న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బేసిక్సే తెలియవు: వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ ఎంపిక తప్పు

Rishabh Pant’s basics of wicketkeeping are not correct: Nayan Mongia

హైదరాబాద్: ఇంగ్లాండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ కోసం అదనపు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌ని సెలక్టర్లు ఎంపిక చేయడం పెద్ద తప్పిదమని మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా అభిప్రాయపడ్డాడు. తొలి రెండు టెస్టుల్లో బ్యాట్‌తో విఫలమైన రెగ్యులర్ వికెట్ కీపర్‌ దినేశ్ కార్తీక్‌ని మూడో టెస్టులో జట్టు మేనేజ్‌మెంట్ తప్పించిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత జరిగిన మూడు టెస్టుల్లో దినేశ్ కార్తీక్‌ స్థానంలో రిషబ్ పంత్‌కి మేనేజ్‌మెంట్ అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. వికెట్ల వెనుక డైవ్ క్యాచ్‌లు పట్టి తన ప్రత్యేకత చాటిన రిషబ్ పంత్.. మూడు టెస్టుల్లో ఏకంగా 76 పరుగులను బైస్‌ రూపంలో ఇచ్చి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు.

ఈ నేపథ్యంలో వికెట్ కీపర్‌గా అతని బేసిక్సే సరిగా లేవని మాజీ వికెట్ కీపర్ నయన్ మోంగియా మండిపడ్డాడు. నయన్ మోంగియా మాట్లాడుతూ "వికెట్ కీపింగ్‌లో రిషబ్ పంత్ ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాడు. ఐపీఎల్‌ ప్రదర్శన ఆధారంగా టెస్టుల్లోకి అతడ్ని కీపర్‌గా ఎంపిక చేసిన సెలక్షన్ పాలసీది తప్పు" అని అన్నాడు.

1
42378
పంత్‌కు బేసిక్స్‌ కూడా సరిగా లేవు

పంత్‌కు బేసిక్స్‌ కూడా సరిగా లేవు

"అతని బేసిక్స్‌ కూడా సరిగా లేవు. ఇంగ్లాండ్ గడ్డపై స్పిన్నర్ల బౌలింగ్‌లో అతను వికెట్ల వెనుక బంతిని సరిగా అందుకోలేకపోతున్నాడు. ఉపఖండం పిచ్‌లపైనా టెస్టు మ్యాచ్ నాలుగు లేదా ఐదో రోజు అతను ఇలాంటి ఇబ్బందులే ఎదుర్కొనే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులను కలుపుకుని భారత్ జట్టు త్వరలోనే ఆరు టెస్టు మ్యాచ్‌లను ఆడబోతోంది" అని పంత్ తెలిపాడు.

 దినేశ్ కార్తీక్‌కి మళ్లీ ఛాన్సిస్తారని అనుకోవడం లేదు

దినేశ్ కార్తీక్‌కి మళ్లీ ఛాన్సిస్తారని అనుకోవడం లేదు

"ఈ టెస్టులకి సీనియర్ వికెట్ కీపర్లు పార్థీవ్ పటేల్ లేదా దినేశ్ కార్తీక్‌కి మళ్లీ ఛాన్సిస్తారని నేను అనుకోవడం లేదు. అలా అని ఒక సిరీస్ తర్వాత యువ వికెట్‌ కీపర్‌ని పక్కన పెట్టాలని కూడా నేను కోరుకోవట్లేదు. అయితే రిషబ్ పంత్ ఇంకా కీపింగ్ టెక్నిక్స్ నేర్చుకోవాల్సి ఉంది" అని నయన్ మోంగియా స్పష్టం చేశాడు.

 వికెట్ కీపర్లకు క్యాంపులు నిర్వహించడం లేదు

వికెట్ కీపర్లకు క్యాంపులు నిర్వహించడం లేదు

యువ క్రికెటర్లకు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో ఎందుకు స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయడం లేదో అర్ధం కావడం లేదని అన్నాడు. భారత్ తరుపున నయన్ మోంగియా 44 టెస్టులకు ప్రాతినిథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, ఐదో టెస్టు‌లో రిషబ్ పంత్ 11 ఏళ్ల నాటి ధోని రికార్డును బద్దలుకొట్టాడు.

 టెస్టుల్లో తొలి సెంచరీ

టెస్టుల్లో తొలి సెంచరీ

ఆటలో భాగంగా ఐదో రోజైన మంగళవారం రిషబ్ పంత్ 117 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. 95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ బాది రిషబ్ పంత్ టెస్టుల్లో తొలి సెంచరీని అందుకున్నాడు.

 సిక్స్‌తో తొలి సెంచరీని అందుకున్న నాలుగో భారత్ క్రికెటర్‌

సిక్స్‌తో తొలి సెంచరీని అందుకున్న నాలుగో భారత్ క్రికెటర్‌

ఇలా, టెస్టుల్లో సిక్స్‌తో తొలి సెంచరీ మార్క్‌ని అందుకున్న నాలుగో భారత్ క్రికెటర్‌గా పంత్ తాజాగా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ మాత్రమే ఉన్నారు. మరోవైపు అజయ్ రాత్రా(20 ఏండ్ల 150 రోజులు) తర్వాత టెస్ట్‌ల్లో సెంచరీ చేసిన రెండో పిన్నవయస్సు భారత వికెట్‌కీపర్‌గా పంత్(20 ఏండ్ల 342 రోజులు) రికార్డు అందుకున్నాడు.

Story first published: Wednesday, September 12, 2018, 8:36 [IST]
Other articles published on Sep 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X