న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తప్పులు చేస్తున్నాడు: టెస్టు క్రికెట్‌లో పంత్ ఇంకా పరిణితి సాధించాలి

India vs West indies 2018 : Panth Should Not be Removed For His Mistakes : Deep Desh Guptha|Oneindia
Rishabh Pant is not a finished product in Test cricket yet: Deep Dasgupta

హైదరాబాద్: తన అద్భుతమైన స్ట్రోక్‌తో భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్. ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌తో అరంగేట్రం చేసిన రిషబ్ పంత్.. ఓవల్ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో సెంచరీ బాదడంతో పాటు గత శనివారం విండిస్‌తో రాజ్‌కోట్ వేదికగా ముగిసిన తొలి టెస్టులోనూ 92 పరుగులతో రాణించాడు.

 97 పరుగులను బైస్ రూపంలో

97 పరుగులను బైస్ రూపంలో

బ్యాట్‌తో చక్కగా రాణిస్తున్న ఈ యువ వికెట్ కీపర్ కీపింగ్‌లో మాత్రం తేలిపోతున్నాడు. రెండు నెలల వ్యవధిలో నాలుగు టెస్టులాడిన రిషబ్ పంత్ ఇప్పటికే 97 పరుగులను బైస్ రూపంలో ప్రత్యర్థి జట్లకి ఇచ్చేశాడు. దీంతో పంత్ వికెట్ల వెనుక కొన్ని తప్పిదాలు చేస్తున్నప్పటికీ, అతనిపై వేటు వేసే సాహసం చేయొద్దని మాజీ వికెట్ కీపర్ దీప్ దేశ్‌గుప్త సూచించాడు.

 రిషబ్ పంత్ ఇంకా పరిణతి సాధించాలి

రిషబ్ పంత్ ఇంకా పరిణతి సాధించాలి

"టెస్టు వికెట్ కీపర్‌‌గా రిషబ్ పంత్ ఇంకా పరిణతి సాధించాల్సి ఉంది. రెండేళ్లుగా రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. కానీ.. అతని వయసు ఇంకా 21 ఏళ్లే. కాబట్టి.. కీపర్‌గా సుదీర్ఘ ఫార్మాట్‌లో కుదురుకోవడానికి మరికొంత సమయం టీమిండియా మేనేజ్‌మెంట్ అతనికివ్వాలి. భారత్ పిచ్‌లపై స్పిన్నర్ల బౌలింగ్‌లో కీపింగ్ చేయాలంటే చాలా కష్టం" అని చెప్పుకొచ్చాడు.

పంత్ నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి

పంత్ నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి

"అతను ఇప్పటి నుంచే నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. మేనేజ్‌మెంట్‌ నుంచి కూడా అతనికి సరైన గైడెన్స్ అవసరం. అలా కాకుండా.. వేటు వేయడం.. మళ్లీ ఎంపిక చేయడం లాంటివి చేయకూడదు. సుదీర్ఘకాలం అతని సేవలు వినియోగించుకోవాలంటే.. అప్పుడప్పుడు తప్పులు చేసినా.. సహనంతో అవకాశాలివ్వాలి" అని దీప్ దేశ్‌గుప్త సూచించాడు.

రాజ్‌కోట్ టెస్టులో 92 పరుగుల వద్ద ఔట్

రాజ్‌కోట్ టెస్టులో 92 పరుగుల వద్ద ఔట్

వెస్టిండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో దూకుడుగా ఆడిన రిషబ్ పంత్ 84 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 92 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. దీంతో తృటిలో సెంచరీ మిస్ అయిన రిషబ్ పంత్ హాఫ్ సెంచరీలను సెంచరీలుగా మలచడంలో కోహ్లీ నుంచి స్పూర్తి పొందాలని మాజీ వికెట్ కీపర్ సయ్యద్ కిర్మాణి సూచించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, October 8, 2018, 17:57 [IST]
Other articles published on Oct 8, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X