న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అమ్ములపొదిలో కొత్త అస్త్రం: ఐపీఎల్‌లో లెగ్ స్పిన్నర్‌గా అశ్విన్‌

By Nageshwara Rao
Ravichandran Ashwin aims to bowl leg spin for Kings XI Punjab in IPL

హైదరాబాద్: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ తన అమ్ములపొదిలోకి మరో కొత్త అస్త్రాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ కొత్త అస్త్రం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? మణికట్టు స్పిన్. ఈ ఏడాది ఐపీఎల్‌లో అశ్విన్ ఈ మణికట్టు స్పిన్ బౌలింగ్‌తో బరిలోకి దిగినున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం విజయ్‌ హజారే ట్రోఫీలో తమిళనాడు జట్టుకు అశ్విన్ ప్రాతినిథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో భాగంగా సోమవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌ కొత్త తరహా బౌలింగ్‌‌తోనే ప్రత్యర్ధి జట్టు బ్యాట్స్‌మెన్లను ముప్పుతిప్పులు పెట్టాడు. 9.1ఓవర్లు వేసిన అశ్విన్‌ 38 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు.

దీంతో ఈ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్‌ అనంతరం అశ్విన్‌ మాట్లాడుతూ 'ఈ ఏడాది ఐపీఎల్‌లో కొత్త బౌలింగ్‌ యాక్షన్‌తో బరిలోకి దిగాలనుకుంటున్నా. నా అమ్ముల పొదిలో అస్త్రాలను పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా. అందులో భాగంగానే మణికట్టు స్పిన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నాను' అని చెప్పుకొచ్చాడు.

Ravichandran Ashwin aims to bowl leg spin for Kings XI Punjab in IPL

'చెన్నైలో లీగ్‌ క్రికెట్‌ ఆడేటప్పుడు నా ఆఫ్‌స్పిన్‌ శైలితో మంచి లెగ్‌బ్రేక్స్‌ వేసేవాణ్ని. అయితే ఆ తర్వాత నా అసలైన అస్త్రానికి పదును పెంచుకోవడం కోసం అలాంటి వాటిని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఎన్నో వైవిధ్యమైన బంతులేయగలను. దాదాపు పదేళ్లుగా ఆఫ్‌బ్రేకే నా ప్రధానాస్త్రం. ఈ నేపథ్యంలో మార్పులు చేసుకోవడం సవాలే' అని అన్నాడు.

టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఫామ్‌లో ఉనప్పుడు సెలక్టర్లు అశ్విన్‌కు వన్డే క్రికెట్‌ నుంచి విశ్రాంతి కల్పించారు. అదే సమయంలో యువ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్‌లు తమ మణికట్టు స్పిన్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత జట్టులో చోటు దక్కించుకుని జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు.

వీరిద్దరి రాకతో వన్డే, టీ20లకు అశ్విన్ దూరమయ్యాడు. అయితే, ఇంకా పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి ఆశలు వదులుకోని అశ్విన్ తిరిగి వన్డే, టీ20 జట్టులో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా అడుగులేస్తున్నాడు. ఇందులో భాగంగా
పరిస్థితులకు తగినట్లు ఆటలో మార్పులు చేసుకునేందుకు కృషి చేస్తున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Wednesday, February 7, 2018, 9:54 [IST]
Other articles published on Feb 7, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X