న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'Camel' Bat In BBL: రషీద్ ఆ బ్యాట్‌ను ఐపీఎల్‌కు తీసుకురా అంటూ సన్‌రైజర్స్ ట్వీట్

Rashid Khan Introduces Camel Bat In BBL, SunRisers Hyderabad Ask Him To Carry It For IPL 2020

హైదరాబాద్: ఆప్ఘన్ ఆల్ రౌండర్ రషీద్‌ ఖాన్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న బిగ్‌ బాష్‌ లీగ్‌లో(బీబీఎల్‌) లీగ్‌లో అడిలైడ్ స్ట్రయికర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా ఆదివారం అడిలైడ్ స్ట్రయికర్స్-మెల్‌బోర్న్ రెనెగేడ్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్ సరికొత్త బ్యాట్‌తో అద్భుత ప్రదర్శన చేశాడు.

ముఖ్యంగా రెనెగేడ్స్ బౌలర్లపై విరుచకుపడ్డాడు. కేవలం 16 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సుల సాయంతో 25 పరుగులు సాధించాడు. ఇక, బౌలింగ్‌లో నాలుగు ఓవర్లు వేసి 15 పరుగులిచ్చి, రెండు వికెట్లు తీయడంతో పాటు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం క్రికెట్‌ ఆస్ట్రేలియా రషీద్ బ్యాట్‌ను 'ది కామెల్‌' అంటూ ట్వీట్ చేసింది.

ఓపెనర్‌గా సన్నీకి ఏ మాత్రం తీసిపోడు, నా తరంలో అతిపెద్ద మ్యాచ్‌ విన్నర్‌ అతడే: గంగూలీఓపెనర్‌గా సన్నీకి ఏ మాత్రం తీసిపోడు, నా తరంలో అతిపెద్ద మ్యాచ్‌ విన్నర్‌ అతడే: గంగూలీ

దీనిపై ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)లో రషీద్‌ ఖాన్ ప్రాతినిథ్యం వహిస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ ట్విట్టర్‌లో రషీద్‌ ఆ బ్యాట్‌ను 2020 ఐపీఎల్‌కు తీసుకురా అంటూ ట్వీట్‌ చేసింది. సన్‌రైజర్స్‌ ట్వీట్‌కు బదులు ఇచ్చిన రషీద్‌ ఖాన్... ఐపీఎల్‌ 2020కి తప్పకుండా కామెల్‌ బ్యాట్‌ తీసుకువస్తా అంటూ సమాధానమిచ్చాడు.

తొలుత బ్యాటింగ్‌ చేసిన అడిలైడ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ (51) హాఫ్ సెంచరీ చేయగా.. అలెక్స్ కారీ (41) రాణించాడు. అనంతరం బరిలోకి దిగిన మెల్‌బోర్న్‌ 137 పరుగులే చేసి ఓడిపోయింది. ఆరోన్ ఫించ్ (50) హాఫ్ సెంచరీ చేసినా జట్టును గెలిపించలేకపోయాడు. రషీద్‌ ఖాన్‌ (25, 2/15)కు 'మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' దక్కింది.

కాగా, ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ వేసిన మూడో బంతి మెల్‌బోర్న్‌ బ్యాట్స్‌మన్‌ వెబ్‌స్టర్‌ షాట్ ఆడగా.. బంతి కాస్త అతని ప్యాడ్‌లకు తగిలింది. వెంటనే ఎల్బీడబ్ల్యూ కోసం రషీద్‌ అప్పీలు చేశాడు. అంపైర్‌ గ్రెగ్ డేవిడ్సన్‌ ఔట్‌గా వేలు పైకెత్తి.. వెంటనే తన ముక్కుని రుద్దుకున్నాడు.

ఆటగాళ్లను ఆటపట్టించిన అంపైర్‌.. వీడియో చూస్తే నవ్వులే!!ఆటగాళ్లను ఆటపట్టించిన అంపైర్‌.. వీడియో చూస్తే నవ్వులే!!

అంపైర్‌ నిర్ణయాన్ని పూర్తిగా గమనించని అడిలైడ్‌ ఆటగాళ్లు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. రషీద్‌ సహచర ఆటగాళ్లతో సెలెబ్రేషన్స్ చేసుకున్నాడు. వెంటనే ఆటగాళ్లకు అంపైర్‌ సైగ చేసాడు. 'నేను ఔట్‌ అని ప్రకటించలేదు, కేవలం నా ముక్కుని రుద్దుకున్నా' అని సైగలు చేసాడు. అంపైర్‌ చేసిన సరదా పనికి ఆటగాళ్లు ఆశ్చర్యపోయారు.

మ్యాచ్‌ అనంతరం అంపైర్‌ ఘటన గురించి రషీద్‌ ఖాన్‌ మాట్లాడాడు. 'బ్యాట్స్‌మన్‌ ఔట్‌ అని సెలబ్రేషన్స్‌ మొదలుపెట్టాను. అంపైర్‌ ముక్కుని రుద్దుకున్నాని చెప్పడంతో ఆశ్చర్యపోయా. తర్వాత రిప్లేలో చూశాక ఎంతో సరదాగా అనిపించింది' అని అన్నాడు. ఈ మ్యాచ్‌లో రషీద్‌ ఖాన్‌ 'కామెల్‌ బ్యాట్‌' ఉపయోగించాడు.

Story first published: Monday, December 30, 2019, 12:11 [IST]
Other articles published on Dec 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X