న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే.. సినిమా ఇంకా ముగియలేదు మిత్రమా: ఉమేష్

Ravindra Jadeja trolls Umesh Yadav over weightlifting video

ముంబై: సొంతగడ్డపై భారత్‌ ప్రస్తుతం శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడుతోంది. ఈ సిరీస్ శుక్రవారంతో ముగియనుంది. ఆ వెంటనే ఆస్ట్రేలియాతో స్వదేశంలో మూడు వన్డే మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఈ రెండు సిరీస్‌ల అనంతరం న్యూజిలాండ్‌ పర్యటనకు భారత్‌ వెళ్లనుంది. ఆ పర్యటనలో ఇరు జట్లు ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనున్నాయి. జనవరి 24 నుంచి కివీస్‌లో టీమిండియా పర్యటించనుంది.

ఢిల్లీ కోర్టుకు వందనం.. ఇప్పుడు నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుంది: యువీఢిల్లీ కోర్టుకు వందనం.. ఇప్పుడు నిర్భయ ఆత్మకు శాంతి చేకూరుతుంది: యువీ

జిమ్‌లో కసరత్తులు:

జిమ్‌లో కసరత్తులు:

శ్రీలంక, ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్‌లకు ఉమేశ్‌ యాదవ్ ఎంపికవ్వలేదు. అయితే ఇటీవలి కాలంలో టెస్టుల్లో విశేషంగా రాణిస్తున్న ఉమేష్ కచ్చితంగా న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపికవనున్నాడు. ఈ నేపథ్యంలో కివీస్ పర్యటనకు ఉమేష్ సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో జిమ్‌ ( బరువులు ఎత్తుతున్న)లో కష్టపడుతున్న ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. 'మీరూ కూడా బరువులెత్తుతారా సోదరా' అని కాప్షన్ పెట్టాడు. ఈ వీడియోను చూసిన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా.. ఉమేశ్‌ను ట్రోల్ చేసాడు.

ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే:

ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే:

'ఆ మాత్రం బరువు అమ్మాయిలు కూడా ఎత్తగలరు' అంటూ ఉమేశ్‌ను జడేజా ట్రోల్‌ చేశాడు. అంతేకాదు నవ్వుతున్న ఎమోజీని జత చేశాడు. ఉమేశ్‌ కూడా జడ్డూ ట్వీట్‌పై స్పందించాడు. 'ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే. సినిమా ఇంకా ముగియలేదు మిత్రమా' అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ట్వీట్‌లు నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అభిమానులు తెగ లైకులు కొడుతూ.. షేర్ చేస్తున్నారు. ఉమేష్ 45 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి 142 వికెట్లు తీసాడు. 75 వన్డే మ్యాచ్‌ల్లో 106 వికెట్లు, 7 టీ20 మ్యాచ్‌లు ఆడి 9 వికెట్లు పడగొట్టాడు.

పేస్‌ విభాగం పటిష్టం:

పేస్‌ విభాగం పటిష్టం:

ప్రస్తుతం టీమిండియా పేస్‌ విభాగం ప్రపంచంలోనే అత్యంత పటిష్టంగా ఉంది. పరిస్థితులు ఎలా ఉన్నా టెస్టుల్లో 20 వికెట్లు పడగొడుతున్నారు మన బౌలర్లు. గాయాల కారణంగా పలానా బౌలర్ దూరమయ్యాడు అనే బెంగ ఇప్పుడు లేదు. సీనియర్, జూనియర్ బౌలర్లతో పేస్‌ విభాగం సమతూకంగా ఉంది. భువనేశ్వర్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, ఉమేష్ ఉమేశ్‌, ఇషాంత్‌ శర్మ లాంటి సీనియర్లు.. దీపక్ చాహర్, శార్దూల్ ఠాకూర్, నవదీప్ సైనీ లాంటి జూనియర్లు ఉన్నారు.

మీకే పాట ఇష్టం:

మీకే పాట ఇష్టం:

నెల రోజుల పరిధిలో టెస్టుల్లో రెండు ద్విశతకాలు బాదిన టీమిండియా యువ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌ కూడా బరువులు ఎత్తుతున్న వీడియోను సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు. కసరత్తులు చేసేటప్పుడు మీకే పాట ఇష్టమని అభిమానులను ప్రశ్నించాడు. రోహిత్ శర్మతో కలిసి మయాంక్‌ అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే.

Story first published: Thursday, January 9, 2020, 12:57 [IST]
Other articles published on Jan 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X