న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Brisbane Test: టీమిండియాకు మరో షాక్.. బ్రిస్బేన్‌ టెస్టుకు అశ్విన్‌ దూరం!!

Ravichandran Ashwin doubtful for Brisbane Test
IND VS AUS 4th Test:Ravichandran Ashwin Doubtful for Brisbane Test| Washington Sundar| Kuldeep Yadav

బ్రిస్బేన్: సుదీర్ఘ ఆస్ట్రేలియా పర్యటనలో గాయాల రూపంలో టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతున్న విషయం తెలిసిందే. వ‌రుస‌గా ఒక్కో ప్లేయ‌ర్ గాయ‌ప‌డుతూ.. సిరీస్‌కు దూర‌మ‌వుతున్నారు. గాయ‌ప‌డి ఆస్ట్రేలియా టూర్‌కు మొత్తంగా దూర‌మైన వాళ్లు, మ‌ధ్య‌లో గాయ‌ప‌డి వెళ్లిపోయిన వారి సంఖ్య దాదాపు 10కి చేరింది. మూడో టెస్టులోనే ఐదుగురు ప్లేయర్స్ గాయాలపాలయ్యారు. ప్ర‌స్తుతం టీమ్ బౌలింగ్ భారాన్ని మోస్తున్న జ‌స్‌ప్రీత్ బుమ్రా ఉద‌ర కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో నాలుగో టెస్ట్‌కు దూర‌మ‌య్యాడు. తెలుగు క్రికెటర్ హనుమ విహారి, ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా కూడా గాయాలతో సిరీస్ నుంచి ఔట్ అయ్యారు.

అశ్విన్‌ దూరం

అశ్విన్‌ దూరం

మూడో టెస్టును డ్రాగా ముగించడంలో కీలకపాత్ర పోషించిన సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ప్రస్తుతం తీవ్ర వెన్నునొప్పితో సతమతమవుతున్నాడు. ప్రస్తుతం పెయిన్‌ కిల్లర్స్‌ తీసుకుంటున్న అశ్విన్‌.. నిర్ణయాత్మక బ్రిస్బేన్‌ టెస్టులో బరిలోకి దిగడం అనుమానంగా కనిపిస్తోంది. గాయంతో బాధపడుతున్న అశ్విన్‌ పూర్తి ఫిట్‌గా లేడని తెలుస్తోంది. చివరి టెస్టుకు మరొక్కరోజే సమయం ఉండడంతో రహానే సేనలో ఆందోళన మొదలైంది. ఒకవేళ యాష్ ఫిట్‌గా లేకుంటే.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశాలు ఉన్నాయి.

కుల్దీప్ ఆడుతాడా?

కుల్దీప్ ఆడుతాడా?

జనవరి 15 నుంచి బ్రిస్బేన్‌ టెస్టు ఆరంభం కానుండటంతో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన వాషింగ్టన్‌ సుందర్‌ అరంగేట్రం చేసే అవకాశం ఉందని సమాచారం తెలిసింది. రవీంద్ర జడేజా స్థానాన్ని సుందర్‌తో భర్తీ చేయాలని టీమ్‌మేనేజ్‌మెంట్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహ్మద్‌ సిరాజ్‌, శార్దుల్‌ ఠాకూర్‌, నవదీప్‌ సైనీ ముగ్గురు పేసర్లతో బరిలో దిగాలని టీమ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది. ఒకవేళ అశ్విన్ దూరమయి నలుగురు పేసర్లతో ఆడాలనుకుంటే.. టీ నటరాజన్‌ ఆడనున్నాడు. ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగితే.. కుల్దీప్ ఆడతాడు. రహానే ఎవరిని ఎంచుకుంటాడో చూడాలి.

గాయపడ్డవారి జాబితా చెప్పడం కన్నా

గాయపడ్డవారి జాబితా చెప్పడం కన్నా

ఐపీఎల్ 2020 నుంచి ఆస్ట్రేలియా పర్యటనవరకు ఎన్నడూ లేనివిధంగా భారత ఆటగాళ్లు గాయాల పాలయ్యారు. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇటీవలే కోలుకొని జట్టులోకి వచ్చాడనుకుంటే.. మరోవైపు గాయాలతో స్టార్ ఆటగాళ్లంతా ఒక్కక్కరుగా దూరమవుతున్నారు. భువనేశ్వర్ కుమార్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, హనుమ విహారి, జ‌స్‌ప్రీత్ బుమ్రా గాయాలతో ఆటకు దూరమయ్యారు. రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్ సైతం గాయపడినా నెట్టుకొస్తున్నారు. ఇప్పుడు అశ్విన్ ఆడడం కూడా అనుమానమే. దీంతో జట్టులో గాయపడ్డవారి జాబితా చెప్పడం కన్నా.. గాయపడని జాబితా చెప్పడమే చాలా సులువుగా ఉంది.

కెప్టెన్‌, వైస్ కెప్టెన్ వివాదంను వెంటనే పరిష్కరించాలి.. బీసీఏపై ఫైర్ అయిన ఇర్ఫాన్‌ పఠాన్‌!!

Story first published: Wednesday, January 13, 2021, 17:31 [IST]
Other articles published on Jan 13, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X