న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ అవార్డులు: ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా పంత్

Rishabh Pant named ICC Emerging Cricketer of the Year 2018

హైదరాబాద్: గతేడాది టెస్టుల్లో ఇంగ్లాండ్‌పై అరంగేట్రం చేసిన రిషబ్ పంత్‌.. అటు కీపింగ్‌లోనూ ఇటు బ్యాటింగ్‌లోనూ అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే. 2018 సంవత్సరానికి గాను రిషబ్ పంత్ ఐసీసీ ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును పంత్ గెలుచుకున్నాడు.

<strong>ఐసీసీ అవార్డులు: హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన కోహ్లీ (వీడియో)</strong>ఐసీసీ అవార్డులు: హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన కోహ్లీ (వీడియో)

గతేడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ అవార్డుల కోసం ఓటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో గతేడాది అటు బ్యాట్స్‌మన్‌గా, ఇటు వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్ అద్భుతంగా రాణించాడు. 2018లో మొత్తం 8 టెస్టులాడిన పంత్.. 537 పరుగులు చేశాడు. అందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

తొలి భారత వికెట్ కీపర్‌గా

తొలి భారత వికెట్ కీపర్‌గా

మూడు వన్డేల్లో 41 పరుగులు, 8 టీ20ల్లో 114 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ గడ్డపై సెంచరీ చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా పంత్ నిలిచాడు. ఇక, వికెట్ కీపింగ్ విషయానికి వస్తే పంత్ మొత్తం 40 క్యాచ్‌లు అందుకోవడంతోపాటు రెండు స్టంపింగ్స్ చేశాడు.

ఆసీస్ పర్యటనలో అద్భుత ప్రదర్శన

ఆసీస్ పర్యటనలో అద్భుత ప్రదర్శన

ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో పంత్ అద్భుత ప్రదర్శన చేశాడు. అడిలైడ్‌ వేదికగా జరిగిన టెస్ట్‌లో 11 క్యాచ్‌లు అందుకొని ఒక మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రికార్డును సైతం రిషబ్ పంత్ సృష్టించాడు. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనతో పంత్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.

సిడ్నీ టెస్టులో సెంచరీ

సిడ్నీ టెస్టులో సెంచరీ

ఇంగ్లాండ్‌తో ఓవల్‌లో వేదికగా జరిగిన ఐదో టెస్టులో పంత్ సెంచరీతో చెలరేగాడు. ఆ తర్వాత ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 20 క్యాచ్‌లు అందుకోవడంతో పాటు 350కిపైగా పరుగులు సాధించాడు. సిడ్నీ టెస్టులో పంత్ సెంచరీ సాధించడంతో అనేక రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐసీసీ టెస్టు జట్టు

ఐసీసీ టెస్ట్ టీమ్ ఆఫ్ ద ఇయ‌ర్‌లో ముగ్గురు భారతీయలుు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ కోహ్లీతో పాటు వికెట్ కీప‌ర్ రిష‌బ్ పంత్‌, పేస్ బౌల‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా ఈ జట్టులో చోటు దక్కించుకున్నారు.

Story first published: Tuesday, January 22, 2019, 13:30 [IST]
Other articles published on Jan 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X