న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీని గేలి చేసిన ఘటనపై అభిమానులకు క్రికెట్ ఆస్ట్రేలియా వార్నింగ్

Ind Vs Aus 4th Test : Cricket Australia Urges Fans To Show Respect After Crowd Boos Kohli
Respect Visitors, Urges Cricket Australia After Crowd Boos Virat Kohli

హైదరాబాద్: సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు దిగుతున్నప్పుడు ఆసీస్ అభిమానులు ఎగతాళిగా అరుస్తుండటాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా తప్పుబట్టింది. ఒక ఆతిథ్య జట్టుకు కనీస గౌరవం ఇవ్వాలనే విషయాన్ని మరచిపోతే ఎలా అంటూ అభిమానులపై మండిపడింది.

ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఒక మచ్చగా

ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఒక మచ్చగా

ఇలాంటి సంఘటనలు ఆస్ట్రేలియా క్రికెట్‌కు ఒక మచ్చగా మిగిలిపోతాయని చెప్పుకొచ్చింది. ఇకనుంచైనా అటువంటి అనుచిత ప్రవర్తనను కట్టిపెట్టి మర్యాదగా ప్రవర్తించాలని ఆసీస్‌ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. దీనిపై ఆస్ట్రేలియా చీఫ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ మాట్లాడుతూ "దేశానికి వచ్చిన అతిథులను ఇలా అవమానించడం సరికాదు. అతిథులను గౌరవించడం నేర్చుకోవాలి" అని అన్నాడు.

ఆట మనందరికంటే పెద్దది

ఆట మనందరికంటే పెద్దది

"ఆట మనందరికంటే పెద్దది. మనం అతిథుల్ని గౌరవించాలి. మన దేశంలో పర్యటించే వారికి ఉత్తమ అనుభవాన్ని ఇవ్వాలి. మైదానంలో వారిని ఓడించాల్సిందే కానీ.. అదే సమయంలో వారితో గౌరవప్రదంగా వ్యవహరించాలి" అని ఆస్ట్రేలియా చీఫ్‌ కెవిన్‌ రాబర్ట్స్‌ పేర్కొన్నాడు. ఇలాంటి చర్యలను పునరావృతం చేయవద్దని అభిమానులకు హితవు పలికాడు.

తొలి టెస్టులో కూడా ఇలానే

తొలి టెస్టులో కూడా ఇలానే

కాగా, ఈ సిరిస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరిగిన తొలి టెస్టులో కూడా విరాట్‌ కోహ్లీ క్రీజులోకి వచ్చిన సమయంలో ఆసీస్‌ ప్రేక్షకులు గేలి చేసిన సంగతి తెలిసిందే. సిడ్నీ టెస్టులో తొలిరోజు ఆసీస్ అభిమానులు భారత కెప్టెన్‌ విరాట్ కోహ్లీని గేలి చేస్తుంటే... కోహ్లీకి గౌరవం ఇవ్వాలని ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ అభిమానులను కోరిన సంగతి తెలిసిందే.

రికీ పాంటింగ్ సైతం

రికీ పాంటింగ్ సైతం

‘అతనిపై అభిమానం ఉండి అరిస్తే పరవాలేదు. అలా కాకుండా అవమానకరంగా అరిస్తే మాత్రం సహించను. నిజంగానే ఎస్‌సీజీలో అలా జరిగితే అవమానకరంగా భావిస్తాను. ఇప్పటికే నేను పెర్త్‌ టెస్టులో జరిగిన దానిపై తప్పంటూ సూచించాను. టీమిండియా కెప్టెన్ కోహ్లీని గౌరవించడం నేర్చుకోండి' అంటూ పాంటింగ్‌ అభిమానులకు సూచించాడు.

Story first published: Saturday, January 5, 2019, 15:32 [IST]
Other articles published on Jan 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X