న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

లంచ్ తర్వాత గ్యాలరీలో కునుకు తీసిన రవిశాస్త్రి (వీడియో)

By Nageshwara Rao
Ravi Shastri caught sleeping after lunch on Day 1

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య బుధవారం ఎడ్జ్ బాస్టన్ వేదికగా తొలి టెస్టు ఆరంభమైన సంగతి తెలిసిందే. ఈ టెస్టు మ్యాచ్‌లో లంచ్ విరామం అనంతరం టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి గ్యాలరీలో కూర్చుని నిద్రపోతూ కెమెరా కంటికి చిక్కాడు.

అదే సమయంలో కామెంటరీ చెబుతోన్న వెటరన్ క్రికెటర్ హర్భజన్‌ సింగ్‌.. శాస్త్రిని లేపే ప్రయత్నం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసలేం జరిగిందంటే..

1
42374
గ్యాలరీలో కూర్చుని ఉన్న రవిశాస్త్రి కునుకు

గ్యాలరీలో కూర్చుని ఉన్న రవిశాస్త్రి కునుకు

భారత్‌-ఇంగ్లాండ్‌ జట్ల మధ్య ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా బుధవారం తొలి టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. లంచ్‌ విరామం అనంతరం మ్యాచ్‌ జరుగుతోన్న సమయంలో గ్యాలరీలో కూర్చుని ఉన్న రవిశాస్త్రి కునుకు తీస్తూ కెమెరా కంటికి చిక్కాడు. ఆ సమయంలో హర్భజన్‌ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నాడు.

రవి నిద్ర నుంచి మేలుకో

"రవిశాస్త్రి నిద్రపోతున్నాడు. రవి నిద్ర నుంచి మేలుకో" అని కామెంటరీ గదిలో హర్భజన్ చెప్పడంతో నవ్వులు విరిశాయి. భజ్జీ అక్కడితో ఊరుకోకుండా రవిశాస్త్రి పక్కన ఉన్న మరో కోచ్‌ సంజయ్‌ బంగర్‌కు ఓ విన్నపం చేశాడు. తన మెసేజ్‌ను రవికి చెప్పాల్సిందిగా కోరాడు. ఆ తర్వాత రవిశాస్త్రికి సంజయ్ బంగర్ స్పీకర్‌ను అందించడంతో తాను శ్వాస పీల్చుతూ, వదులుతూ మెడిటేషన్‌ చేస్తున్నట్లు సైగలు చేస్తూ తెలిపాడు.

రవిశాస్త్రిని ఉద్దేశించి భజ్జీ కామెంట్

"నీ అంత బాగా నేను కామెంటరీ చేయలేను. రేపు వచ్చి నీ దగ్గర నేర్చుకుంటా" అని రవిశాస్త్రిని ఉద్దేశించి భజ్జీ అన్నాడు. దీంతో మరోసారి కామెంటేటర్లంతా నవ్వుకున్నారు. ‘టెస్టు మ్యాచ్‌ చూసే సమయంలో నిద్ర రావడం సహజం' అని కొందరు, జట్టు ఆడుతుంటే కోచ్‌ మ్యాచ్‌ చూడకుండా నిద్రపోతున్నాడు' అంటూ మరికొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

 తొలిరోజు భారత్‌దే పైచేయి

తొలిరోజు భారత్‌దే పైచేయి

ఇదిలా ఉంటే ఎడ్జ్‌బాస్టన్‌లో బుధవారం ప్రారంభమైన మొదటి టెస్ట్‌ తొలిరోజు భారత్‌దే పైచేయిగా నిలిచింది. ఇంగ్లీషు గడ్డపై అశ్విన్‌ అద్భుత ప్రదర్శనకు తోడు పేసర్లు కూడా రాణించడంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 285/9కే పరిమితమైంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేపట్టిన ఇంగ్లండ్‌ను కెప్టెన్‌ రూట్‌ (80; 156 బంతుల్లో 9 ఫోర్లు), బెయిర్‌ స్టో (70; 88 బంతుల్లో 9 ఫోర్లు) రాణించారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 104 రన్స్‌ జోడించి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. జెన్నింగ్స్‌ (98 బంతుల్లో 4 ఫోర్లతో 42) ఫరవాలేదనిపించారు. స్పిన్నర్‌ అశ్విన్‌ (4/60), షమీ (2/64) సత్తాచాటగా ఉమేష్‌, ఇషాంత్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

Story first published: Thursday, August 2, 2018, 14:22 [IST]
Other articles published on Aug 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X