న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ టెస్ట్ టైంలో విరాట్ కోహ్లీ గణాంకాలు చూసి షాకయ్యా.. మిగతావాళ్లు దరిదాపుల్లో కూడా లేరు

Ravi Shastri Stunned About Virat Kohli Unique stat, and says Rest will Help Him to get Back

ఇంగ్లాండ్‌తో జరిగిన రీషెడ్యూల్డ్ టెస్టు మ్యాచ్ సమయంలో విరాట్ కోహ్లికి సంబంధించిన కొన్ని గణాంకాలను చూసి తాను అవాక్కయ్యానని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి పేర్కొన్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో కోహ్లీ ప్రస్తుతం పేలవ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అందువల్ల అతన్ని జట్టులో నుంచి తప్పించాలంటూ అనేక విమర్శలు కూడా వచ్చాయి. ఇక తాజాగా స్టార్ స్పోర్ట్స్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవిశాస్త్రి మాట్లాడుతూ.. డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్, బాబర్ ఆజామ్, జో రూట్ తదితరులతో పోలిస్తే విరాట్ కోహ్లీ మూడు రెట్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడని తెలిసి షాక్ అయినట్లు తెలిపాడు.

ఏ అగ్రశ్రేణి ఆటగాడు కూడా ఆడలేదు

ఏ అగ్రశ్రేణి ఆటగాడు కూడా ఆడలేదు

ఇటీవల కోహ్లీకి దక్కిన విశ్రాంతి అతను తిరిగి ఫామ్‌ అందుకోవడానికి సహాయపడుతుందని ఆశిస్తున్నట్లు చెప్పాడు. 'కొన్నిసార్లు ఈ విశ్రాంతి, ఇతర క్రికెటేతర విషయాల గురించి మాట్లాడటం చాలా ముఖ్యం. ఇంగ్లాండ్‌తో రీషెడ్యూల్డ్ టెస్ట్ సమయంలో కోహ్లీకి సంబంధించిన గణాంకాలు చూసి నేను షాకయ్యాను. గత మూడేళ్లలో ప్రపంచంలోని అగ్రశ్రేణి ఆటగాళ్ల మ్యాచ్‌ల విషయాన్ని గనుక చూస్తే.. విలియమ్సన్, డేవిడ్ వార్నర్, బాబర్ ఆజాం, విరాట్ కోహ్లీ, జో రూట్ ఆడిన మ్యాచ్‌లతో పోల్చితే విరాట్ అన్ని రకాల క్రికెట్‌లో మూడు రెట్లు ఎక్కువ మ్యాచ్‌లు ఆడాడు.' అని రవిశాస్త్రి తెలిపాడు.

విరామం మంచిదే

విరామం మంచిదే

ఇప్పటివరకు అతను దాదాపు 950 గేమ్‌లు ఆడాడు. అతని తర్వాత ప్రస్తుతమున్న స్టార్లలో కొందరు 400 మ్యాచ్‌ల వద్ద ఉన్నారు. అంటే కోహ్లీతో పోల్చితే సగం కంటే తక్కవ ఆడారు. మీరు ఒక జట్టు కెప్టెన్‌గా ఉన్నప్పుడు.. మూడు ఫార్మాట్లలో ఆడితే అది ఎంతో కొంత ఇబ్బంది అయితే కలుగుతుంది. అందువల్ల అతను చాలా ఆటలు ఆడి.. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టి కొంత అలసటకు గురై ఉంటాడనుకోవచ్చు. అది శారీరకం కాకున్నా మానసికమైనదై కూడా ఉండొచ్చు. ప్రస్తుతం అతని దాని నుంచి బయటపడ్డాడనుకుంటా. ఈ విరామం అతనికి మేలు చేస్తుంది. తద్వారా ఆ స్ట్రెస్ నుంచి రిలీఫ్ అయి అతను అద్భుతాలు చేయడానికి వీలవుతుంది' అని శాస్త్రి పేర్కొన్నాడు.

కఠినమైన పాచ్ నుంచి చాలా నేర్చుకున్నాడు

కఠినమైన పాచ్ నుంచి చాలా నేర్చుకున్నాడు

ప్రస్తుతం కోహ్లీ తాను ఎదుర్కొంటున్న కఠినమైన పాచ్ నుంచి చాలా నేర్చుకున్నాడని రవిశాస్త్రి తెలిపాడు. 'చాలా మంది అంటుంటారు.. ఒకటి లేదా రెండు ఇన్నింగ్స్‌లు కోహ్లీ నిలదొక్కుకుంటే చాలు.. అతను సెట్ అయిపోతాడని. అది ఎంతవరకు నిజమో కానీ.. అతనికి మంచి శారీరక బలం ఉంది. మానసిక బలం ఉంది. అంతకుమించి ఆడాలనే ఆకలి ఉంది. అభిరుచి ఉంది. ఇవి చాలు కోహ్లీ మళ్లీ మునుపటిలా ఆడ్డానికి. నేను హామీ ఇస్తున్నా కోహ్లీ తప్పకుండా తన కమ్ బ్యాక్ అందుకుంటాడని' అని రవిశాస్త్రి తెలిపాడు.

Story first published: Thursday, August 25, 2022, 14:22 [IST]
Other articles published on Aug 25, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X