న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్‌తో 5‌వ టెస్ట్‌కు ముందు ఇండియాకు ఊరట.. వార్మప్ మ్యాచ్‌లో ఇండియా తడబ్యాటు

Ravichandran Ashwin joined the Indian Test squad After Recovery from corona

ఇంగ్లాండ్‌తో జరగబోయే ఐదో టెస్ట్ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ ఊరట కలిగించే విషయం. స్పిన్ ఆల్రౌండర్ ఆర్.అశ్విన్ జట్టుకు అందుబాటులోకి వచ్చాడు. లీసెస్టర్ షైర్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ ప్రారంభానికి ముందు జట్టుతో పాటు ప్రాక్టీస్ సెషన్లో పాల్గొన్నాడు. ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ కోవిడ్-19బారిన పడడంతో అతను టెస్ట్ జట్టుతో పాటు ఇంగ్లాండ్‌కు వెళ్లలేకపోయాడు. ఇక కొవిడ్ పరమైన ఐసోలేషన్ సహా అన్ని నిబంధనలు పూర్తి చేసిన అనంతరం అశ్విన్ ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. ఇక అశ్విన్ భారత్, లీసెస్టర్‌షైర్ మధ్య వార్మప్ మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్‌లో కన్పించాడు. ఈ ఫోటోలను బీసీసీఐ ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

చివరగా అశ్విన్ బయలుదేరాడు

చివరగా అశ్విన్ బయలుదేరాడు

ఇకపోతే ఇంగ్లాండ్ టెస్ట్ జట్టుకు సెలెక్ట్ అయిన ప్లేయర్లలో చాలా మంది జూన్ 16న ముంబై నుంచి ఇంగ్లాండ్‌కు బయలుదేరారు. కెప్టెన్ రోహిత్ శర్మ ఒక రోజు తర్వాత ఇంగ్లాండ్‌‌కు వెళ్లాడు. ఇక స్వదేశంలో దక్షిణాఫ్రికా టీ20I సిరీస్‌లో భాగమైన రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్.. బెంగళూరులో ఆదివారం 5వ టీ20 మ్యాచ్ వర్షం కారణంగా వాష్ అవుట్ అయిన తర్వాత.. జూన్ 19న సోమవారం ఇంగ్లాండ్‌కు బయలుదేరారు. చివరగా అశ్విన్ ఇంగ్లాండ్‌కు వెళ్లాడు. ఇకపోతే ఇదివరకే ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో టీమిండియా ఉంది. ఇక చివరిదైనా 5వ మ్యాచ్ కరోనా వ్యాప్తి వల్ల అప్పట్లో రద్దయింది. దీంతో 5వ టెస్ట్‌ను రీషెడ్యూల్ చేశారు. అయిదో టెస్టు జూలై 1న బర్మింగ్‌హామ్‌లో ప్రారంభం కానుంది.

ఆ ముగ్గురు ఫామ్‌లోకి రావాలి

ఆ ముగ్గురు ఫామ్‌లోకి రావాలి

ఇకపోతే లీసెస్టర్‌షైర్‌తో జరుగుతున్న నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇక లీసెస్టర్‌షైర్‌ జట్టులో భారత ఆటగాళ్లయిన చటేశ్వర్‌ పుజారా, రిషబ్‌ పంత్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, ప్రసిద్ధ్‌ కృష్ణ ఆడుతున్నారు. మిగతా వాళ్లు ఇండియా తరఫున బరిలోకి దిగారు. ఇక ఇటీవల ఫామ్ కోల్పోయిన విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, రోహిత్ శర్మ తిరిగి ఫామ్‌లోకి రావాల్సిన అవసరముంది.

ప్రాక్టీస్ మ్యాచ్‌లో తడబడుతున్న ఇండియా

ప్రాక్టీస్ మ్యాచ్‌లో తడబడుతున్న ఇండియా

ఇకపోతే ఈ మ్యాచ్‌లో ఇండియన్ బ్యాటర్లు పూర్తిగా తడబడుతున్నారు. లీసెస్టర్ షైర్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నారు. 19ఓవర్లు ముగిసేసరికి 54పరుగులకే మూడు వికెట్లు ఇండియా కోల్పోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ (25పరుగులు 47బంతుల్లో 3ఫోర్లు ), శుభ్ మాన్ గిల్ (21పరుగులు 28బంతుల్లో 4ఫోర్లు), హనుమ విహారి (3పరుగులు 23బంతుల్లో) నిరాశపరిచారు. ఇక క్రీజులో విరాట్ కోహ్లీ (4నాటౌట్), శ్రేయస్ అయ్యార్ (0 నాటౌట్) ఉన్నారు. విల్ డేవిస్ 1, రోమన వాకర్ 2 వికెట్లు తీసుకున్నారు.

జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(సి), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, హనుమ విహారి, శ్రీకర్ భరత్(w), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్

లీసెస్టర్‌షైర్ (బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ ప్లేయింగ్ 11): శామ్యూల్ ఎవాన్స్ (కెప్టెన్), లూయిస్ కింబర్, ఛెతేశ్వర్ పుజారా, రిషబ్ పంత్, రెహాన్ అహ్మద్, శామ్యూల్ బేట్స్ (వికెట్ కీపర్), రోమన్ వాకర్, జస్‌ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, విల్ డేవిస్, నాథన్ బౌలీ, అబిదిన్ సకాండే , జోయ్ ఎవిసన్

Story first published: Thursday, June 23, 2022, 17:12 [IST]
Other articles published on Jun 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X