న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రషీద్ ఖాన్ క్రికెట్ ప్రస్తానం మొదలైందిక్కడే (వీడియో)

Rashid Khan Takes Netizens Back To His First Cricket School

హైదరాబాద్: అఫ్ఘనిస్థాన్ టీనేజర్ రషీద్ ఖాన్ అంటే ప్రస్తుత క్రికెట్‌లో ఓ సంచలనం. షార్ట్ ఫార్మాట్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుని రికార్డులు చెదరగొడుతున్నాడు. క్రికెట్‌లో అడుగుపెట్టిన తొలినాళ్లలోనే రికార్డులు బద్దలు కొడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. ఐపీఎల్ సీజన్ నుంచి కేవలం బంతితోనే కాకుండా బ్యాట్‌తోనూ మెరిసి తనలోనూ ఒక ఆల్‌రౌండర్‌ ఉన్నాడంటూ ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లలోనూ నిరూపించుకున్నాడు.

ఇక వన్డేల్లో వేగంగా వంద వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా రికార్డులు సృష్టించిన ఈ యువ సంచలనం.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీ20 బౌలర్లలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా అతి తక్కువ కాలంలోనే రషీద్‌ ఖాన్‌ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. దీనికితోడు అత్యంత పిన్న వయస్సులోనే జాతీయ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలు సైతం చేపట్టాడు. భారత్‌తో టెస్టు ఫార్మాట్‌లోనూ అడుగుపెట్టిన చేసిన ఈ స్పిన్‌ సంచలనం తాజాగా తన క్రికెట్‌ ప్రయాణానికి సంబంధించిన ఓ వీడియోను ట్విటర్‌ ద్వారా పంచుకున్నాడు.

ఇక్కడే.. మా ఇంట్లోనే సోదరులతో కలిసి క్రికెట్‌ ఆడటాన్ని ఆరంభించానంటూ ఓ వీడియోను పోస్ట్‌ చేశాడు. అందులో.. ఇంట్లో అందరూ లెగ్‌స్పిన్నర్లే అంటూ.. బంతిని తిప్పడంలో పెద్దన్న అమీర్‌ఖాన్‌కు మంచి ప్రావీణ్యం ఉందంటూ రాసుకొచ్చాడు. అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్‌ అయింది.

ఇటీవల భారత్‌తో తొలి టెస్టు ఆడిన అఫ్గానిస్థాన్‌ 262పరుగుల తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. షార్ట్ ఫార్మాట్‌లో రాణించిన అఫ్ఘన్ స్పిన్నర్లు టెస్టులో రాణించలేకపోయారు. అంచనాలకు కూడా అందుకోలేక అభిమానులను నిరాశపరిచారు. దీనికితోడు బ్యాట్స్‌మెన్‌ కూడా విఫలం కావడంతో రెండు రోజుల్లోనే అఫ్గాన్‌ ఆట ముగిసింది. కాగా అఫ్గానిస్థాన్‌ వచ్చే ఏడాది ఐర్లాండ్‌తో రెండో టెస్టు ఆడనుంది.

Story first published: Thursday, June 21, 2018, 19:28 [IST]
Other articles published on Jun 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X