న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫీల్డింగ్ తొక్కలా ఉందనేలా విరుచుకుపడ్డ రవిశాస్త్రి..! ఐదారేళ్లుగా ఇలాంటి ఫీల్డింగ్‌ను టీమిండియాలో చూడలేదు

Ravi shastri Fired On Poor Fielding and missing Catches, and said that there is no X Factor player

మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత జట్టు ఫీల్డింగ్లో పేలవ ప్రదర్శన కనబర్చిన సంగతి తెలిసిందే. ఇక భారత పేలవ ఫీల్డింగ్‌పై భారత మాజీ ప్రధాన కోచ్ రవిశాస్త్రి విరుచుకుపడ్డాడు. ఫీల్డింగ్ తొక్కలా ఉందన్నట్లు మండిపడ్డాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 208పరుగుల భారీ స్కోరు చేసినప్పటికీ.. ఫీల్డింగ్ వైఫల్యం వల్ల భారత్ ఓటమికి దారులు చూసుకున్నట్లయింది. ఫలితంగా మంగళవారం మొహాలీలో రికార్డు స్కోరును కాపాడుకోలేకపోయింది.

యువ ప్లేయర్లు మిస్ అయ్యారు

యువ ప్లేయర్లు మిస్ అయ్యారు

'గత కొన్నేళ్లుగా అన్ని భారత టీంను పరిశీలిస్తే.. జట్టులో యూత్, అనుభవం కలగలిసిన ప్లేయర్లు ఉండేవారు. కానీ ఇప్పుడున్న టీంలో యువ ప్లేయర్లు లేరు. అదే నేను గుర్తించాను. అందుకే ఫీల్డింగ్ విషయంలో భారత జట్టు చురుకుగా ఉండలేకపోతుంది. గత ఐదు ఆరేళ్లలో భారత ఫీల్డింగ్ ఎంతో మెరుగైంది. కానీ నేడు నంబర్ ఆఫ్ క్యాచెస్ మిస్ చేస్తూ మ్యాచ్‌ను చేజేతులా ఓడిపోయేలా జట్టు చేసుకుంటుంది. గత ఐదారు ఏళ్లలో భారత జట్టు ఇలాంటి ఫీల్డింగ్‌తో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఫీల్డింగ్ భారత్‌ను పెద్ద టోర్నమెంట్‌లలో ఘోరాతి ఘోరంగా దెబ్బతీస్తోంది.' అని మ్యాచ్ తర్వాత స్టార్ స్పోర్ట్స్‌‌తో రవిశాస్త్రి చెప్పాడు.

మిస్ చేసిన ఆ రెండు క్యాచ్‌లు కీలకమైనవి

మిస్ చేసిన ఆ రెండు క్యాచ్‌లు కీలకమైనవి

ఇకపోతే నిన్నటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై భారత్ మొత్తం మూడు క్యాచ్‌లను వదిలివేసింది. వాటిలో రెండు చాలా కీలకమైనవి. హిట్టర్లయిన కామెరాన్ గ్రీన్, మాథ్యూ వేడ్‌లు ఇచ్చిన క్యాచ్‌లనే భారత ప్లేయర్లు జారవిడిచారు. వీరిద్దరూ ఆస్ట్రేలియా విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. గ్రీన్ 42పరుగుల వద్ద ఇచ్చిన లడ్డూ లాంటి క్యాచ్‌ను అక్షర్ పటేల్ మిస్ చేశాడు. అతను 30 బంతుల్లో 61పరుగులు చేసి ఆసీస్‌ లక్ష్య ఛేదనకు మంచి ఆరంభాన్నిచ్చాడు. అలాగే వేడ్ 21బంతుల్లో 45పరుగులతో అద్భుతంగా ఆడాడు. ఫీల్డింగ్ వైఫల్యం వల్ల భారత్ కొన్ని అదనపు పరుగులను ఇచ్చేసినట్లయింది.

ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎక్కడా?

ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ ఎక్కడా?

'ఇలాంటి ఫీల్డింగ్ పెట్టుకుని భారత జట్టు బరిలోకి దిగితే బ్యాటింగ్ చేసేటప్పుడే పిచ్ పరిస్థితుల కన్నా 15-20పరుగుల అదనంగా చేయాలి. ఎందుకంటే గ్రౌండ్లో జడేజా లాంటి ఫీల్డర్ లేడు. అలాంటి ఎక్స్-ఫ్యాక్టర్ ప్లేయర్ ఒక్కరు కన్పించడం లేదు.? ఈ రోజు నేను భారత ఫీల్డింగ్ నైపుణ్యం పట్ల పూర్తిగా నిరాశ చెందాను. నా ఉద్దేశ్యం ప్రకారం.. ప్లేయర్లు చాలా స్లోగా కనిపిస్తున్నారు. బిగ్ టోర్నీల్లో పెద్ద జట్లను ఓడించాల్సి వస్తే ఫీల్డింగ్ విషయంలో చాలా పెద్ద కసరత్తు చేయాల్సిందే' అని రవిశాస్త్రి అన్నాడు. ఇకపోతే తొలి టీ20లో ఓటమి తర్వాత 1-0తేడాతో భారత్ వెనకంజ వేసింది. ఇక రెండో మ్యాచ్ సెప్టెంబర్ 23న నాగ్‌పూర్‌లో జరగనుంది. మూడో మ్యాచ్ సెప్టెంబర్ 25న హైదరాబాద్లో జరగనుంది.

తొలుత పాండ్యా, రాహుల్, స్కై ఆడినా..

తొలుత పాండ్యా, రాహుల్, స్కై ఆడినా..

మ్యాచ్‌ విషయానికొస్తే.. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసి 208పరుగులు నమోదు చేసింది. స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా (71 నాటౌట్), కేఎల్ రాహుల్(55), సూర్యకుమార్ యాదవ్ (46) ధాటిగా ఆడారు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ మూడు వికెట్లు తీయగా.. కామెరూన్ గ్రీన్ రెండు, జోష్ హజెల్ వుడ్ ఓ వికెట్ పడగొట్టాడు. అనంతరం చేధనలో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6వికెట్లకు 211పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది. కామెరూన్ గ్రీన్ (61), మాథ్యూవేడ్ (45 నాటౌట్) చివర్లో ధాటిగా ఆడి విజయాన్ని ఆసీస్ ఖాతాలో వేశారు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్ మూడు వికెట్లు తీయగా.. ఉమేశ్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. చాహల్‌కు ఓ వికెట్ దక్కింది.

Story first published: Wednesday, September 21, 2022, 10:08 [IST]
Other articles published on Sep 21, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X