న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ravi shastri: కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించినప్పుడు హార్దిక్ పాండ్యా వేరే లెవల్ క్రికెటర్

 Ravi Shastri: Hardik Pandya is Completely Different Cricketer While He Has Captaincy Responsibility

భారతదేశపు అత్యుత్తమ ఆల్‌రౌండర్‌లలో ఒకడిగా హార్దిక్ పాండ్యా పేరు తెచ్చుకున్నాడు. ఇక ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన పాండ్యా తొలి సీజన్లోనే గుజరాత్‌కు టైటిల్ అందించగలిగాడు. ఇక అతని కెప్టెన్సీ నైపుణ్యం చూసిన చాలా మంది క్రికెట్ పండితులు, ఉద్ధండులు అతను జాతీయ జట్టుకు కాబోయే కెప్టెన్‌ అంటూ తమ విశ్లేషణలు కూడా అందించారు. ఇక గత నెలలో ఐర్లాండ్‌ పర్యటనలో టీమిండియా టీ20జట్టుకు కెప్టెన్సీ వహించిన హార్దిక్ సారథ్యంలోని జట్టు రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0తేడాతో క్లీన్ స్వీప్ చేయగలిగింది.

హార్దిక్ పాండ్యా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో మంచి సహకారం అందించగల ప్లేయర్. ఐపీఎల్ 2022లో అతను తన ఆల్రౌండర్ స్కిల్స్‌తో ఆకట్టుకున్నాడని టీమిండియా మాజీ ప్రధాన కోచ్, రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. అలాగే కెప్టెన్‌గా అదనపు బాధ్యతలు అప్పగించినప్పుడు కచ్చితంగా ఆటలోని అన్ని విభాగాల్లో పాండ్యా ప్రదర్శన వేరే లెవెల్లో ఉంటుందని చెప్పాడు.

'ఐపీఎల్లో అతన్ని గుజరాత్ టైటాన్స్ కొనుగోలు చేసింది. అలాగే అతనికి కెప్టెన్‌గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. ఈ నిర్ణయం అతనిలో మరో కొత్త కోణాన్ని బయటకు తీసింది. అతనికి అదనపు బాధ్యతలు అప్పగించినప్పుడు.. అతను కేవలం ఆల్రౌండర్ మాత్రమే కాదు అందుకు పూర్తిగా భిన్నమైన క్రికెటర్ అని అతను చెప్పాడు. అలాగే రవిశాస్త్రి ఇంకా అభిప్రాయపడుతూ.. ఐపీఎల్ 2022 వేలానికి ముందు ముంబై ఇండియన్స్ జట్టు అతనిని రిటైన్ చేయకూడదని నిర్ణయించుకోవడంతో పాండ్యా షాక్‌లోకి వెళ్లాడని వెల్లడించాడు. ఐదుసార్లు ఐపీఎల్ విజేత అయిన ముంబై జట్టులో చాలా మంది మ్యాచ్ విన్నర్లు కూడా ఉన్నారు. దీంతో రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, కీరన్ పొలార్డ్, సూర్యకుమార్ యాదవ్‌లను ఆ జట్టు రిటైన్ చేసుకుని హార్దిక్ పాండ్యాను వదులుకుంది.

ఇక మెగా వేలానికి ముందు గుజరాత్ టైటాన్స్ హార్దిక్ పాండ్యాను దక్కించుకుని కెప్టెన్‌గా ఎంచుకుంది. ఇకపోతే ఇంగ్లాండ్, ఇండియా మధ్య జరిగిన రెండో వన్డే సందర్భంగా రవిశాస్త్రి కామెంట్రీలో మాట్లాడుతూ.. 'ముంబై ఇండియన్స్ అతన్ని రిటైన్ చేయకపోవడం అతనికి షాకిచ్చింది. ముంబైలో ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఉన్నారు కాబట్టి వారు ఆ ఐదుగురిలో ముగ్గురిని ఎంచుకోవలసి వచ్చింది. ఇక వేలంలో ఇషాన్ కిషన్‌ను ముంబై ఎంచుకుంది' అని శాస్త్రి తెలిపాడు. ఇకపోతే ముంబై జట్టులోని అగ్రశ్రేణి ఆటగాళ్లు పేలవంగా ఆడడంతో ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి పడిపోయింది. 14లీగ్ మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌లు మాత్రమే ముంబై గెలిచింది.

Story first published: Sunday, July 17, 2022, 17:05 [IST]
Other articles published on Jul 17, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X