న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'అతడు 5 రెట్లు మెరుగయ్యాడు!! టాప్‌ ఆర్డర్‌లో రాణిస్తాడు.. ఫినిషర్‌గానూ సత్తాచాటగలడు'

Ricky Ponting believes Marcus Stoinis is playing 5 times better than a 12 months ago

సిడ్నీ: ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్ స్టోయినిస్‌పై ఆ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. గత ఏడాదితో పోలిస్తే స్టోయినిస్‌ బహుముఖ పాత్రల్లో ఒదిగిపోతూ ఐదు రెట్లు మెరుగయ్యాడన్నాడు. ఓపెనర్‌, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌, బౌలర్‌గా రాణిస్తున్నాడని రికీ పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు స్టోయినిస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఢిల్లీ జట్టుకు ఆసీస్ మాజీ కోచ్ పాంటింగ్ కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్ 2020లో స్టోయినిస్‌ 13 వికెట్లతో పాటు 352 పరుగులు చేశాడు.

ఆస్ట్రేలియా క్రికెట్ డాట్ కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రికీ పాంటింగ్‌ మాట్లాడుతూ... 'ఐపీఎల్‌ 2020 తొలి ప్రాక్టీస్‌ సెషన్లలోనే మార్కస్ స్టోయినిస్‌ తన ఆటలో ఎంత మెరుగయ్యాడనేది చూపించాడు. గత కొన్నేళ్లుగా అతడిని దగ్గర నుంచి గమనిస్తున్నా. చివరి 12 నెలలతో పోలిస్తే.. అతడు ఐదు రెట్లు పరిణతి చెందాడు. భవిష్యత్తులో అతడు టాప్‌ ఆర్డర్‌లో గొప్పగా రాణిస్తాడు. అంతేగాక ఫినిషర్‌గానూ సత్తాచాటగలడు. విభిన్న స్థానాల్లో ఆడగలనని అతడు నిరూపించుకున్నాడు' అని తెలిపాడు.

Ricky Ponting believes Marcus Stoinis is playing 5 times better than a 12 months ago

'పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఫార్మాట్లలో స్టోయినిస్ ఎంతో బాధ్యతాయుతంగా ఆడతాడు. భారత్‌తో జరిగే సిరీస్‌లో దీన్ని కచ్చితంగా చూస్తాం. అవకాశం వస్తే తప్పకుండ తనేంటో నిరూపించుకుంటాడు. గతంతో పోలిస్తే అతడు స్పిన్‌లో ఎంతో దూకుడుగా ఆడుతున్నాడు. వేగంగా రన్స్ రాబడుతున్నాడు. ఐపీఎల్ 2020‌లో ప్రపంచ ఉత్తమ స్నిన్నర్లు అతడిని ఔట్‌ చేయాలని ప్రయత్నించినా.. సాధ్యం కాలేదు. ఆస్ట్రేలియా జట్టుకు అతడు నమ్మదగిన ఆటగాడు అవుతాడు' అని రికీ పాంటింగ్‌ తెలిపాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్ పదమూడో సీజన్‌లో ఢిల్లీ కాపియాటల్స్ తొలిసారి ఫైనల్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీ విజయాల్లో స్టోయినిస్ కీలక పాత్ర పోషించాడు.

ఐపీఎల్ 2020 టోర్నీ ఆరంభం నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు అతిపెద్ద బలహీనత ఓపెనింగ్ జోడి. శిఖర్ ధావన్‌కి జోడీగా తొలుత యువ ఆటగాడు పృథ్వీ షాని ఆడించింది. ఒకటి రెండు ఇన్నింగ్స్ తప్ప పృథ్వీ ప్రతి మ్యాచులో విఫలమయ్యాడు. దీంతో ఢిల్లీ ఆరంభంలోనే వికెట్ కోల్పోవాల్సి వచ్చేది. మధ్యలో అజింక్య రహానెతోనూ ప్రయోగాలు చేయించింది. కానీ ఆ ప్రయోగం కూడా పెద్దగా వర్కవుట్ కాలేదు. ఇక కీలక మ్యాచులో మార్కస్ స్టోయినిస్‌ని ఓపెనర్‌గా పంపి పెద్ద సాహసమే చేసింది. అయితే అది ఫలితాన్ని ఇచ్చింది. స్టోయినిస్‌కు బిగ్ బాష్ టోర్నీలో ఓపెనర్‌గా ఆడిన అనుభవం ఉంది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా, బౌలర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే.

విరాట్ కోహ్లీ చెడ్డ కెప్టెన్ కాదు.. కానీ రోహిత్‌ శర్మ అత్యుత్తమం!! భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా!విరాట్ కోహ్లీ చెడ్డ కెప్టెన్ కాదు.. కానీ రోహిత్‌ శర్మ అత్యుత్తమం!! భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా!

Story first published: Tuesday, November 24, 2020, 11:51 [IST]
Other articles published on Nov 24, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X