న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'భారత క్రికెట్‌లో రిషబ్ పంత్ ఓ సూపర్ స్టార్'

Rishabh Pant Is An Absolute Superstar In Indian Cricket : Kevin Pietersen || Oneindia Telugu
 Rishabh Pant can be absolute superstar in Indian cricket: Kevin Pietersen

హైదరాబాద్: యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ భారత క్రికెట్‌లో ఓ సూపర్ స్టార్ అని ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన 'నెరోలాక్ క్రికెట్ లైవ్' షోలో పాల్గొన్న కెవిన్ పీటర్సన్... అపారమైన ప్రతిభ రిషబ్ పంత్ సొంతమని వ్యాఖ్యానించాడు.

పీటర్సన్ మాట్లాడుతూ "పంత్ చిన్నవాడు. అపారమైన ప్రతిభ అతడి సొంతం. ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ఇండియా తరుపున ఆడుతూ తన కల కోసం జీవిస్తున్నాడు. కానీ, అతడి చుట్టూ విమర్శకులు ఉన్నారు. అతడి వయసు 21 (22). ఐపీఎల్‌ నుంచి అతడిని పరిశీలిస్తున్నా. చేసిన పొరపాటునే పంత్ పునరావృతం చేస్తున్నాడు" అని అన్నాడు.

'బ్యాక్ ఫైర్' అవుతుందేమో!: ఆసీస్ పర్యటనలో టీమిండియా 2 డే నైట్ టెస్టులు ఆడటంపై చాపెల్'బ్యాక్ ఫైర్' అవుతుందేమో!: ఆసీస్ పర్యటనలో టీమిండియా 2 డే నైట్ టెస్టులు ఆడటంపై చాపెల్

పాఠాలు నేర్చుకోవాలి

పాఠాలు నేర్చుకోవాలి

"చేసిన తప్పుల నుంచి అతడు పాఠాలు నేర్చుకోవాలి. పంత్‌ వయస్సు 22 ఏళ్లు అంటే నేను నిజంగా నమ్మలేకపోతున్నా. అతడికి 24-25 ఏళ్లు ఉంటాయని భావించా. ప్రస్తుతం అతడికి పరిణితి చెందడానికి కొంత సమయం ఇవ్వాలి. అతడికి 27-30 ఏళ్లు వచ్చే సరికే అతడిలో అసలైన ఆట వెలుగు చూస్తుంది" అని పీటర్సన్ చెప్పుకొచ్చాడు.

అతడిపై ఉన్న నమ్మకంతో

అతడిపై ఉన్న నమ్మకంతో

"అతను చేసిన అన్ని తప్పిదాలు, అతడిపై ఉన్న నమ్మకంతో ఆటు జట్టుతో పాటు కెప్టెన్ విరాట్ కోహ్లీ మద్దతుగా నిలుస్తున్నారు. భవిష్యత్తులో భారత క్రికెట్‌కు రిషబ్ పంత్‌ కచ్చితంగా సూపర్‌స్టార్‌ అవుతాడు" అని పీటర్సన్‌ తెలిపాడు. మరోవైపు విండిస్ క్రికెట్ దిగ్గజం బ్రయన్‌ లారా కూడా పీటర్సన్‌ అభిప్రాయంతో ఏకీభవించాడు.

పంత్‌పై అధిక ఒత్తిడి

పంత్‌పై అధిక ఒత్తిడి

"పంత్‌పై అధిక ఒత్తిడి ఉంది. ఎంతో ఆసక్తితో పంత్ ఈ గేమ్‌లోకి వచ్చాడు. ఎంతో దూకుడిని కలిగి ఉన్నాడు. ధోనీ స్థానాన్ని భర్తీ చేయాలని, ఆ స్థానంలో పంత్‌ను క్రికెట్ అభిమానులు అప్పుడే ఊహించుకుంటున్నారు. కానీ, ధోని భిన్నమైన ఆటగాడు. టీ20 వరల్డ్ కప్‌కు ఇంకా 8 నుంచి 9 నెలల సమయం ఉంది. టీమిండియా మరో వికెట్‌ కీపర్‌తో బరిలోకి దిగవచ్చు" అని లారా అన్నాడు.

కోహ్లీ అండగా

కోహ్లీ అండగా

"ఇది పంత్‌పై మరింత ఒత్తిడి తీసుకువస్తుంది. పంత్‌కు కోహ్లీ అండగా నిలవడం సరైన నిర్ణయమే. టీమిండియా విజయవంతమైన జట్టు. 30 ఏళ్ల ముందు విండిస్ జట్టు కూడా ఆటగాళ్లు రాణించకపోయినా జట్టులో కొనసాగించేది. ఎందుకంటే జట్టుగా విండీస్ విజయాలను నమోదు చేసేది" అని లారా అన్నాడు.

గుస్‌ లోగీ లేదా కార్ల్ హూపర్ వంటి

గుస్‌ లోగీ లేదా కార్ల్ హూపర్ వంటి

"వెస్టిండిస్ జట్టులో గొప్ప ఆటగాళ్లు ఉన్నారు. మీరు గుస్‌ లోగీ లేదా కార్ల్ హూపర్ వంటి ఆటగాళ్ల పేర్లు ఎప్పుడూ వినలేదు. ఎందుకంటే వారు అంతగా రాణించకపోయినా.... కానీ, జట్టు మేనేజ్‌మెంట్ వారికి తగినంత సమయం ఇచ్చింది. రిషబ్ పంత్ కూడా పరిణితి చెందడానికి కొంత సమయం ఇవ్వాలి" అని లారా పేర్కొన్నాడు.

Story first published: Monday, December 9, 2019, 16:18 [IST]
Other articles published on Dec 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X