న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రంజీ క్రికెట్‌లో వింత ఘటన: 35/3 నుంచి 35 పరుగులకే ఆలౌట్

Ranji Trophy: Madhya Pradesh go from 35/3 to 35 all out against Andhra Pradesh

హైదరాబాద్: 35 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత ఒక్క పరుగు కూడా జోడించకండా ఆలౌటైంది. ఈ వింత ఘటన ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌‌లో చోటు చేసుకుంది. 23 బంతుల వ్యవధిలో ఒక్క పరుగు కూడా చేయకుండా మధ్యప్రదేశ్ జట్టు ఆరు వికెట్లు కోల్పోయింది.

<strong>బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించబోయి బోర్లాపడ్డాడు (వీడియో)</strong>బుమ్రా బౌలింగ్ యాక్షన్‌ను అనుకరించబోయి బోర్లాపడ్డాడు (వీడియో)

మరో బ్యాట్స్‌మన్ గాయం కారణంగా బ్యాటింగ్‌కు దిగలేదు. క్రికెట్‌లో ఇలాంటి వింత ఘటనలు అత్యంత అరుదుగా కనిపిస్తుంటాయి. ఇండోర్ వేదికగా జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో 343 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్.. కేవలం 35 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆంధ్రప్రదేశ్ 307 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

ఏడుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్

ఏడుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అంధ్రప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 132 పరుగులు చేయగా... మధ్య ప్రదేశ్ 91 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆంధ్ర ప్రదేశ్ 301 పరుగులు చేయగా, మధ్యప్రదేశ్ 35 పరుగులు చేసి దారణంగా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో మధ్యప్రదేశ్ జట్టులోని చివరి ఏడుగురు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు.

18 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసిన శశికాంత్

18 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసిన శశికాంత్

ఈ మ్యాచ్‌లో మొత్తం ఎనిమిది మంది డకౌట్లు అయ్యారు. మధ్య ప్రదేశ్ తరుపున ఆర్యమన్ బిర్లా(12), యశ్ దూబె (16) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ఆంధ్రప్రదేశ్ బౌలర్లలో శశికాంత్ 18 పరుగులు ఇచ్చి ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మరో బౌలర్ విజయ్‌కుమార్ 17 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

ఇదే అత్యల్ప స్కోరు కాదు

ఇదే అత్యల్ప స్కోరు కాదు

తొలి ఇన్నింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్ తరుపున ఆరు వికెట్లు తీసిన గిరినాథ్ రెడ్డికి రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ వేసే అవకాశం రాలేదు. అయితే, రంజీ క్రికెట్‌లో ఇదే అత్యల్ప స్కోరు కాదు. 2010/11 రంజీ సీజన్‌లో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు 21 పరుగులకే ఆలౌటైంది.

Story first published: Wednesday, January 9, 2019, 17:37 [IST]
Other articles published on Jan 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X