న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాపం పాకిస్థాన్: సహకరించని వరుణుడు, నాలుగో రోజు ఒక్క బంతి పడకుండా మ్యాచ్ రద్దు!

Rawalpindi Test: Rain continues to play spoilsport as Day 4 gets washed out

హైదరాబాద్: దశాబ్దం తర్వాత పాకిస్థాన్ వేదికగా టెస్టు సిరిస్ జరుగుతుంటే వరుణ దేవుడు మాత్రం అందుకు అనుమతించడం లేదు. ఐసీసీ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భాగంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ కోసం శ్రీలంక జట్టు ప్రస్తుతం పాకిస్థాన్‌లో పర్యటిస్తోంది.

ఈ టెస్టు సిరిస్ నిర్వహణ కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నానాతంటాలు పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాక్‌లో పర్యటించేందుకు శ్రీలంక క్రికెటర్లను ఒప్పించి మ్యాచ్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తే వరుణుడు మాత్రం అందుకు సహకరించడం లేదు.

IPL 2020: వేలంలో ఎప్పుడూ ఊహించనిదే జరుగుతుంది, మా ఎంపిక వారిపైనే: పాంటింగ్IPL 2020: వేలంలో ఎప్పుడూ ఊహించనిదే జరుగుతుంది, మా ఎంపిక వారిపైనే: పాంటింగ్

మూడో రోజైన శుక్రవారం ఆటలో భాగంగా కేవలం 5.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. దీంతో నాలుగో రోజైన వరుణుడు కరుణిస్తాడని స్టేడియం నిర్వాహాకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే, శనివారం ఒక్క బంతి కూడా పడకుండానే అంఫైర్లు ఆటను రద్దు చేశారు.

మైదానం చిత్తడిగా ఉండటంతో ఆటను రద్దు చేసినట్లు అంపైర్లు తెలిపారు. బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో ఇప్పటి వరకు 91.5 ఓవర్లు ఆడిన లంకేయులు 6 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేశారు.

శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లలో ధనంజయ డిసిల్వా(87), దిల్రువాన్ పెరీరా(6) క్రీజులో ఉన్నారు. శ్రీలంక బౌలర్లలో షహీన్ అఫ్రిది, నసీమ్ షా చెరో రెండు వికెట్లు తీయగా... ఉస్మాన్ ఖాన్, మహ్మద్ అబ్బాస్‌లకు ఒక వికెట్ లభించింది. పాక్ ఇంకా తొలి ఇన్నింగ్స్ కూడా ఆడకపోవడంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగియనుంది.

Story first published: Saturday, December 14, 2019, 16:09 [IST]
Other articles published on Dec 14, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X