న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీలంక క్రికెట్ మ్యాచ్‌లను చూడను: రణతుంగ సంచలనం

శ్రీలంక క్రికెట్‌లో చీదరించుకునే వాతావరణం నెలకొందని ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంక జట్టు ఆడే మ్యాచ్‌లను చూడనంటూ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: శ్రీలంక క్రికెట్‌లో చీదరించుకునే వాతావరణం నెలకొందని ఆ దేశ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2011 వరల్డ్ కప్‌లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఫిక్సింగ్ అయిందంటూ ఇటీవలే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

శ్రీలంక జట్టు ఆడే మ్యాచ్‌లను చూడనంటూ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ పరిపాలనలోఉన్న అసహ్యకర వాతావరణమే తనను తమ మ్యాచ్‌లు చూడకుండా చేస్తోందని రణతుంగ పేర్కొన్నాడు.

Reasons revealed for Arjuna Ranatunga not watching India-Sri Lanka Test series


'శ్రీలంక క్రికెట్‌లో చీదరించుకునే వాతావరణం నెలకొని ఉంది. దాంతో మా జాతీయ జట్టు ఆడే మ్యాచ్‌లను చూడాలని అనుకోవడం లేదు. మా జట్టు ఏ సిరీస్ ఆడుతున్నా చూసే ఆసక్తిమాత్రం నాకు లేదు' అని సియోలోన్ టుడే పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో పేర్కొన్నాడు.

ప్రస్తుతం దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగున్న టెస్టు సిరీస్‌ను చూస్తున్నానని రణతుంగ పేర్కొన్నాడు. శ్రీలంక క్రికెట్‌లో ప్రక్షాళన కోసం తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఆ దేశ ప్రధాని రాణిల్ విక్రమ్ సింఘేకు రణతుంగ లేఖ రాస్తానని వెల్లడించారు.

దక్షిణాఫ్రికా-ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో ఉంది. ఇరు జట్ల మధ్య చివరి టెస్టు అయిన నాలుగో టెస్టు ఆగస్టు 4న ప్రారంభం కానుంది. లంక తరుపున 93 టెస్టులాడిన రణతుంగ 5,105 పరుగులు చేయగా, 269 వన్డేల్లో 7,456 పరుగులు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:16 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X