న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'నువ్ ఎప్పటికీ ధోనీవి కాలేవు.. పంత్ ఎంపిక ఈవీఎం ద్వారా జరిగిందా?'

India vs Bangladesh 2019 : Rohit Sharma's Hilarious Reaction After Pant-Insisted DRS Goes Wrong
Rishabh Pants selection was through EVM, Pant trolled for poor showing vs Bangladesh


ఢిల్లీ: ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. సీనియర్ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ వారసుడిగా జట్టులోకి వచ్చిన రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్, కీపింగ్‌లలో పూర్తిగా విఫలమయ్యాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన పంత్ 26 బంతుల్లో కేవలం 27 పరుగులే చేసాడు. ధాటిగా ఆడాల్సిన తరుణంలో స్లో బ్యాటింగ్‌తో పరుగులు చేయలేకపోయాడు.

దినేశ్‌ కార్తీక్‌ వన్ హ్యాండెడ్ క్యాచ్‌.. అతనికి వయసయిపోయిందని ఎవరన్నారు? (వీడియో)!!దినేశ్‌ కార్తీక్‌ వన్ హ్యాండెడ్ క్యాచ్‌.. అతనికి వయసయిపోయిందని ఎవరన్నారు? (వీడియో)!!

 సమీక్ష వృథా:

సమీక్ష వృథా:

పంత్ వికెట్ల వెనుక కూడా పూర్తిగా తేలిపోయాడు. బంగ్లా బ్యాటింగ్‌ చేస్తుండగా స్పిన్నర్ చాహల్‌ వేసిన 10వ ఓవర్‌లో సౌమ్య సర్కార్‌ క్రీజులో ఉన్నాడు. చాహల్‌ వేసిన బంతి సౌమ్య బ్యాట్‌కు తాకీతాకనట్టు వెళ్లి నేరుగా పంత్‌ చేతుల్లో పడింది. భారత ఆటగాళ్లు అందరూ అప్పీల్ చేసినా.. అంపైర్‌ ఔట్ ఇవ్వలేదు. కెప్టెన్ రోహిత్‌ శర్మ చాహల్‌ను అడగ్గా స్పష్టంగా చెప్పలేను అని సమాధానం ఇచ్చాడు. కీపర్ పంత్‌.. రోహిత్‌ను ఒప్పించి డీఆర్‌ఎస్‌ కోరాడు. సమీక్షలో సౌమ్య బ్యాట్‌కు బంతి తగలలేదని స్పష్టంగా తేలడంతో భారత సమీక్ష వృథా అయ్యింది.

డీఆర్‌ఎస్‌ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్‌:

డీఆర్‌ఎస్‌ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్‌:

ఆ సమయంలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. పంత్‌ వైపు చూసి నవ్వుకున్నాడు. ఆ సన్నివేశం చూడటానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. దీనికి సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు మీమ్స్ పోస్ట్ చేస్తూ పంత్‌ను ఓ ఆటాడుకుంటున్నారు. 'డీఆర్‌ఎస్‌ అంటే ధోనీ రివ్యూ సిస్టమ్‌' అని ఓ అభిమాని మండిపడ్డాడు.

పంత్ ఎంపిక ఈవీఎం ద్వారా జరిగిందా:

పంత్ ఎంపిక ఈవీఎం ద్వారా జరిగిందా:

'సెలెక్టర్లు పంత్‌కు అవకాశాలు ఇచ్చి ధోనీని తయారు చేయాలనుకుంటున్నారు', 'నువ్ ఎప్పటికీ ధోనీవి కాలేవు', 'రిషబ్‌పంత్‌ని ధోనీలా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఫలితం ఇలానే ఉంటుంది', 'పంత్ ఎంపిక ఈవీఎం ద్వారా జరిగిందా?', 'సంజు సామ్సన్, సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ బెంచ్ మీద ఉన్నప్పుడు పంత్‌కు మాత్రమే ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు', 'తొలి టీ20 మ్యాచ్‌లో విలన్ రిషబ్ పంత్' అని నెటిజన్లు ఆడుకుంటున్నారు.

భారత్‌ ఓటమి:

భారత్‌ ఓటమి:

తొలి టీ20 మ్యాచ్‌లో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు చేసిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్‌ ధావన్‌ (42 బంతుల్లో 41; 3 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్ స్కోరర్. లక్ష చేధనలో బంగ్లాదేశ్‌ 19.3 ఓవర్లలో 3 వికెట్లకు 154 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ముష్ఫికర్‌ రహీమ్‌ (43 బంతుల్లో 60 నాటౌట్‌; 8 ఫోర్లు, 1 సిక్స్‌) విజయంలో కీలక పాత్ర పోషించాడు.

Story first published: Monday, November 4, 2019, 16:36 [IST]
Other articles published on Nov 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X