
అప్పటి నుంచి విభేదాలు
గత ఏడాది భారత్ జట్టుకు కోచ్ ఎంపిక కోసం సచిన్ టెండూల్కర్, గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్‌లతో ఓ కమిటీని నియమించారు. ఆ పదవికి రవిశాస్త్రి కూడా పోటీ పడ్డాడు. ఆ సమయంలో ఓ సమావేశానికి గంగూలీ గైర్హాజరవ్వడం తనను అవమానించినట్లుగా రవిశాస్త్రి భావించాడు. అప్పటి నుంచీ వీరిద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి.

ధోనియే అత్యుత్తమ కెప్టెన్ అని శాస్త్రి కితాబు
ఆ తర్వాత విస్డన్ ఇండియాకి ఇచ్చిన ఇంటర్యూలో రవిశాస్త్రి ధోనియే అత్యుత్తమ కెప్టెన్ అని కితాబిచ్చాడు. ధోని టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్సీకి వీడ్కోలు పలికిన తర్వాత భారత అత్యుత్తమ కెప్టెన్లంటూ మహేంద్ర సింగ్ ధోని, కపిల్ దేవ్, అజిత్ వాడేకర్‌ల పేర్లు చెప్పిన రవిశాస్త్రి.. గంగూలీ పేరు మాత్రం ప్రస్తావించని సంగతి తెలిసిందే.

తీవ్ర విమర్శలు
కపిల్ దేవ్, అజిత్ వాడేకర్, టైగర్ పటౌడీ, మహేంద్ర సింగ్ ధోనిలే భారత అత్యుత్తమ కెప్టెన్ల అంటూ రవిశాస్త్రి పేర్కొన్నాడు. అంతేకాదు పరిమిత ఓవర్ల కెప్టెన్సీ నుంచి తప్పుకున్న మహేంద్ర సింగ్ ధోనికి దాదా అనే పదాన్ని తగిలించాడు. 'దాదా కెప్టెన్' ధోని అంటూ కితాబిచ్చాడు. 'ఎంఎస్ ధోని సాధించలేనిది ఏదీ లేదు. దాంతో పాటు అతను నిరూపించుకోవాల్సి కూడా ఏమీ లేదు. కోహ్లికి పగ్గాలు అప్పజెప్పడానికి ధోని చేసిన త్యాగం చేశాడు. దాదా కెప్టెన్‌కు సలాం' అని అన్నాడు. దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి.

గంగూలీ భారత జట్టును నడిపించిన తీరు అద్భుతం
2000 సంవత్సరంలో మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణం భారత క్రికెట్‌ను కుదిపేసిన సమయంలో టీమిండియా పగ్గాలు అందుకున్న గంగూలీ భారత జట్టును అద్భుతంగా నడిపించి, ప్రపంచ అత్యుత్తమ జట్లలో ఒకటిగా నిలిపిన సంగతి తెలిసిందే. గంగూలీ నేతృత్వంలోని టీమిండియా 2003 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ పైనల్స్ వరకు వెళ్లింది.