న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లాక్‌డౌన్‌లో విన్నూత్న ప్రయోగం.. రవిశాస్త్రిని వాడేసిన కేరళ పోలీసులు

Ravi Shastris Tracer Bullet Finds New Meaning In Kerala Police Campaign

తిరువనంతపురం: మహమ్మారి కరోనా వైరస్‌ కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. లాక్‌డౌన్‌ సందర్భంగా కేరళ పోలీసులు విన్నూత్న ప్రయోగం చేపట్టారు. ఇందులో భాగంగా టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి కామెంటరీని వాడేశారు. కేరళలో లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘిస్తున్న వారిని పట్టుకునేందుకు అక్కడి పోలీసులు డ్రోన్‌లను ఉపయోగించారు. డ్రోన్‌ కెమెరాలతో ప్రజలపై నిఘా ఉంచి లాక్‌డౌన్‌ను పటిష్టంగా అమలు చేస్తున్నారు.

సచిన్ బ్యాటింగ్ చేయడమే ఎప్పుడూ చూశా.. కానీ ఆ రోజు రాత్రి మాత్రం..: హర్భజన్సచిన్ బ్యాటింగ్ చేయడమే ఎప్పుడూ చూశా.. కానీ ఆ రోజు రాత్రి మాత్రం..: హర్భజన్

కేరళలోని పలు చోట్ల డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించిన వీడియోలను పోలీసులు ఎడిట్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. అయితే ఈ వీడియోలకు రవిశాస్త్రి కామెంటేటర్‌గా ఉన్న సమయంలో చెప్పిన 'ట్రేసర్‌ బుల్లెట్‌' పదాన్ని ఆడియోగా జత చేశారు. ఈ వీడియోలను కేరళ పోలీసులు ట్వీటర్‌లో పెట్టారు. ఈ వీడియోలు నవ్వులు పూయిస్తుండటంతో.. పోస్ట్‌ చేసిన కొద్ది సేపట్లోనే వైరల్‌గా మారింది. రవిశాస్త్రి కామెంటరీలో ఎంత వేగం ఉంటుందో అంతే వేగంగా వైరల్‌ అయ్యాయి.

రవిశాస్త్రి గతంలో కామెంటేటర్‌గా ఉండగా ఒక షాట్‌కు 'ట్రేసర్‌ బుల్లెట్‌' అనే పదాన్ని ఉపయోగిస్తాడు. దీనిని వాడాలని సహచర కామెంటేటర్‌లకు సైతం చాలెంజ్‌ విసురుతాడు. సవాల్ స్వీకరించిన సునీల్‌ గావస్కర్‌, సంజయ్‌ మంజ్రేకర్‌ తదితరులు తమ వ్యాఖ్యానంలో ట్రేసర్‌ బుల్లెట్‌ పదాన్ని ఉపయోగిస్తారు. అలా ఆ పదం అప్పుడు పాపులర్ అయింది. ఈ పదాన్ని ఇప్పుడు కేరళ పోలీసులు ఉపయోగించుకున్నారు. లాక్‌డౌన్‌ను నిబంధనల్ని ఉల్లంఘించిన వారిని చెదరగొట్టే క్రమంలో తీసిన డ్రోన్‌ కెమెరా వీడియోకు జోడిస్తున్నారు. మొత్తానికి రవిశాస్త్రిని ఇలా కూడా వాడేస్తున్నారు.

అంతకుముందు టీమిండియా కోచ్ రవిశాస్త్రి కూడా లాక్‌డౌన్‌ను ప్రతీ ఒక్కరూ పాటించాలని పిలునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా 'ట్రేసర్‌ బుల్లెట్‌' పదాన్ని ఉపయోగించాడు. 'ప్రతీ ఒక్కరూ ఇంట్లోనే ఉండండి. ఇది కీలకమైన దశ. ప్రపంచ వ్యాప్తంగా ఈ భయంకరమైన కరోనా.. ట్రేసర్ బుల్లెట్ లాగా దూసుకుపోతుంది. కరోనా రాకుండా ఉండాలంటే.. ఇంట్లోనే ఉండటం మంచిది' అని ఆయన అన్నాడు.

2019 వన్డే ప్రపంచకప్ నుంచి దాదాపు 10 నెలల పాటు భారత్ జట్టు వరుసగా సిరీస్‌లు ఆడింది. విండీస్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, విండీస్ సిరీసులను గతేడాది ఆడింది. ఈ ఏడాది ఆరంభంలో శ్రీలంకతో టీ20 సిరీస్, ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ఆడిన టీమిండియా.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే న్యూజిలాండ్ పర్యటనకి వెళ్లి ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల సిరీస్‌ని ఆడింది. ఆపై దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడింది. భారత్‌లో అన్ని క్రికెట్‌ మ్యాచ్‌లు రద్దు అవడంతో ఆటగాళ్లకు మంచే జరుగనుందని కోచ్‌ రవిశాస్త్రి పేర్కొన్నాడు. విరామం లేకుండా క్రికెట్‌ ఆడుతున్న క్రికెటర్లకు సరైన సమయంలో తగినంత విశ్రాంతి లభించిందన్నాడు.

Story first published: Thursday, April 9, 2020, 12:54 [IST]
Other articles published on Apr 9, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X