న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Ranji Trophy Final Day 2: కమాండింగ్ పొజిషన్లో మధ్యప్రదేశ్.. లీడ్ కోసం స్టడీగా బ్యాటింగ్

Ranji Trophy Final: Madhya Pradesh Steady Innings Makes a Commanding position ahead of 3rd day

రంజీ ట్రోఫీ 2021 - 22లో ముంబై వర్సెస్ మధ్యప్రదేశ్ జట్లు ఫైనల్లో తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్‌ ప్రారంభం కాగా.. తొలుత టాస్ గెలిచిన ముంబై మొదటి రోజు ఆట ముగిసే టైంకు 90ఓవర్లకు 5వికెట్లు కోల్పోయి 248పరుగులు చేసింది. ఇక రెండో రోజు గురువారం బరిలోకి దిగిన ముంబైను సర్ఫరాజ్ ఖాన్ (134పరుగులు 243బంతుల్లో 13ఫోర్లు, 2సిక్సర్లు) సెంచరీతో ఆదుకున్నాడు. ఈ క్రమంలో తన 8వ ఫస్ట్ క్లాస్ సెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. ఇక కెప్టెన్ పృథ్వీ షా-47, యశస్వి జైస్వాల్-78, అర్మాన్ జాఫర్-26 రాణించడంతో ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 374పరుగులకు ఆలౌట్ అయింది. మధ్యప్రదేశ్ బౌలర్లలో గౌరవ్ యాదవ్ 4, అనుభవ్ అగర్వాల్ 3, సారాన్స్ జైన్ 2, కుమార్ కార్తీకేయ 1 వికెట్‌తో రాణించారు.

 కమాండింగ్ పొజిషోన్లోకి మధ్యప్రదేశ్

కమాండింగ్ పొజిషోన్లోకి మధ్యప్రదేశ్

ఇక తొలి ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ కమాండింగ్ పొజిషన్లోకి వచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 41ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 123పరుగులు చేసింది. ముంబై కంటే ఇంకా 251పరుగుల వెనకబడి ఉంది. ఈ జట్టు ఓపెనర్లు హిమాన్షు మంత్రి, యష్ దుబే చాలా పట్టుదలగా ఆడారు. ఇక 16వ ఓవర్లో హిమాన్షు మంత్రి (31పరుగులు 50బంతుల్లో 3ఫోర్లు, 2సిక్సర్లు) తుషార్ దేశ్ పాండేకు ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. దీంతో 47పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.

అత్యంత జాగ్రత్తగా ఆడుతూ

అత్యంత జాగ్రత్తగా ఆడుతూ

ఇక తర్వాత క్రీజులోకి వచ్చిన శుభమ్ శర్మ గొప్ప పట్టుదల ప్రదర్శిస్తూ ఆడాడు. యశ్ దుబేతో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నమోదు చేసే దిశగా సాగుతున్నాడు. ఏమాత్రం ఎటాకింగ్ ఆడకుండా వికెట్ కాపాడుకోవడానికి వీరిద్దరు తీవ్ర ప్రయత్నం చేస్తున్నట్లు కన్పించింది. ఇక చెత్త డెలివరీలను కొన్నింటినీ బౌండరీలకు పంపించారు. ఇక ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సమయానికి యష్ దుబే (44పరుగులు 131బంతుల్లో 6ఫోర్లు నాటౌట్), శుభమ్ శర్మ (41పరుగుల 65బంతుల్లో 6ఫోర్లు నాటౌట్) క్రీజులో పాతుకుపోయారు. ప్రస్తుతం వీరిద్దరు 76పరుగుల భాగస్వామ్యంతో ఉన్నారు. దీంతో మధ్యప్రదేశ్ వైపు మ్యాచ్ ఎడ్జ్ అయినట్లు కన్పిస్తుంది.

 అదే జరిగితే రెండో ఇన్నింగ్స్ డ్రా అయినా మధ్యప్రదేశే విజేత

అదే జరిగితే రెండో ఇన్నింగ్స్ డ్రా అయినా మధ్యప్రదేశే విజేత

భారత దేశవాళీ క్రికెట్లో పేరెన్నికదగ్గ టోర్నమెంట్‌గా రంజీ ట్రోఫీకి పేరుంది. ఇక ఈ రంజీ టోర్నమెంట్లో ముంబై జట్టు ఇప్పటివరకు 41సార్లు విజేతగా నిలిచి ఈ టోర్నీలో ఆల్ టైం ఫేవరెట్ జట్టుగా తన పేరు లిఖించుకుంది. ఇక ఆ జట్టు మొత్తంగా 46 సార్లు ఫైనల్‌ చేరింది. మరోవైపు మధ్యప్రదేశ్‌ జట్టు మాత్రం ఒక్కసారి కూడా రంజీ టైటిల్‌ గెలవలేదు. ఇక 23ఏళ్ల క్రితం ఒక్కసారి ఆ జట్టు ఫైనల్ చేరినా.. ట్రోఫీ గెలవలేక రన్నరప్‌గా మిగిలిపోయింది. ఈసారి ఆ జట్టుకు గెలవడానికి గొప్ప అవకాశముంది. మొదటి ఇన్నింగ్స్‌లో లీడ్ సాధిస్తే.. రెండో ఇన్నింగ్స్ డ్రా అయినా ఆ జట్టు విజేతగా నిలుస్తుంది.

Story first published: Thursday, June 23, 2022, 19:08 [IST]
Other articles published on Jun 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X