న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నిబంధనలు అన్నీ పక్కన పెట్టి.. మీకు నచ్చింది చేయండి: జడేజా

Ravindra Jadeja share his new hairstyle in Twitter

హైదరాబాద్: ఆస్ట్రేలియా పర్యటనలో గాయపడిన టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ప్రస్తుతం కోలుకుంటున్నాడు. జిమ్‌లో వ్యాయామాలు చేస్తూ.. మైదానంలో ప్రాక్టీస్ చేస్తూ ఫిట్‌నెస్‌పై దృష్టి సారిస్తున్నాడు. జడేజా మైదానంలోనే కాక.. సోషల్‌ మీడియాలో కూడా యా​క్టివ్‌గా ఉంటాడన్న విషయం తెలిసిందే. తన కుటుంబం, వర్కౌట్లకు సంబంధించిన వీడియోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటాడుడు. అయితే తాజాగా తన సరికొత్త మేకోవర్‌ ఫొటోను కూడా షేర్‌ చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

రవీంద్ర జడేజా తన కొత్త కేశాలంకరణను అభిమానులతో పంచుకున్నాడు. అందులో హెయిర్ స్టైలిస్ట్ జడేజా కేశాలను సెట్ చేస్తున్నాడు. ఆ ఫొటోను అభిమానులతో పంచుకుని ఓ కాప్షన్ ఇచ్చాడు. 'నిబంధనలు అన్నీ పక్కన పెట్టేయండి. మీకు నచ్చినట్లుగా తయారవ్వండి. మంచిగా డ్రెస్‌ చేసుకోండి. నలుగురిలో ప్రత్యేకంగా కనిపించండి' అంటూ రాసుకొచ్ఛాడు. తాజా ఫొటోను బట్టి చూస్తే జడేజా పూర్తిగా కోలుకున్నట్లే కనిపిస్తోందని, త్వరలోనే తనను మైదానంలో చూసే అవకాశం ఉందంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

సూపర్‌ఫామ్‌లో ఉన్న రవీంద్ర జడేజాను గాయాలు వెంటాడుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో అతడికి తొడ కండరాలు పట్టేశాయి. అయినా వేగంగా కోలుకుని రెండో టెస్టులో బరిలోకి దిగాడు. అంతేగాక విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టులో మరోసారి గాయపడ్డాడు. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ విసిరిన బంతికి అతడి బొటనవేలు విరిగింది. ఫ్రాక్చర్ అయిన జడేజా వేలుకు ఆస్ట్రేలియాలోనే సర్జరీ నిర్వహించారు. అది సక్సెస్ అయింది. జడ్డూకు కనీసం ఆరువారాల విశ్రాంతి అవసరం అయింది.

జడేజాకు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడంతో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌కు అతడు దూరమయ్యాడు. ఇక జడ్డూ స్థానంలో జట్టులోకి వచ్చిన మరో ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అరంగేట్ర టెస్టు మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో చెన్నైలో జరిగిన రెండో టెస్టులో ఐదు వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. మొటేరా వేదికగా జరిగిన పింక్‌బాల్‌ టెస్టులోనూ మొత్తంగా 11 వికెట్లు తీసి 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్'‌గా నిలిచిచాడు. ఇక ప్రస్తుతం జరుగుతున్న నాలుగో టెస్టులోనూ అక్షర్ ప్రభావం చూపుతున్నాడు. దీంతో జడేజా జట్టులో లేని లోటు పెద్దగా కనిపించడం లేదు.

India vs England: ఎంఎస్ ధోనీ చెత్త రికార్డు స‌మం చేసిన విరాట్ కోహ్లీ!!India vs England: ఎంఎస్ ధోనీ చెత్త రికార్డు స‌మం చేసిన విరాట్ కోహ్లీ!!

Story first published: Friday, March 5, 2021, 13:56 [IST]
Other articles published on Mar 5, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X