న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

9 ఓవర్లు 110 పరుగులు: వరల్డ్‌కప్ చరిత్రలో రషీద్ ఖాన్ చెత్త గణాంకాలు

Rashid Khans 110 of 9 Overs Becomes Most Expensive Bowling Figures in World Cup History

హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్‌లో ప్రపంచ అత్యుత్తమ స్పిన్నర్లలో ఆప్ఘన్ యువ సంచలనం రషీద్‌ ఖాన్‌ ఒకడు. అయితే, ఇంగ్లాండ్‌తో జరిగిన వరల్డ్‌కప్ మ్యాచ్‌లో ఓ చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. మాంచెస్టర్ వేదికగా మంగళవారం ఇంగ్లాండ్-ఆప్ఘనిస్థాన్ జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ తన కెరీర్‌లోనే అత్యంత చెత్త గణాంకాలను నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. 9 ఓవర్లు వేసి ఒక్క వికెట్ కూడా తీయకుండా 110 పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో వరల్డ్‌కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా రషీద్‌ నిలిచాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

దీంతో పాటు వన్డేల్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న ఆఫ్ఘన్ బౌలర్‌గా కూడా చెత్త రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఆప్ఘనిస్థాన్ తరుపున గుల్బదిన్ నైబ్‌ 101 పరుగులు ఇవ్వాగా... ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 110 పరుగులిచ్చి ఆ రికార్డుని బద్దలు కొట్టాడు. రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌లో ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్ 11 సిక్సర్లు సాధించారు.

1
43667

మోర్గాన్‌ సిక్సర్ల వర్షం

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ సిక్సర్ల వర్షం కురిపించాడు. 57 బంతుల్లో 11 సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న మోర్గాన్‌ దానిని సెంచరీగా మలచేందుకు ఆ తర్వాత 21 బంతుల్నే తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సిక్స్‌తో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా, సెంచరీనే కూడా సిక్స్‌తోనే సాధించాడు.

43వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు

వన్డేల్లో మోర్గాన్‌కి ఇది 13వ సెంచరీ. ఈ క్రమంలో రషీద్ ఖాన్ వేసిన 43వ ఓవర్లో ఏకంగా మూడు సిక్సర్లు బాది కేవలం 57 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు. ప్రపంచకప్ చరిత్రలో అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన నాలుగో ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.

నాలుగో వికెట్‌గా మోర్గాన్ ఔట్

అయితే 71 బంతుల్లో 17 సిక్సర్లు, 4 ఫోర్లతో 148 పరుగులు సాధించిన తర్వాత మోర్గాన్‌ నాలుగో వికెట్‌గా ఔటయ్యాడు. దీంతో పాటు ఈ మ్యాచ్‌లో మోర్గాన్ వన్డేల్లో 200 సిక్సర్ల మైలురాయిని అందుకున్నాడు. వన్డేల్లో ఈ ఘనత సాధించిన ఎనిమిదో బ్యాట్స్‌మన్ మోర్గాన్ అరుదైన ఘనత సాధించాడు.

అత్యధిక సిక్సర్ల కొట్టిన రికార్డు

ఈ క్రమంలోనే ఒక వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత సిక్సర్ల కొట్టిన రికార్డును సొంతం చేసుకున్నాడు. గతంలో వరల్డ్‌కప్‌లో విండిస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్‌ 16 సిక్సర్లు బాదగా... ఈ మ్యాచ్‌లో 17 సిక్సర్లు బాది మోర్గాన్ దానిని అధిగమించాడు. ఈ మ్యాచ్‌లో మోర్గాన్‌ సెంచరీకి తోడు బెయిర్‌ స్టో(90), జోరూట్‌(88)లు హాఫ్‌ సెంచరీలతో చెలరేగాు.

397 పరుగులు చేసిన ఇంగ్లాండ్

దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ప్రపంచకప్ చరిత్రలోనే ఇంగ్లాండ్‌కు ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మన్ మొత్తం 25 సిక్సుర్లు బాదారు. దీంతో పసికూన ఆప్ఘనిస్థాన్ జట్టుకు 398 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆప్ఘనిస్థాన్ బౌలర్లలో గుల్బదిన్ నైబ్, జాద్రన్ చెరో మూడు వికెట్లు తీసుకున్నారు.

Story first published: Tuesday, June 18, 2019, 19:29 [IST]
Other articles published on Jun 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X