RCBian Mr.Nags: ఓ ఇంటివాడైన ఆర్‌సీబీ ఫన్నీమాన్ డానిష్‌ సైత్‌ 'మిస్టర్‌ నాగ్స్‌'...వైరల్ ఫొటోస్..!!

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజీ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు (ఆర్‌సీబీ) జట్టు ఫన్నీ మ్యాన్‌ 'మిస్టర్‌ నాగ్స్‌' ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్‌లో గురువారం అన్య రంగస్వామితో మిస్టర్‌ నాగ్స్‌ (డానిష్‌ సైత్‌) వివాహం జరిగింది. కరోనా వైరస్ నిబంధనలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు, కొంతమంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. కరోనా పరిస్థితుల కారణంగా తన పెళ్లి వేడుకకు హాజరుకాలేకపోయిన వారి కోసం అతడు లైవ్ ప్రసారం చేశాడు. గత ఏడాది డిసెంబర్‌లో డానిష్‌ సైత్‌, అన్య రంగస్వామి నిశ్చితార్థం జరిగింది.

పెళ్లికి సంబందించిన ఫొటోలను డానిష్‌ సైత్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. 'నిన్న మా రిజిస్టర్డ్ పెళ్లి జరిగింది. అన్య రంగస్వామి, నేను ఈ రోజు 15 మంది మా దగ్గరి కుటుంబ, స్నేహితుల సమక్షంలో రింగ్స్ మార్చుకున్నాం. ఎంతో ప్రేమతో ఈ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం. మీ మంచి హృదయాలతో మమ్మల్ని ఆశీర్వదించండి' అని డానిష్‌ సైత్‌ కోరారు. నూతన జంటకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మిస్టర్‌ నాగ్స్‌ వివాహానికి హాజరైన అతి కొద్దిమందిలో దర్శకుడు సాద్ ఖాన్ కూడా ఉన్నాడు.

ఊరుకొనే ప్రసక్తి లేదు.. మోర్గాన్‌, మెక్‌కలమ్‌పై చర్యలు తీసుకుంటాం: వెంకీ

ఆర్‌సీబీ జట్టు ఫన్నీ మ్యాన్‌ 'మిస్టర్‌ నాగ్స్‌' అసలు పేరు డానిష్‌ సైత్‌. డానిష్‌లో చాలా కళలు ఉన్నాయి. అతడు కమెడియన్, టెలివిజన్ హోస్ట్, రేడియో జాకీ, నటుడు మరియు రచయిత కూడా. రచయితగా కన్నడ సినిమాలో చేస్తాడు. ఇక ఐపీఎల్ ప్రారంభం అయితే రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగుళూరు జట్టులో చేరిపోతాడు. ఆర్‌సీబీ ఆటగాళ్లకు వినోదం, ఆనందాన్ని పంచడమే మనోడి పని. ఆటగాళ్లతో ప్రాంక్స్‌ కూడా చేస్తుంటాడు. మిస్ట‌ర్ నాగ్స్‌గా పేరుగాంచిన డానిష్‌ సైత్‌.. ఆర్‌సీబీకి హెస్ట్‌, ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుంటాడు.

ఐపీఎల్ 2021 సమయంలో కేఓటైన్ విరాట్ కోహ్లీపై మిస్టర్‌ నాగ్స్‌ పంచులు వేశాడు. ఐపీఎల్ 2021లోని ఓ మ్యాచులలో స్లో ఓవర్‌ రేట్‌ నమోదు చేసిన కెప్టెన్‌కు భారీ జరిమానా విధిస్తున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై నాగ్స్ పంచ్ వేశాడు. 'ఈ ఫ్లైట్ 90 నిమిషాల్లో ముంబై వెళ్తుంది. ఆల‌స్య‌మైతే.. ఆర్‌సీబీ కెప్టెన్‌కు ఫైన్ వేద్దాం. విరాట్ కోహ్లీకి ఇది అల‌వాటే' అని సెటైర్ వేశాడు. తన ఇంగ్లిష్‌ మాటలతో, ప్రత్యేకమైన హాస్యంతో ఆర్‌సీబీ జట్టు సభ్యులను, బెంగళూరు అభిమానులను నాగ్స్ ఉత్సాహపరుస్తాడన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ 2021లో ఆర్‌సీబీ జోరు కనబరిచింది. ఎలాగైనా ఈ ఏడాది ఐపీఎల్‌ టైటిల్‌ పట్టాలని చూస్తోంది. అంతేకాదు ఆ దిశగా అడుగులు కూడా వేస్తోంది. లీగ్ నిలిచే సమయానికి ఆడిన 7 మ్యాచుల్లో 5 విజయాలతో పట్టికలో మూడో స్థానంలో ఉంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, June 10, 2021, 15:14 [IST]
Other articles published on Jun 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X