న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మంచి పిచ్ అంటే ఏంటీ.. విమర్శకులపై అశ్విన్ అసహనం!

Ravichandran Ashwin Tired Motera pitch criticism after test win against england

అహ్మదాబాద్‌: భారత్, ఇంగ్లండ్‌ మధ్య జరిగిన డే/నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగిసిన నేపథ్యంలో పిచ్‌ నాణ్యతపై చర్చ కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియా, ఇంగ్లండ్ మాజీ క్రికెటర్లు ఈ విషయంపై తమ విమర్శలు కొనసాగిస్తున్నారు. అయితే భారత స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు మాత్రం ఇది తీవ్ర అసహనాన్ని కలిగించింది. పిచ్‌ గురించి ప్రశ్నించిన ఒక ఇంగ్లండ్‌ మీడియా ప్రతినిధిపై అతను విరుచుకుపడ్డాడు. తాము ఎప్పుడూ గెలిచినా పిచ్‌ గురించే మాట్లాడతారని అతను అసహనం వ్యక్తం చేశాడు. మ్యాచ్‌‌‌‌‌‌‌‌ రిజల్ట్‌‌‌‌‌‌‌‌ అనంతరం పిచ్‌‌‌‌‌‌‌‌ కండిషన్‌‌‌‌‌‌‌‌పై విమర్శలు రావడం చాలాకాలంగా ఉందని ‌‌‌‌‌‌‌ అశ్విన్‌‌‌‌‌‌‌‌ అభిప్రాయపడ్డాడు. కనీసం ఒక్క పింక్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కూడా ఆడని వాళ్లు కూడా కామెంట్‌‌‌‌‌‌‌‌ చేయడం దురదృష్టకరమన్నాడు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు.

మంచి పిచ్ అంటే ఏంటీ?

మంచి పిచ్ అంటే ఏంటీ?

'బ్యాట్‌కు, బంతికి మధ్య సమంగా పోరాటం జరగాలని అంతా అంటారు కానీ అసలు మంచి పిచ్‌ అంటే ఏమిటి? ఆటలో బౌలర్లు వికెట్‌ తీయాలనుకుంటే బ్యాట్స్‌మెన్‌ పరుగులు తీసేందుకు ప్రయత్నించడం సహజం. మంచి పిచ్‌ అంటే ఏమిటో ఎవరు వివరిస్తారు. ఆరంభంలో పేస్‌కు అనుకూలించి ఆపై బ్యాటింగ్‌కు, చివరి రోజుల్లో స్పిన్‌కు అనుకూలించాలా? అసలు ఎవరు ఈ నిబంధనలు రూపొందించారు. ప్రతీ ఒక్కరికి తమ అభిప్రాయం ఉండవచ్చు కానీ దానిని ఇతరులపై రుద్దితే ఎలా? పిచ్‌లపై చర్చ చేయి దాటిపోతోంది. దీనిని ఆపి తీరాలి. మేం మరో దేశంలో ఆడినప్పుడో, మరో పిచ్‌ గురించి ఇంత చర్చ జరిగిందా? న్యూజిలాండ్‌తో మేం ఆడిన రెండు టెస్టులు కలిపి ఐదు రోజుల్లో ముగిసిపోయాయి. ఎవరైనా మాట్లాడారా? అయితే ఇలాంటి ఆలోచనాధోరణి నన్ను ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే దశాబ్దకాలంగా ఇది జరుగుతూనే ఉంది' అని అశ్విన్‌ అభిప్రాయపడ్డాడు.

యువీ ట్వీట్‌‌‌‌‌‌‌‌లో తప్పు లేదు

యువీ ట్వీట్‌‌‌‌‌‌‌‌లో తప్పు లేదు

మొతెరా వికెట్​ గురించి మాజీ ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌ యువరాజ్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ చేసిన ట్వీట్‌‌‌‌‌‌‌‌పై కూడా అశ్విన్‌‌‌‌‌‌‌‌ స్పందించాడు. 'యువరాజ్‌‌‌‌‌‌‌‌ చేసిన ట్వీట్‌‌‌‌‌‌‌‌ నేను కూడా చూశా. తనంటే చాలా గౌరవం ఉంది. ఆ ట్వీట్‌‌‌‌‌‌‌‌లో నాకు ఎలాంటి తప్పుడు ఉద్దేశం కనిపించలేదు. మనలో చాలా మంది ఎవరో చెప్పింది విని అదే నిజమనే భ్రమలో ఉంటున్నారు. అలాంటి వాళ్లలో పిచ్‌‌‌‌‌‌‌‌ వల్లే టీమ్‌‌‌‌‌‌‌‌ గెలిచిందని నమ్ముతున్న వారిని ఉద్దేశించే నేను ట్వీట్స్‌‌‌‌‌‌‌‌ చేశా. సరిగ్గా చెప్పాలంటే మనం చూసిన ఓ మ్యాచ్​లో భారత్ గెలిచిందంటే.. చాలామంది భారత్ గెలిచిందని సంతోషపడతారు. అదో గొప్ప ఫీలింగ్‌‌‌‌‌‌‌‌. కానీ ఇండియా కాదు పిచ్‌‌‌‌‌‌‌‌ గెలిపిస్తోందని అనే వాళ్లు కొందరు ఉంటారు. ఇలాంటి ఆలోచన అస్సలు ఉండకూడదు. కానీ అదే ఎక్కువ అవుతోంది' అని అశ్విన్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నాడు.

 మైలురాళ్ల గురించి ఆలోచనే లేదు..

మైలురాళ్ల గురించి ఆలోచనే లేదు..

టెస్ట్ క్రికెట్‌ లో 400 వికెట్ల మైలు రాయిని దాటిన అశ్విన్‌ .. అనిల్‌ కుంబ్లే 619 వికెట్ల ఘనతకు ఇంకా 218 వికెట్ల దూరంలో ఉన్నాడు. కుంబ్లే రికార్డును బ్రేక్‌‌‌‌‌‌‌‌ చేస్తారా అనే ప్రశ్నకు స్పందించిన అశ్విన్‌ మైలురాళ్ల‌‌‌‌‌‌‌ గురించి ఆలోచించడం మానేసి చాలా కాలమైందని అన్నాడు. 'నేను మైల్‌ స్టోన్స్‌‌‌‌‌‌‌‌ గురించి ఆలోచించడం మానేసి చాలా ఏళ్లు అయింది. నా ప్రదర్శన‌‌‌‌‌‌‌ ఎలా ఉంది. జట్టు‌‌‌‌‌‌‌ విజయానికి నేనే చెయ్యాలి వంటి విషయాల గురించే ఆలోచిస్తా. ఎందుకంటే కొంతకాలంగా నేను టెస్టులకే పరిమితమయ్యా. అందువల్ల అవకాశం‌‌‌‌ వచ్చిన ప్రతీసారి జట్టు కోరుకున్నది ఇవ్వాల్సి ఉంటుంది. ఓ వ్యక్తిగా, క్రికెటర్‌ గా ఎలా ఎదగాలనే దానిపైనే నా ఫోకస్‌‌‌‌‌‌‌‌ ఉంటుంది. దాని వల్లే చాలా హ్యాపీగా ఉంటున్నా. క్రికెట్‌‌ను ఆస్వాదిస్తున్నా. ఇదే పద్ధతిని కొనసాగిస్తా'అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.

Story first published: Sunday, February 28, 2021, 15:53 [IST]
Other articles published on Feb 28, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X