనామక అరుణాచల్ ప్రదేశ్ ఆడటం ఏంటని ప్రశ్నించాడు. 'అసలు ఎలైట్ లిస్ట్‌లో ఉన్న జట్లతో ఈశాన్య రాష్ట్రాల క్రికెట్ జట్లు లీగ్ దశలో పోటీ పడటం ఏమైనా సెన్స్ ఉందా.? ఇది ఎలైట్ జట్ల రన్ రేట్లను మార్చివేస్తుంది. ఒకవేళ వర్షం వచ్చి మ్యాచ్ కు అంతరాయం కలిగిస్తే పరిస్థితిని ఒకసారి ఊహించండి.. ఎలైట్ గ్రూప్‌లో లేని జట్లను సెపరేట్ గ్రూప్‌గా చేసి వాటితో క్వాలిఫై ఆడించలేరా?' అని ప్రశ్నలు సంధించాడు. అరుణాచల్ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 506 పరుగుల భారీ స్కోర్ చేయడంతో కార్తీక్ ఈ ట్వీట్ చేశాడు.

 మహరాష్ట్రతో..

మహరాష్ట్రతో..

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అస్సాం సెమీస్ చేరడంతో తమను తక్కువ అంచనా వేయవద్దని రియాన్ పరాగ్ ట్వీట్ చేశాడు. 'గట్టిగా చెప్పండి.. ఇది అస్సాం.. మమ్మల్ని ఈజీగా తీసుకోవద్దు.'అని పేర్కొన్నాడు. అస్సాంతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, సౌరాష్ట్రలు విజయం సాధించి సెమీస్‌కు చేరాయి. నవంబర్ 30న అహ్మదాబాద్ వేదికగా మహరాష్ట్రతో జరిగే సెమీస్‌లో అస్సాం తలపడనుంది.

12 సిక్సర్లతో..

12 సిక్సర్లతో..

క్వార్టన్ ఫైనల్ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన జమ్మూ కశ్మీర్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 350 పరుగుల భారీ స్కోర్ చేసింది. శుభమ్‌(120), నజీర్‌(124) సెంచరీలతో చెలరేగగా.. ఫాజిల్‌ రషీద్‌ 53 పరుగులతో రాణించారు. అస్సాం బౌలర్లలో చౌదరి, రజ్జకుద్దీన్ రెండేసి వికెట్లు తీయగా.. రియాన్ పరాగ్, స్వరూపమ్, సునీల్ తలో వికెట్ తీసారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన అస్సాం 46.1 ఓవర్లలో 3 వికెట్లకు 354 పరుగులు చేసి అద్భుత విజయాన్నందుకుంది. విజయ్‌ హజారే ట్రోఫీ 2022 సీజన్‌లో రియాన్‌ పరాగ్‌ ఏకంగా మూడు సెంచరీలు చేయడం విశేషం.

Story first published: Tuesday, November 29, 2022, 18:54 [IST]
Other articles published on Nov 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X