న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

స్మిత్‌ను ఎవరితో పోల్చలేం: 'జీనియస్' అంటూ పాంటింగ్ ప్రశంసల వర్షం

Ricky Ponting Hails Steve Smith As A Genius After Double Century In 4th Ashes Test

హైదరాబాద్: యాషెస్ సిరిస్‌లో భాగంగా ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. తొలి టెస్టులో రెండు సెంచరీలు బాదిన స్టీవ్ స్మిత్ గురువారం మాంచెస్టర్ వేదికగా ప్రారంభమైన నాలుగో టెస్టులో డబుల్ సెంచరీతో మెరిశాడు.

చాలా పెద్ద బాధ్యత: సఫారీ పర్యటనపై కొత్త బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్చాలా పెద్ద బాధ్యత: సఫారీ పర్యటనపై కొత్త బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్

ఈ నేపథ్యంలో స్టీవ్ స్మిత్‌ను జీనియస్ అంటూ ప్రశంసల వర్షం కురిపించాడు ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్. క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రికీ పాంటింగ్ మాట్లాడుతూ "మీరు అతడి గురించి ఎన్నో మాటలు వింటున్నారు. నా మైండ్‌లో మాత్రం జీనియస్ అనే పదం వస్తోంది" అని అన్నాడు.

"మరోసారి అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. అతనేం చేయగలడో అదే చేశాడు. ఎలాంటి తప్పిదాలకు తావివ్వలేదు. అతడి ఏకాగ్రత గురించి చెప్పాల్సిన పనిలేదు. అద్భుతం" అని రికీ పాంటింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. స్మిత్‌ను ఎలా ఔట్ చేయాలనే దానిపై కూడా పాంటింగ్ బౌలర్లకు సలహా ఇచ్చాడు.

గత 99 ఇన్నింగ్సుల్లో

గత 99 ఇన్నింగ్సుల్లో

"గత 99 ఇన్నింగ్సుల్లో అతడు ఎల్బీగా వెనుదిరిగింది కేవలం 9 సార్లే. అందుకే అతడి కాళ్లకు నేరుగా బంతి విసిరితే ఔట్‌ చేయలేరు. స్మిత్ బ్యాట్‌కు దూరంగా బంతులేసి అతడిని ఔట్ చేసేలా ప్రయత్నించొచ్చు. అప్పట్లో డాన్‌ బ్రాడ్‌మన్‌ చేసిందే ఇప్పుడు స్టీవ్‌స్మిత్‌ చేస్తున్నాడు. ఈ డబుల్ సెంచరీ అతడి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. స్మిత్‌ బ్యాటింగ్‌ను బ్రాడ్‌మన్‌తో తప్ప ఇతరులతో పోల్చలేం" అని పాంటింగ్‌ అన్నాడు.

ఏడాది నిషేధం తర్వాత

ఏడాది నిషేధం తర్వాత

ఏడాది నిషేధం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి తన పునరాగమనాన్ని స్టీవ్ స్మిత్ ఘనంగా చాటాడు. ఐసీసీ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరిస్‌లో చెలరేగి ఆడుతున్నాడు. యాషెస్‌లో వరుసగా ఎనిమిది సార్లు 50కిపైగా స్కోర్లు సాధించిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు.

తొలి ఇన్నింగ్స్‌‌ను 497/8 వద్ద డిక్లేర్‌ చేసిన ఆస్ట్రేలియా

తొలి ఇన్నింగ్స్‌‌ను 497/8 వద్ద డిక్లేర్‌ చేసిన ఆస్ట్రేలియా

యాషెస్ సిరిస్‌లో గత ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 239, 76, 102 నాటౌట్, 83, 144, 142, 92, 211 పరుగులు సాధించాడు. నాలుగో టెస్టులో స్టీవ్ స్మిత్ సెంచరీ సాధించడంతో ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌‌ను 497/8 వద్ద డిక్లేర్‌ చేసింది. తర్వాత తొలి ఇన్నింగ్స్‌కు దిగిన ఇంగ్లండ్‌ రోజు ముగిసేసరికి ఓపెనర్‌ డెన్లీ (4) వికెట్‌ కోల్పోయి 23 పరుగులు చేసింది.

ఈ సిరిస్‌లో ఇప్పటికే 589 పరుగులు

ఈ సిరిస్‌లో ఇప్పటికే 589 పరుగులు

యాషెస్‌ సిరీస్‌ ద్వారా టెస్టుల్లో రీ ఎంట్రీ ఇచ్చిన స్మిత్‌ తొలి టెస్టులో (144, 142), రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు. రెండో టెస్టులో ఆర్చర్‌ వేసిన బంతికి గాయపడిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో, మూడో టెస్టుకు దూరమయ్యాడు. నాలుగో టెస్టులో డబుల్‌ సెంచరీతో సాధించాడు. ఈ యాషెస్‌ సిరీస్‌లో ఇప్పటివరకూ స్మిత్‌ 147. 25 సగటుతో 589 పరుగులు సాధించాడు.

Story first published: Friday, September 6, 2019, 18:16 [IST]
Other articles published on Sep 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X