న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆర్సీబీ ప్రదర్శన వరల్డ్‌కప్‌పై పడదు: కోహ్లీ ఇంటర్నేషనల్ స్టార్

RCBs poor run will not affect Virat Kohli in World Cup: Lockie Ferguson

హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ సూపర్‌స్టార్ అని, ఆర్సీబీకి ఆడటానికి భారత జట్టుకు ఆడటానికి చాలా తేడా ఉంటుందని న్యూజిలాండ్ పేస్ బౌలర్ లోకీ పెర్గుసన్ అన్నాడు. అంతేకాదు ఐపీఎల్ 2019 సీజన్‌లో ఆర్సీబీ ప్రదర్శన విరాట్ కోహ్లీపై ఎలాంటి ప్రభావం చూపదని చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ సీజన్‌లో ఇప్పటివరకు 8 మ్యాచ్‌లాడిన విరాట్ కోహ్లీ 34.75 యావరేజితో 278 పరుగులు చేశాడు. ఇక, జట్టు విషయానికి వస్తే ఈ సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌‌ల్లో ఏడింట ఓటమిపాలై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. అంతేకాదు ప్లేఆఫ్ ఆశలను సైతం సంక్లిష్టం చేసుకుంది.

ఐపీఎల్‌లో కేకేఆర్ తరుపున

ఐపీఎల్‌లో కేకేఆర్ తరుపున

ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు తరుఫున ఆడుతోన్న లోకీ ఫెర్గుసన్‌ పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. "విరాట్ కోహ్లీ ఇంటర్నేషనల్ సూపర్ స్టార్. ఐపీఎల్‌లో ఆర్సీబీకి ఆడటానికి భారత జట్టుకు ఆడటానికి చాలా తేడా ఉంటుంది" అని ఫెర్గుసన్ అన్నాడు.

వరల్డ్‌కప్‌పై ఉండదు

వరల్డ్‌కప్‌పై ఉండదు

"ఆర్సీబీ ప్రదర్శన ప్రభావం వరల్డ్‌కప్‌పై ఉండదు. అదొక భిన్నమైన జట్టు.. భిన్నమైన ఫార్మాట్. అంతేకాదు వరల్డ్‌కప్‌ అనేది ఓ ప్రత్యేకమైన టోర్నమెంట్. కాబట్టి, అక్కడ విరాట్ కోహ్లీ విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. లేకుంటే విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తాడు" అని ఫెర్గుసన్ చెప్పుకొచ్చాడు.

వరల్డ్‌కప్ భిన్నమైన టోర్నీ

వరల్డ్‌కప్ భిన్నమైన టోర్నీ

"టీ20 క్రికెట్‌లో కెప్టెన్‌గా కోహ్లీ పెద్దగా విజయాలను నమోదు చేయలేదు. అయితే, వరల్డ్‌కప్‌లో కూడా అలాంటి ఫలితాలే వస్తాయని చెప్పలేం" అని ఫెర్గుసన్ అన్నాడు. ఇక, టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్‌పై ఫెర్గుసన్ ప్రశంసలు కురిపించాడు. "టీ20లు ఆడేందుకు ధావన్ న్యూజిలాండ్ పర్యటనకు వచ్చాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున రాణిస్తున్నాడు" అని అన్నాడు.

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ఆరంభం

మే30 నుంచి ఇంగ్లాండ్ వేదికగా వరల్డ్‌కప్ ఆరంభం

ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా ఆతిథ్యమిస్తోన్న వన్డే వరల్డ్‌కప్ మే30 నుంచి ఆరంభం కానుంది. ఈ వరల్డ్‌కప్ కోసం క్రికెట్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, న్యూజిలాండ్ జట్టు ఇప్పటికే ఈ మెగా టోర్నీ కోసం 15 మందితో జట్టుని ప్రకటించింది. తాజాగా, బీసీసీఐ కూడా 15 మందితో కూడిన జట్టుని సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, April 17, 2019, 18:32 [IST]
Other articles published on Apr 17, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X