న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ravi Shastri : జీవితంలో ఏదీ శాశ్వతం కాదు..! మార్పు కావాల్సిందే.. గంగూలీ తర్వాత రోజర్ బిన్నీ వస్తే చరిత్ర

Ravi Shastri Says if Roger Binny Elected as a BCCI President It will be History

భారత మాజీ ప్లేయర్, మాజీ ప్రధాన కోచ్, కామెంటేటర్ రవిశాస్త్రి.. తన మాజీ సహచరుడు రోజర్ బిన్నీ తదుపరి బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ (బీసీసీఐ) ప్రెసిడెంట్ అవుతాడంటూ వస్తున్న వార్తల పట్ల సంతోషాన్ని వెలిబుచ్చాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ పదవీకాలం త్వరలో ముగియనుంది. దీంతో ఆ స్థానంలో 1983నాటి టీం ప్లేయర్ అయిన రోజర్ బిన్నీ అధ్యక్షుడు కాబోతున్నట్లు గత మూడు నాలుగు రోజులుగా మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే.

తొలిసారిగా ఆ పదవిని అలంకరించే ఆ ప్లేయర్‌గా..

తొలిసారిగా ఆ పదవిని అలంకరించే ఆ ప్లేయర్‌గా..

'బీసీసీఐ అధ్యక్షుడి విషయంలో రోజర్ పేరు వినిపించడం పట్ల నేను సంతోషిస్తున్నాను. 1983 నాటి ప్రపంచకప్‌లో అతను నా సహచర టీం మేట్. అతను ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. అతనికి తదుపరి ఉన్నత బాధ్యతలు అప్పజెప్పేందుకు మంచి అవకాశముంది. ఇప్పుడు అతను బీసీసీఐ అధ్యక్షుడిగా గనుక నియామితుడైతే బీసీసీఐ చరిత్రలో తొలిసారిగా ప్రపంచకప్ విజేత జట్టు ప్లేయర్ ఆ పదవిని అలంకరించినందుకు నేను చాలా సంతోషిస్తాను.' అని రవిశాస్త్రి తెలిపాడు. బుధవారం ముంబై ప్రెస్ క్లబ్‌లో జరిగిన స్టార్ స్పోర్ట్స్ ఇంటరాక్షన్‌లో ఈ విషయాలపై ఆయన మాట్లాడాడు.

కొత్త పనులెన్నో చేయగలడు

కొత్త పనులెన్నో చేయగలడు

బిన్నీ బీసీసీఐలో కొత్త శక్తిని తీసుకురాగలడని, అతని పదవీకాలంలో కొత్త పనులెన్నో చేయొచ్చని రవిశాస్త్రి చెప్పాడు. సౌరవ్ గంగూలీ ప్రెసిడెంట్‌గా తన పదవీకాలంలో దేశంలో మహిళల క్రికెట్‌ను హ్యాండిల్ చేసిన విధానం పట్ల తీవ్ర విమర్శలకు గురి అయిన సంగతి తెలిసిందే. అతని పదవీ కాలం కొన్ని మెరిట్స్, కొన్ని డిమెరిట్స్‌తో సాగింది. అయితే గంగూలీ, జై షా పదవీ కాలంలో బీసీసీఐ ఇండియన్ ప్రీమియర్ లీగ్ తదుపరి 5ఏళ్ల మీడియా హక్కులను మాత్రం రికార్డు రేటుకు విక్రయించగలిగింది.

అందుకే మార్పు కావాలి

అందుకే మార్పు కావాలి

'నేను మీడియాలో రోజర్ బిన్నీ గురించి వస్తున్న వార్తలను చదివాను. అయితే బీసీసీఐ అధ్యక్షుడి పదవిలో ఎవరూ రెండవసారి అధ్యక్షుడిగా కాలేదు. అందువల్ల గంగూలీ స్థానంలో బిన్నీ రావడం దాదాపు లాంఛనమే. ఇది మంచిదే. ఎందుకంటే మరొక క్రికెటర్‌కు ఆ పదవిలో పనిచేసే అవకాశం లభిస్తుంది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. మీరు కొన్నాళ్ల పాటు కొన్ని బాధ్యతలు నిర్వర్తించగలరు. ఆపై ఆ బాధ్యతల నుంచి తప్పుకుని ముందుకు సాగిపోవాల్సిందే. నేను ఈ రోజు ఓ కర్తవ్యం చేస్తున్నాను.. అంటే మరో మూడేళ్ల తర్వాత కూడా ఇదే కర్తవ్యంతో ముడిపెట్టుకుని ఉండను కదా.. కొత్త వ్యక్తులు వస్తారు, కొత్త వ్యక్తులు కూడా బాధ్యతలు స్వీకరిస్తారు. ఇది ఒక రకంగా ఆరోగ్యకరమైన వ్యవహరం. అందుకే మార్పు రావాలి.

డొమెస్టిక్ క్రికెట్ పట్ల శ్రద్ధ పెరగాలి

డొమెస్టిక్ క్రికెట్ పట్ల శ్రద్ధ పెరగాలి

'రోజర్ బిన్నీ స్వతహాగా ఒక క్రికెటర్ అయినందున.. అతను క్రికెటర్ల ఆసక్తి ప్రధానంగా తన బాధ్యతలను నిర్వర్తించగలడు. తనను తాను ఓ మార్క్ పనితీరుతో మెప్పించే ప్రయత్నం చేయగలడు. నా ప్రకారం.. అట్టడుగు స్థాయి నుంచి ప్రగతి కావాలి. కేవలం ఐపీఎల్, ఇంటర్నేషనల్ మాత్రమే కాకుండా.. డొమెస్టిక్ క్రికెట్ పట్ల కూడా శ్రద్ధ పెరగాలి.' అని రవిశాస్త్రి తెలిపాడు.

Story first published: Thursday, October 13, 2022, 8:49 [IST]
Other articles published on Oct 13, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X