న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సెలెక్టర్లకు ఎంత చెప్పినా వినిపించుకోలేదు.. ఆ ఒక్కడి కారణంగానే ప్రపంచకప్‌లు గెలవలేకపోయాం: రవి శాస్త్రి

Ravi Shastri says Hardik Pandya Injured became a Massive Problem for India in Couple of World Cups

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా‌కు ప్రత్యామ్నాయ ఆటగాడు లేకపోవడం వల్లనే కోచ్‌గా తన హయాంలో ప్రపంచకప్‌లు సాధించలేకపోయామని రవి శాస్త్రి వెల్లడించాడు. ఈ విషయం గురించి సెలెక్టర్లకు ఎంత చెప్పినా ఇప్పటికీ పట్టించుకోలేదన్నాడు. హార్దిక్ పాండ్యా వంటి పేస్ ఆల్‌రౌండర్ గాయపడితే మెగాటోర్నీలు గెలవడం చాలా కష్టమని రవి శాస్త్రి హెచ్చరించాడు. రవి శాస్త్రి హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో టీమిండియా దుమ్మురేపింది.

ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌లో అత్యున్నత శిఖరాలు అందుకుంది. విదేశాల్లో విజయాలు సాధిస్తూ ప్రపంచంలోనే అత్యుత్తమ జట్టుగా గుర్తింపు పొందింది. అయితే ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా గెలవలేకపోయింది. 2019 వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో ఓడిన భారత్.. డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓటమిపాలైంది. 2021 టీ20 ప్రపంచకప్‌లో లీగ్ దశలోనే ఇంటిదారిపట్టింది. ఈ టోర్నీతోనే హెడ్ కోచ్‌గా రవిశాస్త్రి పదవి కాలం ముగిసిపోయింది.

 హార్దిక్ సేవలను కోల్పోవడం వల్లే..

హార్దిక్ సేవలను కోల్పోవడం వల్లే..

కోచింగ్ అనంతరం కొన్నాళ్లు విశ్రాంతి తీసుకున్న రవిశాస్త్రి మళ్లీ కామెంటేటర్‌గా రీఎంట్రీ ఇచ్చాడు. తనదైన వ్యాఖ్యానంతో అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలోని వన్డే సిరీస్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే విండీస్‌తో రెండో వన్డే సందర్భంగా రవిశాస్త్రి మాట్లాడుతూ.. కోచ్‌గా తన హయాంలో ఐసీసీ టైటిల్ గెలవకపోవడానికి గల కారణాన్ని వెల్లండించాడు. 'టాప్-6 బ్యాటర్లలో ఒకరు బౌలర్ ఉండాలని నేనెప్పుడు కోరుకునేవాడిని. హార్దిక్ పాండ్యా గాయపడటంతో జట్టుకు ఇది తీవ్ర సమస్యగా మారింది.

 ఇప్పటికీ వెతకలేకపోయారు..

ఇప్పటికీ వెతకలేకపోయారు..

ఇది భారత జట్టుకు తీరని నష్టం చేసింది. ప్రపంచకప్ గెలవకపోవడానికి కారణమైంది. ఎందుకంటే మెగా టోర్నీల్లో టాప్-6లో బౌలింగ్ చేసే ప్లేయర్లు మాకు అందుబాటులో లేకుండా పోయారు. ఈ విషయాన్ని సెలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాం. హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయ ఆటగాడిని వెతికిపెట్టాలని సూచించాం. కానీ ఇప్పటికీ వారు ఆ పని చేయలేకపోయారు. ఈ సమస్యను పరిష్కరించకుంటే టీమిండియా ఐసీసీ టైటిళ్లు గెలవడం కష్టం.'అని రవి శాస్త్రి అభిప్రాయపడ్డాడు.

 రీఎంట్రీలో అదరగొట్టి..

రీఎంట్రీలో అదరగొట్టి..

పూర్తిగా ఫిట్‌నెస్ సాధించకుండానే టీ20 ప్రపంచకప్ బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా దారుణంగా విఫలమయ్యాడు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్‌లో నిరాశపరిచాడు. దాంతో భారత్ ఎన్నడూ లేని విధంగా పాక్ చేతిలో ఓడి లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ మెగా టోర్నీ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న హార్దిక్ పాండ్యా.. ఫిట్‌నెస్‌పై సీరియస్‌గా ఫోకస్ పెట్టి ఐపీఎల్ 2022 సీజన్‌తో రీఎంట్రీ ఇచ్చాడు. తనదైన ఆటతో కెప్టెన్‌గా గుజరాత్ టైటాన్స్‌కు టైటిల్ అందించాడు. ఆ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోనూ సత్తా చాటాడు. ఐర్లాండ్‌తో పాటు ఇంగ్లండ్‌తో సిరీస్‌ల్లో కీలక ఇన్నింగ్స్ ఆడి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరో మూడు నెలల్లో ప్రారంభంకానున్న ప్రపంచకప్‌లో హార్దిక్ కీలకం కానున్నాడు.

Story first published: Wednesday, July 27, 2022, 16:06 [IST]
Other articles published on Jul 27, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X