న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నా బయోపిక్‌లో అతడు నటిస్తే చూడాలని ఉంది: జడేజా

By Nageshwara Rao
Ravindra Jadeja names the actor he would want to play the lead in his biopic

హైదరాబాద్: రవీంద్ర జడేజా... ఆల్‌రౌండర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు. రాజ్‌పుత్ కుటుంబీకుడు కావడంతో స్వతహాగా గుర్రాలంటే పిచ్చి. మైదానంలో హాఫ్ సెంచరీ సాధించినప్పుడు బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ వినూత్నంగా సంబరాలు చేసుకుంటాడు.

సాధారణంగా ఎవరైనా తన జీవితంపై బయోపిక్ తీస్తే పెద్ద హీరోలు నటించాలని కోరుకుంటారు. కానీ, రవీంద్ర జడేజా మాత్రం తన జీవితంపై బయోపిక్ తీస్తే బాలీవుడ్‌‌కు చెందిన పెద్ద హీరోలను కాకుండా 'సీరియల్ కిస్సర్‌'గా పేరుగాంచిన ఇమ్రాన్ హష్మి నటించాలని కోరుకున్నాడు.

ఇమ్రాన్ హష్మి ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజహరుద్దీన్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన అజహర్ అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీసు విజయాన్ని నమోదు చేసింది. తాజాగా, క్రిక్‌ఇన్ఫో ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో రవీంద్ర జడేజా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

1
42374

క్రికెట్‌లో తన రోల్ మోడల్ ఎవరు? అన్న ప్రశ్నకు గాను జడేజా తడుముకోకుండా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ పేరు చెప్పాడు. జడేజాలాగే యువీ కూడా ఎడమచేతి వాటం బ్యాట్స్‌మెన్. టీమిండియా సాధించిన అనేక గొప్ప విజయాల్లో యువరాజ్ సింగ్‌ ముఖ్యభూమిక పోషించాడు. 2011లో ధోని నాయకత్వంలోని టీమిండియా వరల్డ్ కప్ విజేతగా నిలవడంతో కీలకపాత్ర పోషించాడు.

టెస్టు క్రికెట్‌లో ఫైవ్ వికెట్ల హాల్‌ లేదా సెంచరీ ఈ రెండింటిలో మీకు ఏది ఎక్కువ సంతృప్తినిచ్చిందని అడ్డగా... తన టెస్టు కెరీర్‌లో ఇప్పటివరకు తొమ్మిది సార్లు ఐదు వికెట్లను తీశానని, అయితే ఇంకా సెంచరీని నమోదు చేయలేదని జడేజా చెప్పుకొచ్చాడు.

ఒక ఆల్ రౌండర్‌గా మీ టెస్టు కెరీర్‌లో ఈ రికార్డు ఉంటే బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా? అన్న ప్రశ్నకు గాను ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లను తీయడంతో పాటు సెంచరీ చేయాలనేది తన చిరకాల కోరికని జడేజా వెల్లడించాడు.

కాగా, భారత్ తరుపున ఇప్పటివరకు 36 టెస్టులాడిన జడేజా 1196 పరుగులు సాధించాడు. ఇందులో 8 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక, బౌలింగ్‌లో 171 వికెట్లు తీశాడు. వన్డే క్రికెట్ విషయానికి వస్తే 136 వన్డేలాడి 1914 పరుగులు చేశాడు. వన్డేల్లో 155 వికెట్లు తీశాడు.

Story first published: Friday, August 3, 2018, 15:52 [IST]
Other articles published on Aug 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X