న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బెంగుళూరు టెస్టు: కుంబ్లే బంతుల రికార్డుని బద్దలు కొట్టిన అశ్విన్

బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

By Nageshwara Rao

హైదరాబాద్: బెంగుళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈసారి అశ్విన్ నెలకొల్పిన రికార్డు బంతులు పరంగా కావడం విశేషం.

బెంగుళూరులో ఆసీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఒక టెస్టు సీజన్‌లో అత్యధిక బంతుల్నివేసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. 2016-17 సీజన్‌లో 11 టెస్టు మ్యాచ్‌ల్లో 21 ఇన్నింగ్స్‌ల్లో అశ్విన్ 3749 బంతుల్ని సంధించి కొత్త రికార్డు నెలకొల్పాడు.

Ravichandran Ashwin breaks Anil Kumble's world record in Bengaluru Test

దీంతో టీమిండియా మాజీ స్పిన్నర్ ప్రస్తుత హెడ్ కోచ్ అనిల్ కుంబ్లే రికార్డుని అశ్విన్ అధిగమించాడు. అంతకుముందు 2004-05 సీజన్లో అనిల్ కుంబ్లే (3, 673 బంతులు) అత్యధిక బంతులు విసిరి తన పేరిట రికార్డు సృష్టించాడు. తాజాగా ఆ రికార్డును అశ్విన్ చెరిపేశాడు.

ఆస్ట్రేలియాతో బెంగుళూరులో జరుగుతున్న రెండో టెస్టులో మూడో రోజైన సోమవారం ఆటలో భాగంగా కుంబ్లే ఈ రికార్డుని నెలకొల్పాడు. అశ్విన్, కుంబ్లేల తర్వాత వినూ మన్కడ్ (1952-53 సీజన్‌లో 3,662 బంతులు), దిలీప్ జోషి (1979-80సీజన్‌లో 3515 బంతులు), రవీంద్ర జడేజా (2016-17 సీజన్‌లో 3469 బంతులు)వేసిన వారి జాబితాలో ఉన్నారు.

కాగా, ఒక సీజన్‌లో అత్యధిక బంతుల్ని వేసిన బౌలర్ల జాబితాలో టాప్-5లో ఉన్నవారంతా భారత స్పిన్నర్లు కావడం బెంగుళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో రవిచంద్రన్ అశ్విన్ 49 ఓవర్లు అంటే 294 బంతులు బౌలింగ్ చేశాడు.

ఒక సీజన్‌లో అత్యధిక బంతుల్ని వేసిన బౌలర్ల జాబితా:

రవిచంద్రన్ అశ్విన్ - 3,749 in 21 innings in 2016/17
అనిల్ కుంబ్లే - 3,673 in 22 innings in 2004/05
వినూ మన్కడ్ - 3,662 in 15 innings in 1952/53
దిలీప్ జోషి - 3,515 in 25 innigns in 1979/80
రవీంద్ర జడేజా - 3,469 in 21 innings in 2016/17

Story first published: Monday, November 13, 2017, 12:14 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X