న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు దొరికిన అత్యంత విలువైన ఆస్తి: పంత్‌పై ధావన్ ప్రశంస

Shikhar Dhawan Says Rishabh Pant Is An Asset For The Team India | Oneindia Telugu
Rishabh Pant is aggressive batsman and an asset to team: Shikhar Dhawan praises wicketkeeper-batsman

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌పై ఓపెనర్ శిఖర్ ధావన్ ప్రశంసల వర్షం కురిపించాడు. టీమిండియాకు రిషబ్ పంత్ విలువైన ఆటగాడని, మ్యాచ్ ఫలితాన్ని ఏ సమయంలోనైనా మార్చగల సామర్థ్యం రిషబ్‌కు ఉందని శిఖర్ ధావన్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో రిషబ్ పంత్‌కు ఐసీసీ 'ఎమర్జింగ్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం నుంచి న్యూజిలాండ్‌తో మూడు టీ20ల సిరిస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శిఖర్‌ ధావన్‌ ఓ జాతీయ చానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో పంత్‌పై పైవ్యాఖ్యలు చేశాడు.

'కాఫీ విత్‌ కరణ్‌ షో' వ్యాఖ్యలు: పాండ్యా, రాహుల్‌పై కేసు నమోదు'కాఫీ విత్‌ కరణ్‌ షో' వ్యాఖ్యలు: పాండ్యా, రాహుల్‌పై కేసు నమోదు

పంత్‌ చాలా దూకుడైన ఆటగాడు

"రిషబ్ పంత్‌ చాలా దూకుడైన ఆటగాడు. ఓవర్‌ వ్యవధిలోనే ప్రత్యర్థి చేతుల్లోంచి మ్యాచ్‌ను లాగేయగల సత్తా ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచుల్లో రిషబ్‌ అద్భుతంగా రాణించి తన సత్తాను నిరూపించుకున్నాడు. వికెట్‌ కీపర్‌గా ధోని తర్వాతి స్థానం రిషబ్‌దే" అని ధావన్ చెప్పాడు.

టీమిండియాకు దొరికిన అత్యంత విలువైన ఆస్తి

టీమిండియాకు దొరికిన అత్యంత విలువైన ఆస్తి

"పంత్‌ టీమిండియాకు దొరికిన అత్యంత విలువైన ఆస్తి. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో దొరికిన అవకాశాన్ని రెండు చేతులా పంత్‌ అందిపుచ్చుకుంటాడనే నమ్మకం ఉంది. పంత్‌ ట్యాలెంట్‌ గురించి చెప్పాలంటే ఇంకా చాలానే ఉందని, కాని ముందుముందు అభిమానులే గ్రహిస్తారు" అని శిఖర్ ధావన్ వెల్లడించాడు.

విజయంతోనే ముగించాలని భావిస్తున్నాం

విజయంతోనే ముగించాలని భావిస్తున్నాం

న్యూజిలాండ్ పర్యటనను విజయంతోనే ముగించాలని భావిస్తున్నామని ధావన్‌ పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరీస్‌ను గెలవడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నామని అన్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ నేపథ్యంలో కివీస్‌తో జరగనున్న టీ20 సిరీస్‌ను కైవసం చేసుకుంటే టీమిండియా ఆటగాళ్లలో మరింత ఆత్మవిశ్వాసాన్ని నింపుతుందని చెప్పాడు.

కివీస్‌ జట్టును తక్కువ అంచనా వేయకూడదు

కివీస్‌ జట్టును తక్కువ అంచనా వేయకూడదు

అలాగని కివీస్‌ జట్టును తక్కువ అంచనా వేయడం లేదని ధావన్‌ తెలిపాడు. బుధవారం నుంచి ప్రారంభంకానున్న టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో పంత్‌ తుది జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. దీనికి తోడు పాండ్యా బ్రదర్స్‌కు కూడా జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. వన్డే సిరీస్‌ గెలిచిన జోరుతో టీ20 సిరీస్‌ను కూడా కైవసం చేసుకోవాలని భారత్ గట్టి పట్టుదలతో ఉంది.

Story first published: Wednesday, February 6, 2019, 12:01 [IST]
Other articles published on Feb 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X