న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

58 బంతుల్లో 49 పరుగులకే ఆలౌట్ చేశారు: ఆ నలుగురు బౌలర్లు ఆర్సీబీకే

By Nageshwara Rao
RCB buy all 4 pacers who dismissed them for 49 in 58 balls

హైదరాబాద్: ఆదివారంతో రెండు రోజుల ఐపీఎల్ వేలం ముగిసింది. బెంగళూరు వేదికగా శని, ఆదివారాల్లో జరిగిన వేలంలో మొత్తం 169 ఆటగాళ్లు అమ్ముడుబోయారు. అందులో 56 మంది విదేశీ ఆటగాళ్లు ఉన్నారు. వేలంలో అన్ని ప్రాంఛైజీలు కలిపి రూ.431.7 కోట్లు ఖర్చు చేశాయి.

వేలంలో భాగంగా ఒక్క కోల్‌కతా నైట్‌రైడర్సే మాత్రమే మొత్తం రూ.80 కోట్లూ ఖర్చు చేసింది. గరిష్టంగా చెన్నై వద్ద రూ. 6.5 కోట్లు మిగిలింది. పంజాబ్‌ రూ.10 లక్షలు, బెంగళూరు రూ.15 లక్షలు, ముంబై రూ. 65 లక్షలు, హైదరాబాద్ రూ. 65 లక్షలు, ఢిల్లీ రూ.1.6 కోట్లు, రాజస్థాన్‌ రూ.1.65 కోట్లు మిగిల్చుకున్నాయి.

వేలంలో ఆటగాళ్ల ఎంపిక విషయంలో ఫ్రాంచైజీలు ఆచితూచి వ్యవహరించాయి. టీ20 స్పెషలిస్ట్ అయిన క్రిస్ గేల్ లాంటి ఆటగాడిని కొనుగోలు చేసేందుకు ఏ ప్రాంఛైజీ ముందుకు రాలేదు. అయితే వేలం చివరి రౌండ్‌లో కనీస ధర రూ. 2 కోట్లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు అతడిని కొనుగోలు చేసింది.

ఐపీఎల్ 11వ సీజన్ కోసం నిర్వహించిన వేలంలో అనామక ప్లేయర్లు కూడా కోట్లు పలికారు. ముఖ్యంగా ఈ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసిన నలుగురు ఆటగాళ్లు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఎందుకంటే గతేడాది జరిగిన ఐపీఎల్ ‌ఆ జట్టుని ముప్పతిప్పలు పెట్టిన నలుగురు బౌలర్లను బెంగళూరు ఈసారి కొనుగోలు చేసింది.

క్రిస్‌ వోక్స్‌ (రూ.7.4 కోట్లు), ఉమేశ్‌ యాదవ్‌ (రూ.4.2 కోట్లు), నాథన్‌ కౌల్టర్‌ నైల్‌ (రూ.2.2 కోట్లు), కొలిన్‌ డి గ్రాండ్‌హోమ్‌ను (రూ.2.2 కోట్లు)లను వేలంలో బెంగళూరు కొనుగోలు చేసింది. 2018 ఐపీఎల్‌ వేలంలో జరిగిన అరుదైన సంఘటనగా క్రికెట్ విశ్లేషకులు దీనిని అభివర్ణిస్తున్నారు.

గత ఐపీఎల్‌లో బెంగళూరుని ఈ బౌలర్లే 49 పరుగులకే ఆలౌట్‌ చేశారు. ఐపీఎల్ పదో సీజన్‌లో టోర్నీలో భాగంగా 27వ మ్యాచ్‌‌లో ఈ బౌలర్లు ఈ ఘనత సాధించారు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 131 పరుగులు చేసింది.

అనంతరం 132 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన బెంగళూరుకు కోల్‌కతా బౌలర్లు చుక్కలు చూపించారు. క్రీజులోకి వచ్చిన ఆటగాడిని వచ్చినట్టే పెవిలియన్‌ బాట పట్టించారు. క్రిస్ వోక్స్‌, గ్రాండ్‌హోమ్‌, నైల్‌ తలో మూడు వికెట్లు తీయగా... ఉమేశ్‌ యాదవ్‌ ఒక వికెట్‌ తీసి బెంగళూరుని కుప్పకూల్చారు.

దీంతో బెంగళూరు కేవలం 49 పరుగులకే ఆలౌటైంది. ఐపీఎల్‌ చరిత్రలోనే ఓ జట్టు నమోదు చేసిన అత్యల్ప స్కోరు ఇదే కావడం విశేషం. అలా బెంగళూరు జట్టుని ఐపీఎల్ చరిత్రలోనే అతి తక్కువ స్కోరుకే ఆలౌట్ చేసిన బెంగళూరు జట్టు ఐపీఎల్ 11వ సీజన్‌ కోసం నిర్వహించిన వేలంలో బెంగళూరు కొనుగోలు చేయడం విశేషం.


రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
1. విరాట్ కోహ్లి (రూ.17 కోట్లు-Retained)
2. ఏబీ డివిలియర్స్ (రూ.11 కోట్లు-Retained)
3. సర్ఫరాజ్ ఖాన్ (రూ.1.75 కోట్లు- Retained)
4. మెకల్లమ్ (రూ.3.6 కోట్లు)
5. క్రిస్ వోక్స్ (రూ.7.4 కోట్లు)
6. కొలిన్ గ్రాండ్‌హోమ్ (రూ.2.2 కోట్లు)
7. మొయిన్ అలీ (రూ1.7 కోట్లు)
8. క్వింటన్ డీకాక్ (ర.2.8 కోట్లు)
9. ఉమేష్ యాదవ్ (రూ.4.2 కోట్లు)
10. యజువేంద్ర చాహల్ (రూ.6 కోట్లు-RTM)
11. మనన్ వోహ్రా (రూ.1.1 కోట్లు)
12. కుల్వంత్ ఖేజ్రోలియా (రూ.85 లక్షలు)
13. అనికేత్ చౌదరి (రూ.30 లక్షలు)
14. నవదీప్ సైనీ (రూ.3 కోట్లు)
15. మురుగన్ అశ్విన్ (రూ.2.2 కోట్లు)
16. మణ్‌దీప్ సింగ్ (రూ.1.4 కోట్లు)
17. వాషింగ్టన్ సుందర్ (రూ.3.2 కోట్లు)
18. పవన్ నేగి (రూ.కోటి-RTM)
19. మహ్మద్ సిరాజ్ (రూ.2.6 కోట్లు)
20. నేథన్ కూల్టర్ నైల్ (రూ.2.2 కోట్లు)
21. అనిరుద్ధ జోషి (రూ.20 ల‌క్ష‌లు)
22. పార్థివ్ పటేల్ (రూ.1.7 కోట్లు)
23. టిమ్ సౌథీ (రూ.కోటి)
24. ప‌వ‌న్ దేశ్‌పాండె (రూ.20 ల‌క్ష‌లు)

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Monday, January 29, 2018, 13:34 [IST]
Other articles published on Jan 29, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X