న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిక్స్‌తో రిషబ్ పంత్ సెంచరీ: 11 ఏళ్ల ధోని రికార్డు బద్దలు

India vs England 5th Test: Rishab Panth Crosses Dhoni's Record With His Century
 Rishabh Pant reaches century with a six as India frustrate England

హైదరాబాద్: ఓవల్ వేదికగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో టెస్టు‌లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ 11 ఏళ్ల నాటి మహేంద్రసింగ్ ధోని రికార్డును బద్దలుకొట్టాడు. ఆటలో భాగంగా ఐదో రోజైన మంగళవారం రిషబ్ పంత్ 117 బంతుల్లోనే 14 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 100 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.

ఇంగ్లాండ్ పర్యటనలో విఫలం: టెస్టుల్లో ధావన్‌కు చోటు కష్టమేనా?ఇంగ్లాండ్ పర్యటనలో విఫలం: టెస్టుల్లో ధావన్‌కు చోటు కష్టమేనా?

95 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో డీప్ మిడ్ వికెట్ దిశగా కళ్లు చెదిరే సిక్స్ బాది రిషబ్ పంత్ టెస్టుల్లో తొలి సెంచరీని అందుకున్నాడు. ఇలా, టెస్టుల్లో సిక్స్‌తో తొలి సెంచరీ మార్క్‌ని అందుకున్న నాలుగో భారత్ క్రికెటర్‌గా పంత్ తాజాగా నిలిచాడు. ఇప్పటి వరకు ఈ జాబితాలో కపిల్ దేవ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్ మాత్రమే ఉన్నారు.

1
42378
తొలి టెస్టులోనూ సిక్స్‌తో

తొలి టెస్టులోనూ సిక్స్‌తో

కెరీర్ తొలి టెస్టులోనూ సిక్స్‌తో రిషబ్ పంత్ తన పరుగుల ఖాతా తెరిచిన విషయం తెలిసిందే. కాగా, కెరీర్‌లో మూడో టెస్టు మ్యాచ్ ఆడుతున్న రిషబ్ పంత్ తొలి సెంచరీతో 2007లో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నెలకొల్పిన రెండు రికార్డులను బద్దలు కొట్టాడు.

11 ఏళ్ల క్రితం ధోని నెలకొల్పిన రికార్డు బద్దలు

11 ఏళ్ల క్రితం ధోని నెలకొల్పిన రికార్డు బద్దలు

ఇంగ్లాండ్ గడ్డపై ఇప్పటి వరకు భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక పరుగులు 92. ఓవల్ స్టేడియంలో ఈ రికార్డుని ధోని 11 ఏళ్ల క్రితం ఈ రికార్డుని నెలకొల్పాడు. అలానే, టెస్టు మ్యాచ్ చివరి ఇన్నింగ్స్‌లో భారత వికెట్ కీపర్ చేసిన అత్యధిక పరుగులు 76. లార్డ్స్‌ వేదికగా 2007లో ధోనీ ఈ పరుగులు చేశాడు.

ఓవల్ స్టేడియంలో రిషబ్ పంత్ సెంచరీ

ఓవల్ స్టేడియంలో రిషబ్ పంత్ సెంచరీ

తాజాగా ఇంగ్లాండ్ పర్యటనలో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన సెంచరీతో ఈ రెండు రికార్డులనీ బద్దలుకొట్టి.. సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. ఇదిలా ఉంటే ఐదో టెస్టులో టీమిండియా 118 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఇంగ్లాండ్ పర్యటనని భారత్ జట్టు ఓటమితో ముగించింది.

 సెంచరీలతో మెరిసిన రాహుల్, పంత్

సెంచరీలతో మెరిసిన రాహుల్, పంత్

464 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టు‌లో లోకేశ్ రాహుల్ (149), రిషబ్ పంత్ (114) సెంచరీతో మెరిసినా.. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలం కావడంతో కోహ్లీసేన ఓడిపోయింది. దీంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను టీమిండియా 1-4తో చేజార్చుకుంది. ఇంగ్లాండ్ ఓపెనర్ అలిస్టర్ కుక్‌కి కెరీర్‌లో ఇదే చివరి టెస్టుకాగా.. ఆంధ్రా క్రికెటర్‌ హనుమ విహారి ఈ టెస్టుతో అరంగేట్రం చేశాడు.

Story first published: Wednesday, September 12, 2018, 8:13 [IST]
Other articles published on Sep 12, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X