హైలెట్స్: సఫారీ గడ్డపై ముత్తయ్య రికార్డు బద్దలు కొట్టిన కుల్దీప్

Posted By:
Record-breaking Kuldeep, Chahal conquer South Africa soil

హైదరాబాద్: పాతికేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత సఫారీ గడ్డ మీద భారత జట్టు తొలి వన్డే సిరీస్ నెగ్గింది. ఆరు వన్డేల సిరిస్‌లో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 4-1 తేడాతో సిరీస్‌‌ను కైవసం చేసుకుని కోహ్లీసేన చరిత్ర సృష్టించింది. ఈ విజయంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు ఓపెనర్ ధావన్‌... మణికట్టు స్పిన్నర్లు కుల్దీప్, చాహల్‌లు కీలక పాత్ర పోషించారు.

ముఖ్యంగా వన్డే సిరిస్‌లో మణికట్టు స్పిన్నర్లు చెలరేగడంతో తొలి మూడు వన్డేల్లో భారత్ ఏకపక్ష విజయాలను నమోదు చేసింది. అంతేకాదు భారత స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌లను ఎలా ఎదుర్కొవాలో అర్ధం కావడం లేదంటూ సఫారీ బ్యాట్స్‌మెన్లు స్వయంగా చెప్పారు. తమ అద్భుత ప్రదర్శనతో కుల్దీప్-చాహల్‌ల జోడి సఫారీ గడ్డపై అరుదైన రికార్డును అందుకుంది.

Ind vs SA 5th ODI : India Won First-Ever ODI Series In SA

ఇప్పటివరకు ముగిసిన ఐదు మ్యాచ్‌ల్లోనే వీరిద్దరూ కలిసి 30 వికెట్లు తీశారు. తద్వారా దక్షిణాఫ్రికాలో స్పిన్నర్లు అత్యధిక వికెట్లు పడగొట్టిన ద్వైపాక్షిక సిరీస్‌‌గా ఈ ఆరు వన్డేల సిరిస్ నిలిచింది. విదేశాల్లో భారత స్పిన్నర్లు ఈ స్థాయి ప్రదర్శన చేయడం కూడా ఇదే తొలిసారి. ఆదో వన్డేలో నాలుగు వికెట్లు తీసిన కుల్దీప్.. ఇప్పటివరకు 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

దీంతో సఫారీ గడ్డపై వన్డే సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్ రికార్డుని అధిగమించాడు. 1998లో దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో మురళీ ధరన్ 14 వికెట్లు తీశాడు. కుల్దీప్ ఇప్పటి వరకూ 17 ఇన్నింగ్స్‌ల్లో బౌలింగ్ చేయగా 8 మ్యాచ్‌ల్లో 3 వికెట్ల చొప్పున తీశాడు.


5వ వన్డే మ్యాచ్ హైలెట్స్:

* సపారీ గడ్డపై భారత జట్టు నెగ్గిన తొలి ద్వైపాక్షిక వన్డే సిరిస్ ఇది. అంతకముందు 1992లో 2-5, 2006లో 0-4, 2011లో 2-3, 2013లో 0-2 తేడాతో ఓటమి పాలైంది. వరుసగా తొమ్మిది సిరిస్‌ల్లో విజయం సాధించిన తర్వాత స్వదేశంలో దక్షిణాఫ్రికా ఓడిన తొలి సిరిస్ ఇదే కావడం విశేషం.


* టీమిండియా వరుసగా 9 ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లను గెలుచుకొంది. వరుసగా 14 సిరీస్‌లను కైవసం చేసుకున్న రికార్డు వెస్టిండీస్ పేరిట ఉంది.


* ఇప్పటివరకు ముగిసిన ఐదు వన్డేల్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా సఫారీ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో స్పిన్ లెజెండ్ ముత్తయ్య మురళీ ధరన్ రికార్డుని అధిగమించాడు. 1998లో దక్షిణాఫ్రికాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో మురళీ ధరన్ 14 వికెట్లు తీశాడు.


* ఈ సిరిస్‌లో ఇప్పటివరకు ముగిసిన ఐదు మ్యాచ్‌ల్లోనే వీరిద్దరూ కలిసి 30 వికెట్లు తీశారు. తద్వారా దక్షిణాఫ్రికాలో స్పిన్నర్లు అత్యధిక వికెట్లు పడగొట్టిన ద్వైపాక్షిక సిరీస్‌‌గా ఈ ఆరు వన్డేల సిరిస్ నిలిచింది. విదేశాల్లో భారత స్పిన్నర్లు ఈ స్థాయి ప్రదర్శన చేయడం కూడా ఇదే తొలిసారి.


* సఫారీ గడ్డపై 13 వన్డే మ్యాచ్‌లాడిన రోహిత్ శర్మ ఐదో వన్డేలో అత్యధిక స్కోరు (115) నమోదు చేశాడు. అంతకముందు రోహిత్ శర్మ ఆడిన 12 వన్డేల్లో 11.45 యావరేజితో 126 పరుగులు మాత్రమే చేశాడు.


* రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీలు 13సార్లు వందకు పైగా భాగస్వామ్యాలను నమోదు చేశారు. సచిన్-గంగూలీల తర్వాత అత్యధిక భాగస్వామ్యాలను నెలకొల్పిన జోడీగా వీరిద్దరూ సచిన్-సెహ్వాగ్ జోడీతో కలిసి రెండో స్థానంలో నిలిచారు. సచిన్-గంగూలీల జోడి 26సార్లు వందకు పైగా భాగస్వామ్యాలను నమోదు చేశారు.


* రోహిత్ శర్మ కారణంగా కోహ్లీ ఏడు సార్లు రనౌటయ్యాడు. కోహ్లీని రనౌట్ చేసిన ప్రతిసారీ రోహిత్ శర్మ సెంచరీలతో చెలరేగాడు. రెండుసార్లు డబుల్ సెంచరీలు సాధించగా, రెండుసార్లు సెంచరీలు సాధించాడు. కోహ్లీ రనౌట్‌కు కారణమైన ప్రతిసారీ రోహిత్ శర్మ చేసిన స్కోర్లు వరుసగా 57, 209, 264, 124, తాజాగా ఐదో వన్డేలో 115 పరుగులు నమోదు చేశాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 14, 2018, 16:35 [IST]
Other articles published on Feb 14, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి