For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2026: ప్యాట్ కమిన్స్‌ దూరం.. SRH కెప్టెన్‌గా ప్రపంచకప్ విన్నర్!

ఐపీఎల్ 2026 సీజన్‌ ప్రారంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. గాయంతో బాధపడుతున్న కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్యాట్ కమిన్స్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు. ఈ గాయం కారణంగానే అతను ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి దూరం కావాల్సి వచ్చింది. గతేడాది వెస్టిండీస్‌తో టెస్ట్ మ్యాచ్‌లో వెన్ను గాయానికి గురైన కమిన్స్.. ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో ఒక్క టెస్ట్ మాత్రమే ఆడాడు.

ఐపీఎల్ 2026 సీజన్‌కు దూరం..

గాయం తీవ్రత ఎక్కువ కావడంతో ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి దూరంగా ఉన్నాడు. గాయం నుంచి వేగంగా కోలుకుంటున్న కమిన్స్.. ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే ఛాన్స్ ఉంది. అతను మ్యాచ్ ఫిట్‌నెస్ సాధించేందుకు మరికొంత సమయం పట్టనుంది.

IPL 2026 Ishan Kishan Likely to Lead SRH in First Phase as Pat Cummins Recovers from Back Injury

ఏప్రిల్ మధ్యలో లేదా.. టోర్నీ సెకండాఫ్‌లో అతను జట్టుతో కలిసే అవకాశం ఉంది. కమిన్స్ గైర్హాజరీతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం మరింత బలహీన పడనుంది. అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరా? అనేది తెలియడం లేదు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీ గురించి సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే చేయలేదు.

చనిపోయిన మా అక్కకు అంకితం: ఇషాన్ కిషన్ చనిపోయిన మా అక్కకు అంకితం: ఇషాన్ కిషన్

కెప్టెన్‌గా ఇషాన్ కిషన్..?

ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ఎవరు నడిపిస్తారనేది తీవ్ర చర్చనీయాంశమైంది. అతని స్థానంలో ట్రావిస్ హెడ్ లేదా అభిషేక్ శర్మ తాత్కలిక కెప్టెన్‌గా ఉండొచ్చని వార్తలొచ్చాయి. అయితే ఈ ఇద్దరూ కాకుండా పాకెట్ డైనమట్ ఇషాన్ కిషన్ పగ్గాలు చెపట్టే అవకాశం కూడా లేకపోలేదు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మల కంటే సన్‌రైజర్స్ కెప్టెన్సీకి ఇషాన్ కిషన్ సరైనోడని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.

సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఇషాన్ కిషన్ తన సారథ్యంలోనే జార్ఖండ్‌ను విజేతగా నిలిపాడు. భారత్ టీ20 ప్రపంచకప్ 2026 నెగ్గడంలోనూ ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. 9 మ్యాచ్‌ల్లో 317 పరుగులతో రాణించాడు. అంతేకాకుండా అండర్ 19 ప్రపంచకప్‌లో భారత జట్టుకు సారథ్యం వహించిన అనుభవం కూడా అతనికి ఉంది.

అభిషేక్ శర్మ వద్దు..

మరోవైపు అభిషేక్ శర్మ పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్నాడు. ఈ పరిస్థితుల్లో అతనికి కెప్టెన్సీ ఇస్తే మరింత ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంది. ట్రావిస్ హెడ్‌కు కూడా కెప్టెన్ అంత అనుభవం లేదు. కాబట్టి సారథ్య బాధ్యతలు ఇషాన్ కిషన్‌‌కే ఇవ్వాలని ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మరీ కావ్య మారన్ సారథ్యంలోని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

ఆ తెలుగు సినిమా నా ఆల్‌టైమ్ ఫేవరేట్: అభిషేక్ శర్మఆ తెలుగు సినిమా నా ఆల్‌టైమ్ ఫేవరేట్: అభిషేక్ శర్మ

Story first published: Tuesday, March 17, 2026, 7:57 [IST]
Other articles published on Mar 17, 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+