న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మైదానంలో ప్రత్యర్ధులు: ఇనిస్టాగ్రామ్‌‍లో పోస్టు, సోషల్ మీడియాలో కోహ్లీ ఫోటో వైరల్‌

Rivalries stay on the field: Virat Kohli posts a throwback picture with AB de Villiers and Eoin Morgan

హైదరాబాద్: క్రికెట్ తనకు మైదానం బయట ఎంతో మంది స్నేహితులను ఇచ్చిందని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. శనివారం టీమిండియా విరాట్ కోహ్లీ తన ఇనిస్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫోటోలో విరాట్ కోహ్లీ ఏదో జోక్ చెప్పగా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ నవ్వుతూ ఉన్నారు.

ఈ ఫోటోని పోస్టు చేస్తూ విరాట్ కోహ్లీ "క్రీడల్లో ఉన్న ఓ అందమైన విషయం ఏంటంటే, మైదానంలో ప్రత్యర్ధులుగా ఉంటారు. ఒక చిరునవ్వు అథ్లెట్ల మధ్యలో అన్ని ఉద్రిక్తతలను తగ్గిస్తుంది. మైదానంలో కష్టపడి ఆడాలి.. అలాగే, ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి. ఆట ద్వారా ఎంతోమంది అద్భుతమైన వ్యక్తులను తెలుసుకోవడం ఎంత గొప్ప వరం" అని కామెంట్ పెట్టాడు.

PHOTOS: ముంబై ఇండియన్స్ జట్టుకు అంబానీ గ్రాండ్ పార్టీ, బుమ్రాపై నెటిజన్ ప్రశ్నPHOTOS: ముంబై ఇండియన్స్ జట్టుకు అంబానీ గ్రాండ్ పార్టీ, బుమ్రాపై నెటిజన్ ప్రశ్న

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్‌తో విరాట్ కోహ్లీకి చక్కటి అనుబంధం ఉంది. వీరిద్దరూ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు ఆడుతున్నారు. దక్షిణాఫ్రికా తరుపున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడిన ఏబీ డివిలియర్స్ 2018లో అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించి తన అభిమానులను విస్మయానికి గురిచేశాడు.



ఇక, 2004లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఏబీ డివిలియర్స్‌ టెస్టుల్లో 8,765, వన్డేల్లో 9,577, టీ20ల్లో 1,672 పరుగులు చేశాడు. మరోవైపు ఇయాన్ మోర్గాన్ ప్రస్తుతం ఇంగ్లాండ్ జట్టుకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నారు. మోర్గాన్ నాయకత్వంలో ఈ ఏడాది ఇంగ్లాండ్ తొలిసారి వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచిన సంగతి తెలిసిందే.
Story first published: Saturday, October 26, 2019, 15:54 [IST]
Other articles published on Oct 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X