న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆప్ఘన్ బాంబు పేలుళ్ల బాధితులకు ఈ అవార్డు అంకితం: రషీద్ ఖాన్

By Nageshwara Rao
Rashid Khan Dedicates Man of the Match Award to Afghanistan Blast Victims

హైదరాబాద్: రషీద్ ఖాన్... ఈ పేరు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 11వ సీజన్‌లో మారుమోగుతోంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం రాత్రి కోల్‌కతా నైట్‌‌రైడర్స్‌తో జరిగిన రెండో ‍క్వాలిఫైయర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు విజయంలో రషీద్ ఖాన్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ 10 బంతుల్లో 4 సిక్సులు, రెండు ఫోర్లు బాది 34 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరు అందించడంతో పాటు... కీలక సమయంలో 3 వికెట్లు పడగొట్టాడు. అంతే కాకుండా అత్యుతమ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. తన అద్భుత ఆటతీరుతో మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డుని దక్కించుకున్నాడు.

100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా

100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తా

ఈ సందర్భంగా రషీద్‌ ఖాన్ మాట్లాడుతూ బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌లో 100 శాతం ప్రదర్శన ఇవ్వడానికి ప్రయత్నిస్తానని చెప్పాడు. 'నా స్కిల్స్‌పై పూర్తిగా ఫోకస్ చేస్తా. బ్యాటింగ్‌లో మంచి ప్రదర్శన చేసినందుకు సంతోషం. చివర్లో ఆ మాత్రం ప్రదర్శన అనసరం. నా కెరీర్‌ను బ్యాట్స్‌మెన్‌గానే ప్రారంభించా. ఆ అనుభవం ఇప్పుడు బాగా కలిసొచ్చింది. లెంగ్త్‌ను అంచనా వేసి అందుకు తగినట్లుగా ఆడాను. స్ట్రైట్‌గా ఆడే దానిపైనే ఫోకస్‌ చేయమని కోచ్‌లు చెప్పారు. అదే చేశాను. విజయవంతం అయ్యాను' అని పేర్కొన్నాడు.

బాంబు పేలుళ్ల బాధితులకు విరాళం

బాంబు పేలుళ్ల బాధితులకు విరాళం

ఇక, మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డు అందుకున్న తర్వాత రషీద్ ఖాన్ తనకు వచ్చిన మొత్తాన్ని గతవారం అప్ఘనిస్తాన్‌‌లో జరిగిన బాంబు పేలుళ్ల బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించాడు. రంజాన్‌ మాసం కావడంతో నాన్‌గర్‌హార్‌ రాష్ట్ర రాజధాని‌ జలాలాబాద్‌లోని స్టేడియంలో క్రికెట్‌ టోర్నీని నిర్వహించారు.

ఒక్కసారిగా వరుస బాంబు పేలుళ్లు

ఒక్కసారిగా వరుస బాంబు పేలుళ్లు

ఇందులో భాగంగానే శుక్రవారం రాత్రి స్థానిక జట్ల మధ్య మ్యాచ్‌ నిర్వహించారు. ఈ మ్యాచ్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఒక్కసారిగా వరుస బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ వరుస బాంబు పేలుళ్లలో మొత్తం 8 మంది మృత్యువాత పడ్డారు.

మృతి చెందిన వారంతా క్రికెటర్లే

మృతి చెందిన వారంతా క్రికెటర్లే

మృతి చెందిన వారంతా క్రికెటర్లే అని స్థానిక వార్తా ఛానెళ్లలో వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో ఈ ప్రమాదంలో 45 మంది వరకు గాయపడ్డారు. ఈ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌పై గెలిచిన అనంతరం వచ్చిన మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను ఆసుపత్రిలో ఉన్న స్నేహితుడు, అతడి కుమారుడికి రషీద్‌ అంకితమిచ్చిన సంగతి తెలిసిందే.

Story first published: Saturday, May 26, 2018, 11:17 [IST]
Other articles published on May 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X