న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ravi shastri: ఎంఎస్ ధోనీ తర్వాత టీమిండియాకు సరైనోడు దినేష్ కార్తీకే..! ఎందుకో కారణం చెప్పిన శాస్త్రి

Ravi Shastri: We need Ms dhoni like Finisher, Dinesh Karthik can suitable to that role for TeamIndia in T20 World cup

ఎంఎస్ ధోనీ 2020లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాక.. అతని స్థానంలో టీమిండియాకు ఇప్పటికీ సరైన ఫినిషర్‌ దొరకలేదు. అయితే ఇటీవల వికెట్ కీపర్ కం బ్యాటర్ అయిన దినేష్ కార్తీక్.. ఐపీఎల్లో అద్భుతంగా రాణిస్తూ మంచి ఫినిషర్‌గా నిలిచాడు. ఇక దినేష్ కార్తీక్ రానున్న టీ20 ప్రపంచకప్ టైంలో ధోనీ స్థానంలో ఫినిషర్ రోల్ పోషించగలడని టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 2004లో టీమిండియా జట్టులో అరంగేట్రం చేసిన దినేష్ కార్తీక్.. 2006లో టీమిండియా తొలి టీ20 మ్యాచ్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక ఆ తర్వాత ఎంఎస్ ధోనీ హవా నడవడంతో దినేష్ కార్తీక్ మరుగునపడిపోయాడు. అతను చాలా సందర్భాల్లో టీమిండియా జట్టుకు ఎంపికకావడం.. కాస్త పేలవ ప్రదర్శన కన్పిస్తే జట్టులో చోటు కోల్పోవడం జరిగేవి. ఇక టీమిండియాకు కన్సిస్టెన్సీ ప్లేయర్‌గా మాత్రం దినేష్ కార్తీక్ కాలేకపోయాడు.

ఆర్సీబీ తరఫున అసలు సిసలు ఫినిషర్‌గా

ఆర్సీబీ తరఫున అసలు సిసలు ఫినిషర్‌గా

ఇక ఈ ఐపీఎల్లో ఆర్సీబీ తరఫున 36ఏళ్ల దినేష్ కార్తీక్ అద్భుత ప్రతిభ కనబరిచాడు. తనలోని ఫినిషర్‌ను బయటకు తీసుకొచ్చాడు. ధోనీ తరహా ఫినిషర్ రోల్‌లో దినేష్ కార్తీక్ ఆకట్టుకున్నాడు. దినేష్ కార్తీక్ 16మ్యాచ్‌లలో 183.33 స్ట్రైక్‌రేట్‌తో 330పరుగులు చేశాడు. అతడి అద్భుత ప్రదర్శన వల్ల దక్షిణాఫ్రికా పర్యటనకు బీసీసీఐ సెలెక్షన్ కమిటీ అతన్ని ఎంపిక చేసింది. ఇక ఈ వికెట్ కీపర్ కం బ్యాటర్‌ ఈ పర్యటనలో తానేంటో చూపించుకోవాల్సిన అవసరముంది.

దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మంచి ఆపర్చునిటీ

దక్షిణాఫ్రికా టీ20 సిరీస్ మంచి ఆపర్చునిటీ

రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని చెబుతూ.. దినేష్ కార్తీక్ ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచ‌కప్ కోసం ఎంపికవ్వాలంటే.. దక్షిణాఫ్రికాతో జరగబోయే టీ20 సిరీస్‌లో అతను సత్తా చాటాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. ఇది అతనికి ఓ గొప్ప ఆపర్చునిటీ. ఒకవేళ అతనికి ఈ సిరీస్‌లలో సరైన అవకాశం వచ్చినప్పుడు.. తప్పకుండా తనలోని బ్యాటింగ్ సత్తాను చూపించాలి. ఇక మనందరికీ తెలుసు అతనో అనుభవమున్న ప్లేయర్ అని. కాబట్టి ఈ అవకాశాన్ని చాలా ముఖ్యమైందిగా భావించి దినేష్ కార్తీక్ ఆడాలని' రవిశాస్త్రి స్టార్‌స్పోర్ట్స్‌తో అన్నాడు.

 ఫినిషర్ రోల్ పోషించే కీపర్ అయితేనే బెటర్

ఫినిషర్ రోల్ పోషించే కీపర్ అయితేనే బెటర్

ఇకపోతే టీమిండియాకు రిషబ్ పంత్‌ రూపంలో నాణ్యమైన వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌ ఉన్నాడు. అయితే ఈ లెఫ్టాండెడ్ బ్యాటర్‌ను రవిశాస్త్రి ఫినిషర్‌గా పరిగణించలేదు. అతను బ్యాటింగ్ ఆర్డర్లో కాస్త ముందుగా బ్యాటింగ్ దిగితే బాగుంటుందని, ఫినిషర్‌గా మాత్రం దినేష్ కార్తీకే సరైనోడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇక రవిశాస్త్రి మాట్లాడుతూ.. 'జట్టు కోణం నుంచి మనం చూడాలి. బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందే బ్యాటింగ్ చేసే కీపర్ కావాలా? లేదా ఫినిషర్‌గా బ్యాటింగ్ చేసే కీపర్ కావాలా? నేను నా మట్టుకైతే ఫినిషర్ రోల్‌లో బ్యాటింగ్ చేసే కీపర్‌నే జట్టులోకి ఎంపిక చేస్తాను.

ఎంఎస్ ధోనీ లాంటి ప్లేయర్ కావాలి

ఎంఎస్ ధోనీ లాంటి ప్లేయర్ కావాలి

'ఎందుకంటే మనకు జట్టులో ఎంఎస్ ధోనీ పాత్రను పోషించే కీపర్ కావాలి. టీమిండియాకు టీ20 క్రికెట్‌లో తొలి నాలుగు లేదా ఐదు స్థానాల్లో రిషబ్ పంత్ బ్యాటింగ్ చేయగలడు. అతన్ని అలా బ్యాటింగ్ ఆర్డర్లో కొనసాగిస్తే పోయేదేం లేదు. కానీ ఎంఎస్ ధోనీ జట్టును వీడాక.. జట్టులో మనకు ఎక్కువ మంది ఫినిషర్లు దొరకలేరు. కాబట్టి మ్యాచ్ ఫినిష్ చేయగల ప్లేయర్ మనకు కావాలి. కాబట్టి టీ20 ప్రపంచకప్ సందర్భంగా దినేష్ కార్తీక్‌కు ఫినిషర్ రోల్‌లో ఆడడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను భావిస్తున్నాను' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

Story first published: Sunday, June 5, 2022, 13:54 [IST]
Other articles published on Jun 5, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X