న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'రవి శాస్త్రి.. సాకులు చెప్పకుండా నిజాలు చెప్పండి’

 Ravi Shastri Slammed On Twitter For Making Ravindra Jadeja Injury Claim

హైదరాబాద్: మీడియా సమావేశాల్లో ఆవేశంగా విరుచుకుపడి కామెంట్లు చేసేయడం.. నెటిజన్ల చేతికి దొరకడం రవిశాస్త్రికి అలవాటే. ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా విఫలమవడంతో ఘోరంగా విమర్శలు ఎదుర్కొన్న రవి శాస్త్రి పెర్త్ టెస్టు ఓటమితో మరోసారి బుక్కయ్యాడు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. జడేజా ఎంపికపై కొత్త విషయాలు బయటపెట్టాడు. అయితే మ్యాచ్ అనంతరం మాట్లాడిన కోహ్లీ.. జడేజాను తీసుకోకపోవడం తప్పేనని సమ్మతించాడు. వాటిని కప్పిపుచ్చిన రవి శాస్త్రి మీడియాతో జడేజా ఆరోగ్యం బాగాలేకపోవడంతోనే జట్టులోకి తీసుకోలేదంటూ చెప్పుకొచ్చాడు.

పెర్త్‌ టెస్టు నుంచి స్పెషలిస్ట్‌ స్పిన్నర్‌ను తీసుకోకపోవడంపై ఇప్పటికే వివాదాల్లో మునిగి తేలుతున్న రవిశాస్త్రి ఇప్పుడు మరోసారి నెటిజన్ల విమర్శలను ఎదుర్కొంటున్నారు. జడేజాకు పూర్తి ఫిట్‌నెస్ లేకనే పెర్త్‌ టెస్టుకు ఎంపిక చేయలేదని రవిశాస్త్రి వివరణ ఇచ్చుకున్న విషయం తెలిసిందే. అయితే ఆయన చెప్పిన సమాధానం సమంజసంగా లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ట్విటర్‌ వేదికగా ఆయనపై విమర్శల దాడి చేస్తున్నారు.

నం.12గా అతడిని ఎందుకు తెచ్చారు

జడేజా ఫిట్‌నెస్‌పై అంత శ్రద్ధ చూపేవాళ్లు నం.12గా అతడిని ఎందుకు తెచ్చారు? జడేజాకు గాయమైతే..కుల్‌దీప్‌ ఉన్నాడుగా. రెండో టెస్టుకు అతడిని ఎందుకు తీసుకోలేదు?'

సాకులు చెప్పకుండా నిజాలు చెప్పండి

‘కోచ్‌ అని చెప్పుకొని తిరిగే రవిశాస్త్రికి ఆ లక్షణాలే లేవు. జడేజా ఫిట్‌నెస్‌ బాగలేకపోతే అతడితో నెట్స్‌లో ఎందుకు ఫీల్డింగ్‌ చేయించారు. రెండో టెస్టులో నం.12గా ఎందుకు తెచ్చారు. తనకి విశ్రాంతి ఎందుకివ్వలేదు?. సాకులు చెప్పకుండా నిజాలు చెప్పండి'.

గుడ్డి వాళ్లలా కనిపిస్తున్నామా

మేము గుడ్డి వాళ్లలా కనిపిస్తున్నామా. ఇక్కడ రంజీ మ్యాచ్‌లలో ఆడి వికెట్లు పడగొట్టిన జడేజా ఆస్ట్రేలియా వెళ్లగానే 70% మాత్రమే ఆరోగ్యంగా అయిపోతాడా. అతని తప్పు కప్పిపుచ్చుకోవడం కోసం కబుర్లు చెప్తున్నాడు.

ఓటమి తర్వాత ఏదో ఒక సాకుతో

ప్రతి ఓటమి తర్వాత ఏదో ఒక సాకుతో వచ్చేస్తాడు. జడేజాకు గాయంగా ఉంటే అతనని ఎందుకు తీసుకున్నట్లు. కుల్దీప్‌ను వార్మప్ బెంచ్‌లకే ఎందుకు పరిమితం చేశారు. ఇద్దరు ఫ్రంట్ లైన్ స్పిన్నర్లు అందుబాటులో లేరా?

‘జడేజా భారత్‌లో దేశవాళీ క్రికెట్‌ ఆడుతున్నపుడే ఫిట్‌నెస్‌తో బాధపడ్డాడు. ఆస్ట్రేలియాకు వచ్చాక కూడా అలాగే ఉండటంతో వైద్యం చేయించుకున్నాడు. ఆ ప్రభావం నుంచి కుదురుకోవడానికి సమయం పట్టింది. అనుకున్నదాని కంటే కోలుకోవడానికి ఎక్కువ సమయం తీసుకున్నాడు. పెర్త్‌ టెస్టుకు ముందు అతను 70-80 శాతం ఫిట్‌నెస్‌తో ఉన్నట్లు అనిపించింది. మూడో టెస్టుకు 80 శాతం ఫిట్‌నెస్‌తో ఉంటే జడేజాను ఆడిస్తాం' అని రవిశాస్త్రి అనడంతో వివాదం రేగింది.

Story first published: Monday, December 24, 2018, 16:52 [IST]
Other articles published on Dec 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X