న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'పంత్‌ అద్భుతమైన ప్రతిభావంతుడు.. కానీ చెత్త షాట్లు మానుకోవాలి'

Rishabh Pant Needs To Work To Better His Game : Virender Sehwag || Oneindia Telugu
Rishabh Pant works to better his game says Virender Sehwag

ఢిల్లీ: యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌ అద్భుతమైన ప్రతిభావంతుడు అందులో సందేహమే లేదు. కానీ.. అతను చెత్త షాట్లు మానుకోవాలి అని టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సూచించారు. సీనియర్ వికెట్ కీపర్, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ విండీస్ పర్యటన నుండి స్వయంగా తప్పుకోవడంతో పంత్‌ జట్టులోకి వచ్చాడు. ప్రపంచకప్‌లో కీలక సమయంలో చెత్త షాట్లు ఆడి పెవిలియన్ చేరిన పంత్.. విండీస్‌ పర్యటనలోనూ అదే విధంగా ఔట్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో సెహ్వాగ్‌ స్పందించారు.

<strong>శ్రీకాంత్ యాదవ్ సూపర్-10.. పల్టన్‌పై యూపీ గెలుపు</strong>శ్రీకాంత్ యాదవ్ సూపర్-10.. పల్టన్‌పై యూపీ గెలుపు

కఠోరంగా శ్రమించాలి:

కఠోరంగా శ్రమించాలి:

తాజాగా సెహ్వాగ్‌ మాట్లాడుతూ... 'పంత్‌ అద్భుతమైన ప్రతిభావంతుడు. అతనికి చాలా సామర్థ్యం ఉంది. పంత్‌ను సానబెట్టాల్సిన అవసరం ఉంది. అతను ఎదగడం చాలా ముఖ్యం. జట్టులో నాణ్యమైన సమయం గడిపేందుకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. అతను అవకాశాన్ని ఉపయోగించుకుని ఆటను మెరుగుపరుచుకొవాలి. ఆలాగే మెరుగైన క్రికెటర్‌గా మారాలి. ఆటలో మెరుగయ్యేందుకు కఠోరంగా శ్రమించాలి' అని సెహ్వాగ్‌ సూచించారు.

రిజర్వు బెంచ్‌ చాలా పటిష్ఠం:

రిజర్వు బెంచ్‌ చాలా పటిష్ఠం:

ఈ జట్టు 2021లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోగలదా అని అడిగిన ప్రశ్నకు సెహ్వాగ్ ఇలా సమాధానం ఇచ్చారు. 'రెండేళ్ల సమయం ఉంది. ప్రస్తుతం జట్టు సురక్షిత చేతుల్లో ఉంది. రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన రవిశాస్త్రి, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి శుభాకాంక్షలు. మనకు రిజర్వు బెంచ్‌ చాలా పటిష్ఠంగా ఉంది. నాణ్యమైన పేసర్లు, స్పిన్నర్లు ఉన్నారు. అయితే ఇప్పుడు కావాల్సింది మంచి కూర్పు మాత్రమే' అని సెహ్వాగ్‌ తెలిపారు.

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బోణీ:

టెస్టు ఛాంపియన్‌షిప్‌లో బోణీ:

కరీబియన్‌ పర్యటనలో భాగంగా జరుగుతున్న టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా శుభారంభం చేసింది. బ్యాటింగ్‌లో వైస్ కెప్టెన్ అంజిక్య రహానే (102; 242 బంతుల్లో 5×4), హనుమ విహారి (93; 128బంతుల్లో 10×4, 1×6) రాణించడం.. బౌలింగ్‌లో బుమ్రా (5/7), ఇషాంత్ (3/31) విజృంభించడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా బోణీ చేసింది. 419 పరుగుల ఛేదనలో వెస్టిండీస్‌ 100 పరుగులకే ఆలౌట్ అవడంతో టీమిండియా 318 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0తో ఆధిక్యంలో ఉంది. రెండో టెస్టు శుక్రవారం కింగ్‌స్టన్‌లో జరగనుంది.

Story first published: Tuesday, August 27, 2019, 9:47 [IST]
Other articles published on Aug 27, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X