న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2023 : ఆర్సీబీకి మంచిరోజులు.. వచ్చే ఐపీఎల్‌లో కప్పు కొట్టేస్తుందా?

RCB captain du Plesis is in red hot form they may win IPL 2023

ఐపీఎల్‌లో ఎంత సత్తా ఉన్నా కప్పు కొట్టలేకపోయిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. క్రిస్ గేల్, ఏబీ డివిల్లీర్స్, మ్యాక్స్ వెల్, విరాట్ కోహ్లీ వంటి టాప్ స్టార్లు ఈ జట్టులో ఉన్నప్పుడు కూడా ఐపీఎల్ ట్రోఫీ నెగ్గలేకపోయింది. అయితే ఈసారి ఆ జట్టుకు మంచిరోజులు వచ్చినట్లే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ తన సూపర్ ఫామ్ అందుకున్న సంగతి తెలిసిందే.. అలాగే ఆ జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ కూడా చెలరేగుతున్నాడు. ఇటీవల అతను ఆడిన సూపర్ ఇన్నింగ్స్‌లే దానికి ఉదాహరణ.

బిగ్ బ్యాష్ లీగ్‌లో..

బిగ్ బ్యాష్ లీగ్‌లో..

ఆస్ట్రేలియాలో జరిగిన బిగ్ బ్యాష్ లీగ్‌లో పెర్త్ స్కార్చర్స్ తరఫున డుప్లెసిస్ కొన్ని కీలకమైన ఇన్నింగ్సులు ఆడాడు. ఈ క్రమంలోనే డిసెంబరు 23న మెల్‌బోర్న్ స్టార్స్‌పై అతను అద్భుతంగా ఆడాడు. కేవలం 33 బంతుల్లోనే 68 పరుగులు చేశాడు. దీంతో పెర్త్ జట్టు 7 వికెట్ల నష్టానికి 227 పరుగులు చేసింది. బీబీఎల్‌లో పెర్త్ చేసిన అత్యధిక స్కోరు ఇదే కావడం గమనార్హం. దీనిలో డుప్లెసిస్ పాత్ర చాలా కీలకం. ఆ తర్వాత ఈ మ్యాచ్‌ కూడా పెర్త్ గెలిచింది. ఈ టోర్నీలో 7 ఇన్నింగ్సులు ఆడిన డుప్లెసిస్.. 153 స్ట్రైక్ రేటుతో 167 పరుగులు చేసి సౌతాఫ్రికా టీ20 టోర్నీ కోసం స్వదేశం వచ్చేశాడు.

 ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ..

ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ..

సౌతాఫ్రికా టీ20 లీగులో జోబర్గ్ సూపర్ కింగ్స్‌కు సారధ్యం వహిస్తున్న డుప్లెసిస్ ఆ జట్టు తరఫున కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ధనా ధన్ ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టించిన అతను కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే 51 పరుగుల వద్ద అతను అవుటవడయ్యాడు. ఆ తర్వాత సూపర్ కింగ్స్ బ్యాటింగ్ విఫలమవడంతో ఆ జట్టు 15.4 ఓవర్లలో 122 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ లక్ష్యాన్ని ప్రిటోరియా సులభంగా ఛేదించింది.

 ఫస్ట్ సెంచరీ కూడా..

ఫస్ట్ సెంచరీ కూడా..

సౌతాఫ్రికా టీ20 లీగ్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీ చేసిన ఆటగాడిగా కూడా డుప్లెసిస్ రికార్డు సృష్టించాడు. డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 179 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి డుప్లెసిస్ బరిలో దిగాడు. మరో ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (45)తో కలిసి అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన డుప్లెసిస్.. 8 సిక్సర్లు, 8 ఫోర్లతో కేవలం 54 బంతుల్లోనే సెంచరీ పూర్తిచేశాడు. ఆ మ్యాచ్‌లో 113 పరుగులతో అజేయంగా నిలిచిన అతను జట్టుకు ఒంటి చేత్తో విజయం అందించాడు.

Story first published: Thursday, January 26, 2023, 16:40 [IST]
Other articles published on Jan 26, 2023
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X