న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ ఎప్పుడు సెంచరీ చేస్తే.. అప్పుడే కరోనా వైరస్ మాయమవుతుంది! జోస్యం ఇదే చెపుతోంది!

Relationship between Coronavirus death and Virat Kohlis century
Virat Kohlil Century తో ముడిపడ్డ Coronavirus అభిమాని జోస్యం.. ప్రపంచం కోసం సెంచరీ చేయవా కోహ్లీ

హైదరాబాద్: విరాట్ కోహ్లీ.. ఈ పేరు వినగానే మనకు 'పరుగుల యంత్రం' అని గుర్తొస్తుంది. మనోడికి రికార్డుల రారాజు, చేజింగ్ కింగ్ అనే బిరుదులు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ ఊరికే రాలేదు. ఫార్మాట్ ఏదైనా, బౌలర్ ఎవరైనా క్రీజులోకి దిగాడంటే పరుగుల వరద పారాల్సిందే.. స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు విరాట్ అలవోకగా బాదేస్తుంటాడు. అలాంటిది దాదాపు 18 నెలలుగా కనీసం ఒక్క ఫార్మాట్‌లోనూ సెంచరీ చేయలేకపోయాడు. దీంతో అభిమానులు కోహ్లీ సెంచరీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

కరోనా ఎప్పుడు పోతుందిరా దేవుడా:

ఇక కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇటీవల కాస్త అదుపులోకి వచ్చిన వైరస్ ఉద్ధృతి ప్రస్తుతం రోజురోజుకూ తీవ్రతరం అవుతుంది. కరోనా సెకండ్‌ వేవ్‌తో ప్రజలందరూ వణికిపోతున్నారు. ముఖ్యంగా భారత్‌ అల్లాడిపోతోంది. దేశం ఆంతటా ఆసుపత్రిలో పడకలు దొరక్క, ఆక్సిజన్‌ లభించక కరోనా బాధితులు నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు రోజురోజుకు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో అందరిలో ఆందోళన మొదలైంది. ఈ కరోనా ఎప్పుడు పోతుందిరా దేవుడా అంటూ ప్రతి ఒక్కరు వేడుకుంటున్నారు. అయితే ఓ క్రికెట్ అభిమాని కరోనా ఎప్పుడు పోతుందో జోస్యం చెప్పాడు.

సెంచరీ చేయవా కోహ్లీ:

మజర్ అర్షద్ అనే ఓ వ్యక్తి ఓ ట్వీట్ చేస్తూ.. 'ప్రపంచం ఎప్పుడు మరలా సాధారణ స్థితికి వస్తుంది' అని ప్రశ్నించాడు. ఈ ట్వీట్‌కు సౌరబ్ మల్హోత్రా అనే వ్యక్తి సమాధానం ఇచ్చాడు. 'టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎప్పుడు అంతర్జాతీయ సెంచరీ చేస్తే.. అప్పుడే కరోనా వైరస్ మహమ్మారి మాయమవుతుంది' అని రీ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది. నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'బీసీసీఐ వెంటనే ఐర్లాండ్ టూర్ ఏర్పాటు చేయాలి' అని ఒకరు కెమెంట్ చేయగా.. 'ప్రజల కోసం సెంచరీ చేయవా కోహ్లీ' అని మరొకరు ట్వీట్ చేశారు. 'కోహ్లీ.. ప్లీజ్ ఆ సెంచరీ చేయవా', 'ప్రపంచం కోసం చేయవా' అంటూ ఫాన్స్ సరదాగా కోరుతున్నారు.

2019లో చివరి సెంచరీ:

విరాట్ కోహ్లీ 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే/నైట్‌ టెస్టులో చివరగా సెంచరీ చేశాడు. ఆ తర్వాత ఇప్పటివరకు దాదాపు 45-50 ఇన్నింగ్స్‌లు ఆడినా.. సెంచరీ మాత్రం చేయలేకపోయాడు. ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలుమార్లు సెంచరీకి చేరువైనా దురదృష్టవశాత్తూ మూడంకెల స్కోర్‌ అందుకోలేకపోయాడు. మూడు ఫార్మాట్‌లలో కలిపి కోహ్లీ మొత్తం 70 శతకాలతో కొనసాగుతున్నాడు. టెస్టుల్లో 27, వన్డేల్లో 43 సార్లు మూడంకెల స్కోర్లు అందుకున్నాడు. ఇక టీ20ల్లో అత్యధిక స్కోర్ 94 నాటౌట్.

అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు:

అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు:

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 91 టెస్టులాడి 52.4 సగటుతో 7490 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 పరుగులు చేసాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 రన్స్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేలకు పైగా పరుగులు చేశాడు.

Story first published: Thursday, April 29, 2021, 18:48 [IST]
Other articles published on Apr 29, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X