బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2021 సీజన్ కోసం ఫ్రాంచైజీలన్నీ సమయాత్తం అవుతున్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో జరిగే మినీ వేలం కోసం అన్ని రకాలుగా సిద్దమవుతున్నాయి. జనవరి 21 లోపు రిటైన్ చేసుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే ప్లేయర్ల జాబితాను సమర్పించాలనే బీసీసీఐ ఆదేశాల మేరకు ఫ్రాంచైజీలన్నీ కార్యచరణను మొదలుపెట్టాయి. ఇక విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) 12 మందిని రిటైన్ చేసుకొని 10 మందిని వదులుకుంది. ఈ మేరకు ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్ల జాబితాను ట్వీట్ చేసింది.
IPL Retention Announcement 🔊 Here’s the news you’ve been waiting for, 12th Man Army. We have retained 12 stars from our 2020 squad. 🌟🤩#PlayBold #IPL2021 #WeAreChallengers pic.twitter.com/YkzSV3EUjU
— Royal Challengers Bangalore (@RCBTweets) January 20, 2021
కెప్టెన్ విరాట్ కోహ్లీ, సౌతాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌తో సహా గత సీజన్‌లో క్లాస్ బ్యాటింగ్‌తో రాణించిన దేవదత్ పడిక్కల్‌ను రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ.. బౌలర్లలో సిరాజ్, సుందర్, నవ్‌దీప్ సైనీ, ఆడమ్ జంపాలను అంటిపెట్టుకుంది. ఇక ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్‌తో సహా శివమ్ దూబేను వదులుకుంది.
ఆర్‌సీబీ రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు..
విరాట్ కోహ్లీ(కెప్టెన్), ఏబీ డివిలియర్స్, యుజ్వేంద్ర చాహల్, దేవదత్ పడిక్కల్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, నవ్‌దీప్ సైనీ, ఆడమ్ జంపా, షెబాజ్ అహ్మద్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్సన్, పవన్ దేశ్‌పాండే
వదులుకున్న ఆటగాళ్లు..
మోయిన్ అలీ, శివమ్ దూబే, గుర్‌క్రీత్ సింగ్, ఆరోన్ ఫించ్, క్రిస్ మోరిస్, పవన్ నేగి, పార్థీవ్ పటేల్(రిటైర్డ్), డేల్ స్టేయిన్, ఇసురు ఉడానా, ఉమేశ్ యాదవ్