న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రవిశాస్త్రి సంచలన వ్యాఖ్యలు.. తొక్కలో టీ20 సిరీస్‌లు అవసరమా, ఓన్లీ టీ20వరల్డ్‌‌కప్ నిర్వహిస్తే చాలు..!

 Ravi Shastri suggests that cancel bilateral T20serieses and encourage franchise tournaments like IPL

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వంటి ఫ్రాంచైజీ టోర్నమెంట్లు నిర్వహించడానికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లను రద్దు చేసి, ప్రతి రెండేళ్లకోసారి టీ20 ప్రపంచకప్‌ నిర్వహిస్తే సరిపోతుందని టీమిండియా మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి సూచించారు. 2021 టీ20 ప్రపంచ‌కప్‌ సమయంలో టీమిండియా కోచ్‌గా రవిశాస్త్రి పనిచేసిన సంగతి తెలిసిందే. ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లను 'ఎవరూ పెద్దగా గుర్తుపెట్టుకోరు' అని కూడా శాస్త్రి అన్నారు. క్రికెట్ క్రీడ కూడా ఫుట్‌బాల్ లాగా మారాలని, ఫుట్‌బాల్‌లో క్లబ్ పోటీలు ఎక్కువగా జరుగుతాయని తెలిపారు. టీ20 ప్రపంచ‌కప్ వంటి పెద్ద టోర్నీలు నిర్వహించి అప్పుడే ఎక్కువ మ్యాచ్‌లు నిర్వహిస్తే సరిపోతుందన్నారు.

వరల్డ్ కప్ మాత్రమే గుర్తుంటుంది

వరల్డ్ కప్ మాత్రమే గుర్తుంటుంది

'ప్రస్తుతం టీ20 క్రికెట్లో దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు బాగా జరుగుతున్నాయి. ఎక్కువగా ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడాన్ని నేను టీమిండియాకు కోచ్‌గా ఉన్నప్పుడు కూడా నా కళ్లారా చూశా. టీ20 క్రీడా ఫుట్‌బాల్ మాదిరిలో జరగాలి. టీ20 క్రికెట్‌లో కేవలం ప్రపంచ‌కప్ మాత్రమే ఆడాలి. ద్వైపాక్షిక టోర్నమెంట్లు నిర్వహించినా అవి ఎవరు గుర్తుపెట్టుకోరు' అని రవిశాస్త్రి చెప్పాడు. 'ప్రపంచ కప్ మినహా గత ఆరేడేళ్లలో భారత కోచ్‌గా నాకు ఒక్క టీ20 ద్వైపాక్షిక సిరీస్ మ్యాచ్ కూడా గుర్తులేదు. కానీ వరల్డ్ కప్ మాత్రం గుర్తుంటుంది. ఏదో ఒక జట్టు ప్రపంచకప్‌ గెలిచి విజేతగా నిలుస్తుంది. అలా వరల్డ్ కప్ కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందరూ వరల్డ్ కప్ గుర్తుంచుకుంటారు.' అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ద్వైపాక్షిక సిరీస్‌లు తగ్గిస్తే

ద్వైపాక్షిక సిరీస్‌లు తగ్గిస్తే

'ద్వైపాక్షిక సిరీస్‌లను తగ్గిస్తే మీరు ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ క్రికెట్ ఎక్కువగా ఆడడానికి స్కోప్ ఉంటుంది. ప్రతి దేశం వారి ఫ్రాంచైజీ క్రికెట్‌ లీగ్ కలిగి ఉండటానికి వీలుంటుంది. అది వారి దేశీయ క్రికెట్‌కు, అంతర్జాతీయ క్రికెట్‌కు ఉపయోగపడుతుంది. ప్రతి రెండు సంవత్సరాలకు దేశాల మధ్య ప్రపంచ కప్ నిర్వహిస్తే మంచిది' అని రవిశాస్త్రి తన అభిప్రాయాన్ని పేర్కొన్నాడు.

ఏడాదికి రెండు సార్లు ఐపీఎల్ నిర్వహించొచ్చు

ఏడాదికి రెండు సార్లు ఐపీఎల్ నిర్వహించొచ్చు

ఇక ఐపీఎల్ భవితవ్యంపై ఆయన మాట్లాడుతూ.. 'ఐపీఎల్ లాంటి టోర్నీలదే భవిష్యత్తు. భవిష్యత్తులో ఒక ఏడాదిలో రెండు ఐపీఎల్ టోర్నీలు కూడా జరిగే అవకాశముంది. మొత్తం 140గేమ్‌లు, 70 - 70గా విభజించి అయిన ఒకే ఐపీఎల్ నిర్వహించే వీలుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ఇక ఐపీఎల్ వంటి టోర్నీలను ప్రేక్షకులు ఆదరిస్తున్న క్రమంలో దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం పెద్ద ప్రభావవంతంగా ఉండదు. వాటిని ఎవరూ గుర్తుంచుకోరని రవిశాస్త్రి ఖరాఖండిగా చెప్పేశాడు.

Story first published: Wednesday, June 1, 2022, 16:58 [IST]
Other articles published on Jun 1, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X